ప్రస్తుత కాలంలో గుండె జబ్బులతో చనిపోయేవారు ఎక్కువయ్యారు. చిన్న వయసు వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. గుండెజబ్బులు రావడానికి ఎన్నో కారణాలు ఉననాయి. ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారిలో హార్ట్ పేషెంట్లే ఎక్కువగా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి అనారోగ్యకరమైన జీవనశైలే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు డయాబెటిస్, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, ఆల్కహాల్, స్మోకింగ్, ఊబకాయం మొదలైనవి కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే మన జీవన శైలిని మెరుగ్గా ఉంచుకుని కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..