rice water
ఈ రోజుల్లో గంజి తాగేవాళ్లు ఎవరైనా ఉన్నారా..? పూర్వం మన పెద్దవాళ్లు అన్నం వండేటప్పుడు.. గంజి వార్చి వండేవాళ్లు. ఆ గంజిలో కాస్త ఉప్పు వేసుకొని తాగేవారు. కానీ ఈ రోజుల్లో అసలు గంజి వంచి అన్నం వండుకునేవాళ్లే లేకుండాపోయారు. కుక్కర్ లో వండేస్తున్నవాళ్లే ఎక్కువయ్యారు. అసలు గంజి తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కి బదులు ఈ గింజి తాగితే మనలో జరిగే మార్పులేంటో చూద్దాం…
గంజి ఇంట్లో తయారు చేసుకోవడం చాలా సులభం. అయితే.. ఉదయం చేసిన గంజి ఉదయాన్నే తాగడం కాకుండా.. రాత్రిపూట వండిన అన్నం నుంచి వార్చిన గంజిని.. ఉదయాన్నే తాళింపు పెట్టుకొని తాగితే మరింత రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందట.
నిజం చెప్పాలంటే, మనమందరం పండగళ వేళ మన రెగ్యులర్ డైట్ ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. మనకు నచ్చిన అన్ని స్వీట్లు, ఆయిల్ ఫుడ్స్ అన్నీ తినేస్తాం. దానివల్ల తెలీకుండానే బరువు పెరిగిపోతాం. ఆ పెరిగిన బరువును గంజి తాగడం వల్ల తగ్గించవచ్చు. ఉదయంపూట రెగ్యులర్ గా గంజి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగిపోతాయి. మంచి డీటాక్స్ డ్రింక్ లా పని చేస్తుంది. ఫలితంగా పెరిగిన అధిక బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు.
ఈ అన్నం గంజిని పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. కాబట్టి, ఇది పేగులకు ఆరోగ్యంగా ఉంచే ప్రయోజనకరమైన ప్రోబయోటిక్ లను కలిగి ఉంటుంది. క్రమంగా మీ శరీరాన్ని తిరిగి సాధారణ స్థితి తీసుకురావడానికి సహాయపడుతుంది. మీరు ఈ గంజి రుచిని మెరుగుపరచడానికి, మీరు దీనికి జీలకర్ర, ఆవాలు, కరివేపాకులను జోడించవచ్చు, ఇది ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతుంది.
మరి ఈ కంజిని ఎలా తయారు చేయాలి..? దీనిని ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
rice water
అన్నం ఉడికించే సమయంలోనే గంజిని వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ గంజిలో ఉప్పు వేసి.. దానిపై ఏదైనా క్లాత్ కప్పి అలానే ఉంచాలి. గది ఉష్ణోగ్రత వద్ద దాదాపు 8 నుంచి 12 గంటలు అలానే ఉంచాలి. రాత్రంతా అలానే ఉంచేసి.. ఉదయాన్నే ఆ గంజికి తాళింపు కూడా జోడించి ఆ తర్వాత తాగేయడమే. రోజూ ఉదయాన్నే ఈ గంజి తాగడం వల్ల పైన చెప్పిన ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం సమస్య అనేది లేకుండా పోతుంది.