వీటిని తింటే మీ కిడ్నీలు సేఫ్..!

First Published | Jul 3, 2023, 2:46 PM IST

అధిక రక్తపోటు, డయాబెటీస్ వంటి రోగాలు కూడా కొన్ని కొన్ని సార్లు మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి. మూత్రం  లేదా మూత్రిండాల్లో రాళ్లు కూడా మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. 
 

kidney health

మారుతున్న జీవన శైలికి అనుగుణంగా మన ఆరోగ్య అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి.  మన శరీరం నుంచి మలినాలను బహిష్కరించే అవయవం మూత్రపిండాలు. కాగా ప్రస్తుత కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులు కూడా కొన్నిసార్లు మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి. మూత్రం లేదా మూత్రపిండాలలో రాళ్లు కూడా మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే డాక్టర్ సలహా ప్రకారమే పెయిన్ కిల్లర్స్ ను తీసుకోండి. 

kidney health

అయితే మూత్రపిండాల వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించడానికి మనం తినే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మూత్రపిండాల ఆరోగ్యం కోసం డైట్ లో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 


రెడ్ క్యాప్సికం

రెడ్ క్యాప్సికమ్ లో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది. రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
 

బెర్రీలు

బెర్రీలు మనల్నిఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఈ పండ్లు కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 

onion

ఉల్లి

ఉల్లి మన చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి వాటిని మీ ఆహారంలో చేర్చడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది. 

cabbage


క్యాబేజీ

క్యాబేజీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగున్న కూరగాయ. వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే మీ మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది. 

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజలు మనకు ఎంతో మేలు చేస్తాయి. పోషకాలు పుష్కలంగా ఉండే గుమ్మడికాయ గింజలు మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
 

చెర్రీలు

విటమిన్ల భాండాగారం చెర్రీలు. చెర్రీలను తింటే అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. ఉన్నో పోషకాల లోపం కూడా పోతుంది. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.

పసుపు

పసుపునకు కర్కుమిన్ అనే రసాయనం రంగును ఇస్తుంది. ఇది అనేక వ్యాధుల నుంచి బయటపడటానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పసుపును డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యం బాగుంటుంది. 

కొవ్వు చేపలు

కొవ్వు చేపలు మన  ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి  మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

ఆలివ్ ఆయిల్

కిడ్నీ వ్యాధులు ఉన్నవారు ఆలివ్ ఆయిల్ ను ఖచ్చితంగా వాడాలి. ఇది ఆరోగ్యకరమైన కొవ్వుకు మూలం. మూత్రపిండాల ఆరోగ్యాన్ని రక్షించడానికి కూడా ఇవి సహాయపడతాయి.
 

Latest Videos

click me!