Honey Bees Attack : తేనేటీగలు భయపడి పరుగెడుతున్నా వెంటపడి మరీ కుడతాయి? ఎందుకో తెలుసా?

Published : Nov 23, 2026, 04:38 PM IST

ఎవరైనా తేనెతుట్టను కదిపినా, తేనె తీయడానికి ప్రయత్నించినా తెేనెటీగలు కుడుతుంటాయి. కొన్నిసార్లు భయంతో పరుగెడుతున్నా వెంటపడిమరీ గుంపులుగా దాడి చేస్తుంటాయి. ఇలా ఎందుకు చేస్తాయో తెలుసా?

PREV
14
తెనెటీగలు ఎందుకు దాడిచేస్తాయి?

సాధారణంగా తేనెటీగలు వాటంతట అవే దాడికి పాల్పడవు. తేనెపట్టును కదిపినప్పుడు లేదా రాళ్లు, కర్రలతో కొట్టినప్పుడు ఆత్మరక్షణ కోసం దాడికి పాల్పడుతుంటాయి. మరీముఖ్యంగా భయపడి పారిపోయేవారిని గుంపుగా వచ్చిమరీ కుడుతుంటాయి... కొన్నిసార్లు వీటి దాడివల్ల ప్రాణాపాయం కూడా కలుగుతుంది. అసలు తేనెటీగలు ఎందుకు దాడిచేస్తాయి? వాటి దాడినుండి ఎలా తప్పించుకోవాలి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

24
భయపడేవారిపై తేనెటీగలు ఎందుకు దాడిచేస్తాయి?

చాలామంది తేనెతుట్టను కదపకున్నా, తేనెటీగలపై దాడి చేయకున్న వాటిని చూడగానే భయపడిపోతుంటాయి. అయితే ఇలా భయంతో పరుగుతీయడం వల్ల శరీరంలోంచి ఒక రకమైన హార్మోన్ విడుదల అవుతాయి. ఈ హార్మోన్ల వాసన తేనెటీగలకు హాని కలిగించే సంకేతాలను ఇస్తుందట... అందుకే భయంతో పరుగెత్తేవారిపైనే తేనెటీగలు ఎక్కువగా దాడి చేస్తుంటాయి.

34
తేనెటీగలు గుంపులుగా ఎందుకు దాడి చేస్తాయి?

తేనెతీగలు గుంపులుగా జీవిస్తుంటాయి... ఇవి వివిధ రకాలుగా ఒకదానికి ఒకటి సంకేతాలు ఇచ్చుకుంటాయి. ఏదైనా తేనెటీగ హాని జరుగుతుందని భావిస్తే మనుషులను కుడతాయి... ఈ సమయంలోనే అవి మిగతా గుంపులోని ఈగలను కూడా అలర్ట్ చేస్తాయి. తెనెటీగ కుట్టగానే వాటి శరీరంలోంచి ఇతర ఈగలకు సంకేతాలకు పంపే పెరోమోన్లు విడుదల అవుతాయి. దీంతో ఈగలన్ని గుంపుగా వచ్చి దాడికి పాల్పడుతుంటాయి.

44
తెనెటీగల దాడికి ప్రధాన కారణాలు..

తేనెతుట్టను రాళ్లు, కర్రలతో కొట్టడం, పొరపాటును ఏదైనా వస్తువు తాకిచ్చినా తేనెటీగలు పైకి లేస్తాయి... గుంపుగా దాడి చేస్తుంటాయి. అంతేకాదు తేనె తుట్ట దగ్గర్లో గట్టిగా అరవడం, పెద్దపెద్ద శబ్దాలు చేయడం, దాని పక్కనుండే అటుఇటు తిరగడంతో అవి ఏదో హాని జరగబోతోందని భావిస్తాయట... అందుకే దాడికి పాల్పడుతుంటాయి.

అందుకే తెనెపట్టు కనిపించగానే ఈ జాగ్రత్తలు పాటించాలి.

1. అనుభవం లేకుండా తేనె తీయడానికి ప్రయత్నించరాదు.

2. తేనెపట్టు దగ్గర్లో పెద్దపెద్ద శబ్దాలు చేయరాదు. దగ్గరనుండి అటుఇటు తిరగరాదు.

3. తేనె తీగ కూడితే వెంటనే ఆ భాగంపై వాసన రాకుండా ఏదైనా ఆకు లాంటిది రాయాలి. ఈ వాసన ఇతర తేనెటీగలను ఆకర్షిస్తుంది.

4. తేనెటీగలను చూడగానే భయపడవద్దు... అవి దగ్గరికి వస్తుంటే పరుగు తీయవద్దు.

5. తేనెటీగ కుట్టగానే ముళ్లు తీసేసి ఉప్పునీటిని అక్కడ పెట్టండి... దీంతో ఆ ప్రాంతంలో వాపు రాదు.

Read more Photos on
click me!

Recommended Stories