
చాలా బ్యాంకులు మన ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తుంటారు. ఇక గోల్డ్ లోన్ సంస్థల పనే ఇది. అయితే మనం తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది… లేదంటే ఇబ్బందులు తప్పవు. ఒకవేళ ఏదైనా కారణంతో చాలారోజులు గోల్డ్ లోన్ అసలు, వడ్డీ చెల్లించకుంటే ఏం జరుగుతుంది? లోన్ ఇచ్చిన సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? అనే అనుమానం చాలామందిలో ఉంటుంది.
గోల్డ్ కట్టకుంటే తాకట్టు పెట్టిన నగలు వేలం వేస్తారా? ఇది చాలామంది డౌట్. దీనికి అవును అనేదే సమాధానం. బ్యాంకులు మీ బంగారు నగలను వేలం వేయగలవు… లోన్ ఇచ్చేటప్పుడే ఇందుకు సంబంధించి అన్ని అనుమతులను మననుండి తీసుకుంటాయి. అయితే ఇది చివరి ఆప్షన్ గా మాత్రమే ఉపయోగించుకుంటాయి సదరు సంస్థలు.
చాలా బ్యాంకులు, గోల్డ్ లోన్ సంస్థలు ఇచ్చిన అప్పు, వడ్డీ వసూలు చేయడానికే ప్రయత్నిస్తాయి. బంగారం వేలం వేయడాన్ని నివారించడానికే చూస్తాయి. సాధారణంగా అప్పు తీసుకున్నవారు చాలాకాలం వాయిదాలు కట్టకపోయినా, సరిగ్గా స్పందించకున్నా ఈ పరిస్థితి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఒక నిర్దిష్ట ప్రక్రియను పాటించాకే వేలం వేయాలి. ఇది కస్టమర్ల హక్కులను కాపాడే పారదర్శకమైన ప్రక్రియ. కాబట్టి భయపడాల్సిన పనిలేదు.
గోల్డ్ లోన్ విషయంలో మీరు వడ్డీ లేదా వాయిదాలు సక్రమంగా కట్టకపోయినా మీ నగలు వెంటనే వేలానికి వెళ్లవు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం లోన్ తీసుకున్నవారికి కొంత సమయం ఇవ్వాలి. సాధారణంగా అయితే వరుసగా 90 రోజుల వరకు అంటే వరుసగా మూడు నెలలు వాయిదా లేదా వడ్డీ చెల్లించకపోతే, మీ లోన్ అకౌంట్‌ను 'నిరర్థక ఆస్తి' (Non-Performing Asset - NPA)గా ప్రకటిస్తారు. ఆ తర్వాతే వేలం ప్రక్రియ మొదలవుతుంది. ఇది అకస్మాత్తుగా జరగదు, దీనికి చాలా సమయం పడుతుంది.
మీ బంగారు నగలను వేలం వేయడానికి ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొన్ని చర్యలు తీసుకుంటాయి. మొదట మీరు వాయిదాలు కట్టడం ఆపగానే ఆ బ్రాంచ్ సిబ్బంది ఫోన్ చేసి గుర్తుచేస్తారు. అయినా స్పందించకుంటే రాతపూర్వకంగా మీకు ఉత్తరాలు లేదా ఈ-మెయిల్స్ ద్వారా నోటీసులు పంపుతాయి.
ఫోన్స్, నోటీసులను పట్టించుకోకుంటే చట్టప్రకారం తాకట్టు పెట్టిన బంగారం వేలం వేసి డబ్బులు రాబట్టుకునేందుకు సిద్దం అవుతాయి. అప్పుడు కూడా ముందు అప్పు చెల్లించడానికి మీకు ఒక నెల గడువు ఇస్తూ రిజిస్టర్డ్ పోస్ట్ (Registered Post) ద్వారా నోటీసు పంపాలి. ఈ నోటీసులో వేలం తేదీ, సమయం, ప్రదేశం స్పష్టంగా ఉంటాయి. ఇది పారదర్శకమైన ప్రక్రియ కాబట్టి, మీకు తెలియకుండా ఏదీ జరగదు.
గోల్డ్ లోన్ తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే మీరు వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ముందుగా మీరు లోన్ తీసుకున్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను కలిసి మీ పరిస్థితిని వివరించండి. వారు మీకు EMIని రీస్ట్రక్చర్ చేయడం, లోన్ గడువును పొడిగించడం (Extend Tenure) లేదా కొంత మొత్తం చెల్లించడం వంటి అవకాశాలు ఇవ్వొచ్చు. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకి ‘టాప్-అప్’ లోన్లు కూడా ఇస్తాయి. దీని ద్వారా బకాయిలను సర్దుబాటు చేసుకోవచ్చు.
గోల్డ్ లోన్ తీసుకుంటే మీ బంగారు నగలు వేలానికి వెళ్లకుండా కాపాడుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి.