పసుపు ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా?

First Published | Nov 22, 2024, 1:04 PM IST

పసుపు ని తీసుకునే విధంగా తీసుకుంటే.. కచ్చితంగా బరువు తగ్గుతారట. అదెలాగో ఇఫ్పుడు చూద్దాం..

మనమంతా వంటలో రెగ్యులర్ గా పసుపు వాడుతూనే ఉంటాం. పసుపులో మన ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా పోషకాలు ఉంటాయి. అయితే.. ఇదే పసుపు మన బరువు తగ్గించడంలోనూ సహాయం చేస్తుందని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే.. పసుపు ని తీసుకునే విధంగా తీసుకుంటే.. కచ్చితంగా బరువు తగ్గుతారట. అదెలాగో ఇఫ్పుడు చూద్దాం..

1. వాపును తగ్గించడంలో పసుపు పాత్ర

శరీరంలో వాపు అనేది ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంటుంది. పసుపు లోని కర్కుమిన్ శరీరంలో మంటను తగ్గించడం లో సహాయం చేస్తుంది. ముఖ్యంగా అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న సందర్భాల్లో, పసుపు ఒక ఆరోగ్యకరమైన శరీర బరువును ప్రోత్సహిస్తుంది. అధిక బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది.

Latest Videos


2. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

గట్ హెల్త్ ని మెరుగుపరచడంలోనూ పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. బరువు మాత్రమే కాదు.. గట్ ఆరోగ్యంలోనూ కీలకంగా పని చేస్తుంది.జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా.. ఈజీగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

3. జీవక్రియను పెంచుతుంది

పసుపు కూడా జీవక్రియ పనితీరు పెరుగుదలతో ముడిపడి ఉంది. జీవక్రియ అనేది మీ శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. శరీరంలో కేలరీలను మరింత సమర్థవంతంగా బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది. 

4. ఇన్సులిన్ ని నియంత్రిస్తుంది. కోరికలను అరికడుతుంది

సమతుల్య ఇన్సులిన్ స్థాయిలు అతిగా తినడాన్ని నివారించడంలో, అధిక కేలరీల ఆహారాల కోసం కోరికలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పసుపు ఇన్సులిన్‌ను నియంత్రించే సామర్థ్యం కలిగి ఉంటుంది.  ఫుడ్ క్రేవింగ్స్ ని కంట్రోల్ లో ఉంచడంలోనూ సహాయం చేస్తాయి.

click me!