World Wonders: రంగులు లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమే. చుట్టూ ఉన్న ఇళ్లు, ఆలయాలు, మ్యూజియాలు, ఆఫీసులు.. ఇలా ప్రతి నిర్మాణంలోనూ రంగులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే కొన్నింటికి రంగులను అలంకరణ కోసం కాకుండా ఆ నిర్మాణానికే ప్రత్యేక గుర్తింపుగా మార్చేశారు.
రంగులు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కాస్త కష్టమే. మన చుట్టూ ఉన్న ఇళ్లు, దేవాలయాలు, మ్యూజియంలు, ఆఫీసులు.. ఇలా ప్రతి నిర్మాణంలోనూ రంగులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే కొన్ని కట్టడాల్లో రంగులను కేవలం అలంకరణ కోసం కాకుండా.. ఆ నిర్మాణానికే ప్రత్యేక గుర్తింపుగా మార్చేశారు. ఎక్కడ చూసినా కళ, రంగులు, డిజైన్ కలగలిసి చూపరులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందించిన అలాంటి అద్భుత నిర్మాణాల్లో కొన్ని ఇవి.
29
శ్రీరంగనాథస్వామి ఆలయం
రంగురంగుల ఆలయ నిర్మాణాలకు తమిళనాడు పెట్టింది పేరు. తిరుచిరాపల్లిలోని శ్రీరంగనాథస్వామి ఆలయం కూడా అందుకు ఉదాహరణ. శతాబ్దాల పాటు వివిధ రాజవంశాల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన ఈ ఆలయ సముదాయంలో అనేక గోపురాలు ఉన్నాయి. వాటిపై కనిపించే శిల్పాలు, రంగులు.. ఆలయానికి ప్రత్యేకమైన వైభవాన్ని తీసుకొచ్చాయి. ఆధ్యాత్మికతతో పాటు దక్షిణ భారత ఆలయ శిల్పకళను అద్భుతంగా పరిచయం చేసే ప్రదేశంగా ఇది నిలిచింది.
39
లెగనీస్ సెంట్రల్ లైబ్రరీ
స్పెయిన్‌లోని లెగనీస్ సెంట్రల్ లైబ్రరీ కూడా ఆకట్టుకుంటుంది. పుస్తకాలను షెల్ఫ్‌లలో అమర్చినట్టుగా భవనాన్ని నిర్మించారు. సూర్యకిరణాలు భవనంపై పడినప్పుడు గోడలపై కనిపించే రంగులు, టెక్చర్..పేజీలను తలపించేలా ఉంటాయి.
లండన్‌లోని క్రాయ్‌డన్ ప్రాంతంలో పాదచారుల కోసం కట్టారు. 3డీ పోర్సిలైన్ టైల్స్‌ను ఉపయోగించి గోడలు, స్తంభాలను నిర్మించారు. ఏ మూల నుంచి చూసినా కొత్త డిజైన్ కనిపించేలా రూపొందించారు. ఇది కేవలం ఒక మార్గంలా కాకుండా.. ఒక కళాత్మక అనుభవాన్ని అందించాలన్న ఉద్దేశంతో దీనిని రూపొందించారు.
59
మైషిమా వేస్ట్ ఇన్సినరేటర్
చెత్తను కాల్చి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ అంటే సాధారణంగా పెద్ద పరిశ్రమ గుర్తుకొస్తుంది. కానీ జపాన్‌లోని మైషిమా ప్లాంట్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. రంగురంగుల గోడలు, విచిత్రమైన ఆకృతులు, కళాత్మక అలంకరణలతో ఇది బయట నుంచి చూస్తే ఒక థీమ్ పార్క్‌లా కనిపిస్తుంది. ఆస్ట్రియన్ కళాకారుడు ఫ్రీడెన్స్‌రైచ్ హండర్ట్‌వాసర్ రూపొందించిన ఈ నిర్మాణం పరిశ్రమల భవనాలకు సరికొత్త నిర్వచనం ఇచ్చింది.
69
పాలౌ డి లా మ్యూజికా కాటలానా
స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉన్న ఈ ప్రసిద్ధ కాన్సర్ట్ హాల్ నిర్మాణం సంగీతానికి మాత్రమే కాదు.. కళకు కూడా ప్రతిరూపంగా కనిపిస్తుంది. ఆర్కిటెక్ట్ లూయిస్ డొమెనెక్ ఐ మోంటానెర్ రూపొందించిన ఈ కట్టడంలో రంగురంగుల టైల్స్, గాజు కళ, శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. లోపలికి అడుగుపెడితే ఒక మ్యూజిక్ హాల్‌లో ఉన్నామా.. లేక కళా ప్రదర్శనశాలలో ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది.
79
గార్డియన్ బిల్డింగ్ – డెట్రాయిట్
అమెరికాలోని డెట్రాయిట్‌లో ఉన్న గార్డియన్ బిల్డింగ్ ఒక ఆఫీస్ లా ఉండదు. 1920ల చివర్లో నిర్మించిన ఈ భవనాన్ని ఆర్ట్ డెకో శైలిలో అద్భుతంగా తీర్చిదిద్దారు. లోపలి భాగాల్లో రంగురంగుల టైల్స్, అలంకరణలు, కళాత్మక నమూనాలు కనిపిస్తాయి. అందుకే దీనిని డెట్రాయిట్‌లోని ప్రత్యేకమైన నిర్మాణాల్లో ఒకటిగా గుర్తించారు.
89
డి బియెన్‌కార్ఫ్ డిపార్ట్‌మెంట్ స్టోర్
నెదర్లాండ్స్‌లోని ఐండ్‌హోవెన్‌లో ఉన్న ఈ భవనం ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌కు ఉదాహరణ. ఇటాలియన్ ఆర్కిటెక్ట్ జియో పాంటీ రూపొందించిన ఈ నిర్మాణంలో సాధారణ షాపింగ్ మాల్స్ కు భిన్నంగా కనిపిస్తుంది. బిల్డింగ్ మొత్తం ఒక భారీ కళాఖండంలా కనిపించేలా డిజైన్ చేయడం దీని ప్రత్యేకత.
99
రివర్సిబుల్ డెస్టినీ లోఫ్ట్స్
టోక్యోలోని ఈ నివాస సముదాయం పేరు ఎంత ఆసక్తికరంగా ఉందో.. దాని కట్టడం కూడా అంతే విభిన్నంగా ఉంటుంది. ప్రకాశవంతమైన రంగులు, అసాధారణ ఆకృతులు, వేర్వేరు స్థాయిల్లో నిర్మించిన గదులు.. ఇవన్నీ కలిపి ఇదొక ఇల్లు అనే భావన తీసుకురాదు. ఇక్కడ నివసించే వారికి ప్రతిరోజూ కొత్త అనుభూతి కలిగేలా డిజైన్ చేయడం దీని ప్రధాన ఉద్దేశం.