ప్రపంచంలో కెల్లా ఖరీదైన రైలు..
ఒక ట్రైన్ టికెట్ ఎంత ఉంటుంది? మనం ఎక్కే రైలును బట్టి, వెళ్లే ప్లేసును బట్టి ట్రైన్ టికెట్ మారుతూ ఉంటుంది. మన దేశంలో ఎంత లగ్జరీ ట్రైన్ ఎక్కినా కూడా రూ.3వేల నుంచి రూ.4 వేలకు మించి ఖర్చు అవ్వదు. కానీ, రూ.17లక్షల ట్రైన్ టికెట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ రైలు వివరాలు ఇప్పుడు చూద్దాం..
జపాన్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బుల్లెట్ ట్రైన్. గంటలకు 300 నిమిషాలకు పైగా వేగంతో దూసుకువెళ్లే ఈ రైళ్లు ప్రయాణా సమయాన్ని తగ్గించేస్తాయి. అయితే, అదే జపాన్ లో వేగానికి పూర్తి భిన్నంగా.. కేవలం ప్రయాణాన్ని ఆస్వాదించేలా లగ్జరీ రైలు ఒకటి ఉంది. ఈ రైలు పేరు క్యూషు. ప్రయాణికులను తమ డెస్టినేషన్ కి చేర్చడమే కాదు, ప్రకృతి అందాలను, స్థానిక సంస్కృతి, సంప్రదాయ వంటకాలు, చారిత్రక ప్రదేశాలను చుట్టి చూపిస్తూ తిరుగుతుంది ఈ రైలు. ఇది జపాన్ లోని తొలి లగ్జరీ రైలు. దీనిని 2013లో ప్రారంభించారు.