Property Buying Tips: వర్షాకాలంలో ఇల్లు కొనడం చాలా మంచి ఆలోచన అని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఇల్లు కొనడం వల్ల నాణ్యత తెలుస్తుంది. అలాగే, తక్కువ వడ్డీ రేట్లతో సొంతింటి కల నెరవేర్చుకోవడానికి బెస్ట్ టిప్స్ ఇక్కడ తెలుసుకుందాం.
వర్షాకాలంలో ఇల్లు కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే అస్సలు వదులుకోరు
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. కొత్త ఇల్లు లేదా ప్రాపర్టీ కొనాలని మీరు ప్లాన్ చేస్తుంటే, ఈ వర్షాకాలం మీకు ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. సాధారణ రోజుల్లో ఇల్లు చూడటానికి, వర్షాకాలంలో చూడటానికి చాలా తేడా ఉంటుంది. ఏడాది పొడవునా కనిపించని అనేక విషయాలు ఈ సీజన్‌లో బయటపడతాయి. ప్రాపర్టీ రియల్ క్వాలిటీ తెలుసుకోవడానికి వర్షం ఒక మంచి టెస్టింగ్ టైమ్. దీనికి తోడు ప్రస్తుతం బ్యాంకులు హోమ్ లోన్లపై తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. అందుకే ఈ సమయంలో ఇల్లు కొనడం ఎంతవరకు బెటర్ అనేది ఈ 4 పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం.
25
1. ఇంటి అందం కాదు... నాణ్యత ముఖ్యం
ఇంటి లుక్ ఎంత బాగున్నా, దానికి క్వాలిటీ చాలా ముఖ్యం. వర్షాకాలంలో మాత్రమే బిల్డింగ్ అసలు క్వాలిటీ ఏంటో క్లియర్‌గా తెలుస్తుంది. గోడలు, పై భాగం నుండి నీరు కారడం లేదా తేమ ఉందా అనేది ఈజీగా చెక్ చేయవచ్చు. విండోస్, డోర్స్, బాత్‌రూమ్‌లలో తేమ రావడం లాంటి సమస్యలు ఉంటే ఆ ప్రాపర్టీని తీసుకోకపోవడమే మంచిది. అలాగే వర్షం పడినప్పుడు అక్కడ నీరు నిలిచిపోకుండా ప్రాపర్ డ్రైనేజీ సిస్టమ్ ఉందో లేదో సరిచూసుకోవచ్చు.
35
2. రోడ్లు, చుట్టుపక్కల దారుల నిజరూపం తెలుస్తుంది
ఇల్లు కొనేటప్పుడు కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. వర్షాకాలంలో చాలా చోట్ల రోడ్లపై నీరు చేరి, విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. బిల్డర్లు మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ ఉందంటూ ఎన్నో ప్రామిస్‌లు చేస్తారు. కానీ వర్షం పడితే కానీ ఆ రోడ్ల అసలు పరిస్థితి ఏంటో అర్థం కాదు. రహదారులు గుంతలమయంగా ఉన్నాయా, లేదా రాకపోకలకు ప్రమాదకరంగా ఉన్నాయా అనేది ఈ టైమ్‌లోనే సరిగ్గా అంచనా వేయవచ్చు.
గతంలో ఆర్‌బీఐ (RBI) నాలుగు సార్లు రెపో రేటును తగ్గించిన తర్వాత, చాలా బ్యాంకులు హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను బాగా తగ్గించాయి. దీనివల్ల ఇల్లు కొనాలనుకునే వారికి ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది. ఉదాహరణకు, ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 7.10% ప్రారంభ వడ్డీ రేటుకే హోమ్ లోన్ ఇస్తోంది. అంతేకాకుండా, దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 7.25% వార్షిక వడ్డీ రేటుకే రుణాలు అందిస్తోంది. తక్కువ వడ్డీ రేట్లు ఉన్న ఈ సమయంలో లోన్ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
55
4. కరెంట్ కష్టాలు, పవర్ బ్యాకప్ పై స్పష్టత
చాలా ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడగానే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. కొన్ని ఏరియాల్లో గంటల తరబడి కరెంట్ ఉండదు. మీరు పెట్టుబడి పెట్టాలని చూస్తున్న ప్రాపర్టీ ఉన్న ప్రాంతంలో ఇలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నాయో లేదో ముందే తెలుసుకోవడం చాలా అవసరం. ఒకవేళ కరెంట్ పోయినా, సొసైటీలో క్యాంపస్, పార్కింగ్ ఏరియాలకు జనరేటర్ లేదా పవర్ బ్యాకప్ సదుపాయం ఉందో లేదో బిల్డర్‌ను అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు సిటీకి దూరంగా లేదా ప్రశాంతమైన ఔటర్ ఏరియాలో ఇల్లు తీసుకుంటుంటే ఈ విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.