బిజీ లైఫ్ లో.. సింపుల్ బ్రేక్ ఫాస్ట్ లు.. ఆరోగ్యంలోనూ టాప్..!

First Published | Sep 7, 2021, 11:19 AM IST

ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ మనకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. అయితే.. ఈ బ్రేక్ ఫాస్ట్ లోనూ.. సులభంగా జీర్ణమయ్యి.. మనకు త్వరగా శక్తిని ఇచ్చే వాటిని ఎంచుకోవాలి. 

ఆరోగ్యంగా ఉండాలంటే..ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ అస్సలు  స్కిప్ చేయకూడదు. కచ్చితంగా తీసుకోవాలి.  ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ మనకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. అయితే.. ఈ బ్రేక్ ఫాస్ట్ లోనూ.. సులభంగా జీర్ణమయ్యి.. మనకు త్వరగా శక్తిని ఇచ్చే వాటిని ఎంచుకోవాలి. అప్పుడు.. మనకు ఆరోగ్యం పూర్తి స్థాయిలో లభిస్తుంది.  అలాంటి ఆహారాలు.. మన భారతీయ వంటకాల్లో కొన్ని ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

1.పోహ..

చాలా మంది ఫేవరేట్ అల్పాహారాల్లో పోహ కూడా ఒకటి.  దీనిని తయారు చేయడం చాలా సులువు. చాలా లైట్ గా ఉంటుంది. దీనిలో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీనిలో మనకు నచ్చిన కూరగాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. అటుకులతో తయారు చేసే ఈ పోహ ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు.. సులభంగా జీర్ణమౌతుంది.
 


Quinoa Upma

2.ఉప్మా..
అత్యుత్తమ దక్షిణ భారత అల్పాహారాల్లో.. ఉప్మా కూడా ఒకటి. దీనిని కూడా రకరకాలుగా చేసుకోవచ్చు. గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, సెమ్యా ఇలా దేనితో చేసినా.. ఎన్ని కూరగాయలు వేసి చేసినా.. రుచి బాగుంటుంది.ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు.

3.మూంగ్ దాల్ చీలా..
దాదాపు అందరు భారతీయుల ఇళ్లల్లో మూంగ్ దాల్ ఉంటుంది.  దీనితో ఎన్నో రకాల బ్రేక్ ఫాస్ట్ లు చేసుకోవచ్చు. వాటిలో ఈ మూంగ్ దాల్ చీలా కూడా ఒకటి. ఇది చాలా రుచిని అందిస్తుంది. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. సులభంగా జీర్ణమౌతుంది. ఆరోగ్యాన్ని అందిస్తుంది.

4.ఇడ్లీ..
దక్షిణాది అల్పాహారాల్లో మొదటగా వినపడే పేరు ఇడ్లీ. చిన్న పిల్లల నుంచి ఎవరికైనా సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇది. దీనితో రోజు ప్రారంభించే చాలా బాగుంటుంది. దీనిని పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్ లతో కలిపి తీసుకోవచ్చు. దీని తయారీ కూడా  చాలా సులభం.
 

5.మిక్స్డ్ వెజ్ పరాటా..
అన్ని కూరగాయలు కలిపి. వెజ్ పరాటా చేసుకొని తింటే.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ పరాటాకి కాంబినేషన్ గా పప్పు, కర్రీ, చట్నీ.. ఇలా  ఏదైనా కాంబినేషన్ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కూరగాయలను కలిపి తీసుకోవడం వల్ల ఇది ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
 

6.ఉగ్గాని..
దీనినే  బరుగులు ఉప్మా అని కూడా పిలుస్తారు. ఇది చాలా సులభంగా జీర్ణమౌతుంది. మరమరాలతో చేసే ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేయడం కూడా చాలా సులువు అని చెప్పొచ్చు. దీనితో పాటు.. కాఫీ తాగడం లేదా.. బటర్ మిల్క్ లాంటివి తీసుకుంటే.. ఇంకా బాగుంటుంది.

ఈ మరమరాలను బియ్యంతో తయారు చేస్తారన్న విషయం  తెలిసిందే. వీటిలో ఎలాంటి ఫ్యాట్ కంటెంట్ ఉండదు. వీటిలో పల్లీలు, ఉల్లిపాయలు లాంటివి కలుపుకొని తినొచ్చు.
 

7.మేథీ ముథియా..
గుజరాత్ స్పెషల్ వంటకం ఈ మేథీ ముథియా. మెంతు ఆకులతో.. ఈ వంటకాన్ని తయారు చేస్తారు.  మెంతి ఆకులతోపాటు.. ఇతర ఆకులు అంటే.. పాలకూర లాంటివి కూడా కలిపి దీనిని తీసుకోవచ్చు. ఆకుకూరలు తీసుకుంటాం కాబట్టి.. ఇది చాలా ఆరోగ్యాన్ని అందిస్తుంది. 

Latest Videos

click me!