Worlds Cheapest House: అమెరికాలోని మిచిగాన్‌లో కేవలం 1 డాలర్‌కే ఇల్లు లభిస్తోంది. 2 బెడ్‌రూమ్‌లు ఉన్న ఈ ఇల్లు ఎందుకు అంత చౌకగా అభిస్తోంది. ఆ ఇల్లు ధర, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. 1 డాలర్‌కే ఎందుకు అమ్ముతున్నారో తెలుసా?
సొంత ఇల్లు కొనడం అనేది ప్రతీ ఒక్కరి కల. కానీ ఇప్పుడున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. చిన్న స్థలం కొనాలన్నా లక్షల్లో, కోట్లలో డబ్బులు కావాలి. కానీ ప్రపంచంలో కేవలం 1 యూఎస్ డాలర్ (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 83) కే ఒక ఇల్లు ఉందంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. టీ తాగే ఖర్చుకే ఒక పూర్తి ఇల్లు సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఈ వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. జనాలు కూడా ఈ ఇంటి గురించి తెలుసుకోవడానికి నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
24
ఈ ఇల్లు ఎక్కడ ఉంది? దీంట్లో ఏమేం ఉన్నాయి?
ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఈ ఇల్లు అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో ఉంది. దీని ఖచ్చితమైన అడ్రస్ చూస్తే.. 70 ఈ యప్సిలాంటి అవెన్యూ, పొంటియాక్, మిచిగాన్, యూఎస్ఏ. ఈ ఇంట్లో రెండు బెడ్‌రూమ్‌లు, ఒక కిచెన్, ఒక బాత్‌రూమ్ ఉన్నాయి. ఒక చిన్న కుటుంబం నివసించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఈ ఇంటికి సంబంధించి యాడ్ ఇచ్చిన వెంటనే ఆయనకు పోన్ కాల్స్ వరదలా వచ్చాయి. ప్రతీ ఒక్కరూ 1 డాలర్‌కే ఇల్లు అనగానే ఆశ్చర్యపోయి ఎగబడ్డారు.
34
రూ. 8 లక్షల విలువైన ఇల్లు.. 1 డాలర్‌కు ఎలా పడిపోయింది?
ఈ ఇల్లు నిన్న మొన్న కట్టింది కాదు. దీనిని 1856వ సంవత్సరంలో నిర్మించారు. ఒకప్పుడు ఈ ఇంటి విలువ దాదాపు 8 లక్షల రూపాయలుగా ఉండేది. అయితే చాలా సంవత్సరాల పాటు ఈ ఇంటిని అద్దెకు ఇచ్చారు. వరుసగా అద్దెకు ఉన్నవారు ఈ ఇంటిని సరిగ్గా నిర్వహించకపోవడంతో ఇది దారుణంగా దెబ్బతింది. ఇంటి గోడలు, కప్పు, ఫ్లోరింగ్ అన్నీ పాడైపోయాయి. కాలక్రమేణా ఇంటి పరిస్థితి క్షీణించడంతో దాని ధర దారుణంగా పడిపోయింది. చివరికి దాని యజమాని ఈ ఇంటిని కేవలం 1 డాలర్‌కే అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది.
కేవలం 1 డాలర్‌కే లభిస్తున్నప్పటికీ, ఈ ఇంటిని కొనడానికి కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఆ ఇంటికి కావాల్సిన రిపేర్లు. ఈ ఇంటిని మళ్లీ ఉండటానికి వీలుగా మార్చాలంటే కనీసం 20,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ. 16 లక్షలకు పైగా) అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇంటిని 1 డాలర్‌కే కొన్నా, రిపేర్లకు భారీగా ఖర్చు పెట్టాల్సి రావడంతో కొనుగోలుదారులు భయపడి వెనక్కి తగ్గుతున్నారు. అందుకే ఈ ఇల్లు ఇప్పటికీ ఎవరూ కొనకుండా అలానే ఉండిపోయింది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు vs అత్యంత చౌకైన ఇల్లు
ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లుగా మిచిగాన్‌లోని ఈ 1 డాలర్ ఇల్లు వార్తల్లో నిలవగా, మరోవైపు ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇళ్లు కూడా ఉన్నాయి. లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచింది. బ్రిటీష్ రాజకుటుంబ అధికారిక నివాసమైన ఈ ప్యాలెస్ విలువ దాదాపు 4.9 బిలియన్ డాలర్లు. ఇందులో 770 కి పైగా గదులు, 40 ఎకరాల భారీ గార్డెన్ ఉన్నాయి. ఇక ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు, భారత్‌లోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా ముకేశ్ అంబానీకి చెందిన ‘యాంటిలియా’ ఉంది. ఒకవైపు బిలియన్ డాలర్ల ప్యాలెస్‌లు ఉంటే, మరోవైపు 1 డాలర్ ఇల్లు ఉండటం గమనార్హం.