నెయ్యిలో ఇవి కలిపి తీసుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Sep 18, 2021, 3:24 PM IST

ఈ నెయ్యి రుచి గా మాత్రమే కాకుండా.. మనకు ఆరోగ్యాన్ని కూడా అందజేయాలి అంటే.. దీనికి  కొన్ని పదార్థాలు కలిపి తీసుకోవాలట. అవేంటో మనమూ ఓసారి  చూద్దాం...

దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటే ఆరోగ్య పదార్థాలలో నెయ్యి ఒకటి.  భారతీయులందరూ దీనిని కచ్చితంగా వినియోగిస్తూ ఉంటారు. చిన్న పిల్లలకు ప్రతిరోజూ ఈ నెయ్యితోనే భోజనం పెడతారు. ఇక చాలా కూరల్లో, వంటకాల్లో , ముఖ్యంగా స్వీట్ల తయారీలోనూ మనం నెయ్యిని జత చేస్తాం. ఈ నెయ్యి కారణంగా ఆ వంటకు అదనంగా రుచి వచ్చి చేరుతుంది. అయితే.. ఈ నెయ్యి రుచి గా మాత్రమే కాకుండా.. మనకు ఆరోగ్యాన్ని కూడా అందజేయాలి అంటే.. దీనికి  కొన్ని పదార్థాలు కలిపి తీసుకోవాలట. అవేంటో మనమూ ఓసారి  చూద్దాం...

1.దాల్చిన చెక్క..
దాల్చిన  చెక్కలో యాంటీ వైరల్ ప్రాపర్టీలు ఉంటాయి. అంతేకాదు.. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి సాధారణ వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడటానికి సహాయం చేస్తాయి. దాల్చిన చెక్క రక్తంలో చక్కెరను తగ్గించడానికి సహాయపడుతుంది. కడుపులో సమస్యలను కూడా తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది.

దాల్చిన చెక్కను నెయ్యితో కలిపి తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయట.  ఓ ప్యాన్ లో నెయ్యి వేసి.. అందులో రెండు దాల్చిన చెక్కలను వేయాలి. మీడియం మంట మీద నెయ్యిని 4 -5 నిమిషాలపపాటు వేడి చేసి చల్లారనివ్వాలి. వీటిని నెయ్యిలో వేసి వాడుకోవచ్చు. అలాకాదు.. మీరు ఇంట్లోనే వెన్న కరగపెట్టి నెయ్యి చేస్తున్నట్లయితే.. ఆ వెన్న కరగపెట్టేటప్పుడే దాల్చిన చెక్క వేసి మరగనిచ్చి వాడుకుంటే మరీ మంచిది.
 


2.పసుపు..
నెయ్యిలో పసుపు కలిపి తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. సులభంగా బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి సహాయ పడుతుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. శరీరంలో మంటను తగ్గిస్తుంది. చాలా రకాల నొప్పులను కూడా తగ్గిస్తుంది.

కాగా.. ఒక సీసా నెయ్యిలో  స్పూన్ పసుపు, అర స్పూన్ నల్ల మిరియాల పొడి వేసి బాగా కలపాలి. దానిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనే క ఉపయోగాలు కలుగుతాయి.

3.తులసి..

వెన్నను కరగపెట్టి నెయ్యిగా చేసుకుంటున్న సమయంలో అందులో కొద్దిగా తులసి ఆకులు జోడిచంాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన రాకుండా కాపాడుతుంది. నెయ్యికి మరింత పోషక విలువలను కూడా తీసుకువస్తుంది. తులసి రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయం చేస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది.
 

4.కర్పూరం..
నెయ్యిలో కర్పూరం కూడా కలిపి తీసుకోవచ్చట. కర్పూరం చేదు, తపీ రుచులకు కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల వాతా పిత సమస్యలు తగ్గుతాయి. జీర్ణ శక్తిని పెంచుతాయి. పొట్టలో పురుగులను చంపేస్తుంది. జ్వరాన్ని నివారిస్తుంది, హృదయ స్పందన రేటును పెంచుతుంది. కర్పూరం కలిపిన నెయ్యిని తయారు చేయడానికి, కేవలం 1-2 ముక్కలు తినదగిన కర్పూరాన్ని నెయ్యిలో వేసి 5 నిమిషాలు వేడి చేయండి. దీనిని వడకట్టి ఉపయోగించవచ్చు. అయితే.. ఈ కర్పూరం నెయ్యి లో వాసన డామినేషన్ ఎక్కువ కర్పూరానిదే ఉంటుంది.
 

5. వెల్లుల్లి..

నెయ్యిలో వెల్లుల్లి  కలిపి తీసుకోవడం వల్ల కూ మరింత రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తుందట. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీంలో మంటను తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి.  వెల్లలితో పాటు.. లవంగాలు కూడా నెయ్యిలో వేసి కలిపి తీసుకోవచ్చు. లవంగాలను కొద్దిగా వేడి చేసి,.  ఆ తర్వాత అందులో వెల్లులి, నెయ్యి కలపాలి,  కొద్ది గంటలు నానిన తర్వాత వాటిని వడగట్టాలి, ఇలా తీసుకోవడం వల్ల  ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

Latest Videos

click me!