వీటిని తింటే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది

First Published | Jun 30, 2023, 3:15 PM IST

మారుతున్న జీవనశైలి అలవాట్ల వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం వల్ల ఈ ముప్పు తప్పుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

heart health

గుండె సంబంధిత వ్యాధుల ముప్పు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అలాగే గుండెపోటు, స్ట్రోక్ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. స్మోకింగ్, శారీరక స్థిరత్వం, తప్పుడు ఆహారపు అలవాట్లు, ఊబకాయంతో పాటుగా ఇతర చెడు జీవనశైలి అలవాట్లు కూడా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతున్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. 

మన ఆహారపు అలవాట్లను తరచుగా మార్చడం చాలా కష్టం. కానీ అసాధ్యమైతే కాదు. మీ రోజువారి ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని చేర్చడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం తగ్గాలంటే ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..


Avocado

అవొకాడో

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. అవొకాడోలో గుండె ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. అవొకాడోను తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఇది మన గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అవొకాడో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. అవొకాడోలో తగినంత మొత్తంలో పొటాషియం ఉంటుంది. శరీరంలో సరైన మొత్తంలో పొటాషియం ఉంటే రక్తపోటు సమతుల్యంగా ఉంటుంది. అలాగే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఆకుకూరలు

బచ్చలికూర, కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు తగినంత మొత్తంలో ఉంటాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. వీటిలో విటమిన్ కె ఉంటుంది. ఇది ధమనులను రక్షిస్తుంది.  అలాగే రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. దీనితో పాటుగా దీనిలో నైట్రేట్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. రక్త నాళాల కణ లైనింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది.
 

బెర్రీలు

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్బెర్రీలు, కోరిందకాయల్లో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ రెండు కారకాలు గుండె జబ్బులు వచ్చేలా చేస్తాయి.
 

Image: Getty Images

వాల్ నట్స్

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. వాల్ నట్స్ లో ఫైబర్, మెగ్నీషియం, రాగి, మాంగనీస్ వంటి ఇతర సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. పరిశోధనల ప్రకారం.. వాల్ నట్స్ తినే వ్యక్తికి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. 2009 లో వాల్ నట్స్ గురించి 365 మందిపై ఒక పరిశోధనను చేశారు. ఫలితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉన్నట్టు కనుగొనబడింది.
 

డార్క్ చాక్లెట్

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు తగినంత మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చాక్లెట్లను ఎక్కువగా తినేవారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. 70 శాతం కోకో కలిగిన హై క్వాలిటీ డార్క్ చాక్లెట్ ను తింటే మంచిది. 
 

Tomatoes

టమాటాలు 

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. టమోటాల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది సహజ మొక్కల వర్ణద్రవ్యం. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.ఈ  యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావాలను తగ్గిస్తాయి. ఈ ఫ్రీరాడికల్స్ ఆక్సీకరణ నష్టం, మంటను కలిగిస్తాయి. ఆక్సీకరణ నష్టం నుంచి మంట వరకు ఈ కారకాలన్నీ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. 

Latest Videos

click me!