onion
టమాటా, ఉల్లిపాయలను ప్రతి ఒక్క కూరలో ఉపయోగిస్తుంటాం. అందుకే ఈ రెండు కూరగాయలు వంటింట్లో ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాం. నిజానికి ఉల్లిపాయ కూరల టేస్ట్ ను పెంచుతుంది. ఇదొక్కటే కాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కానీ.. రోజూ ఉల్లిపాయలను తినడం మంచిదేనా? అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు రోజూ ఉల్లిపాయలను తింటే మన ఆరోగ్యానికి ఏమౌతుందో ఓ లుక్కేద్దాం పదండి.
డయాబెటిస్..
ఉల్లిపాయ మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రిస్తాయి. డయాబెటీస్ పేషెంట్లు ఉల్లిపాయను రోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
కొలెస్ట్రాల్..
ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాదు ఇది మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎముకల ఆరోగ్యం..
ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. రోజూ ఉల్లిపాయలను తింటే ఎముకలు బలంగా ఉంటాయి.
రోగనిరోధక శక్తి..
ఉల్లిపాయల్లో విటమిన్ సి తో పాటుగా ఇతర యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అందుకే రోజూ ఉల్లిపాయలను మన రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.
ఊపిరితిత్తులు ఆరోగ్యం..
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉల్లిపాయలను రోజూ తినడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.
జీర్ణక్రియ..
ఉల్లిపాయల్లో ఫైబర్ కంటెంట్ కూడా మెండుగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్దకాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఉల్లిగడ్డ మేలు చేస్తుంది.
onion
క్యాన్సర్ నివారణ
ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్, ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా కొన్ని క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే రోజూ ఉల్లిపాయలను మోతాదులోనే తింటే క్యాన్సర్ల ముప్పు కూడా తప్పుతుంది.
మెదడు ఆరోగ్యం..
ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు మన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.
onion
బరువు తగ్గడానికి
ఉల్లిపాయలలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిలోని ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. మిమ్మల్ని ఎక్కువగా తినకుండా చేస్తుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు.
చర్మ ఆరోగ్యం..
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఉల్లిపాయలు మన చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది చర్మంపై ముడతలు, నల్ల మచ్చలు రాకుండా చేయడానికి సహాయపడుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మెరవడానికి కూడా సహాయపడుతుంది.