ఈ దేశాల్లో బట్టలు ఆరేస్తే..,భారీ జరిమానా..
స్పెయిన్ (బార్సిలోనా, మాడ్రిడ్): స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో రోడ్డు వైపు కనిపించేలా లేదా బయటి బాల్కనీల్లో బట్టలు ఆరేయడం చట్టరీత్యా నేరం. నగర అందాన్ని కాపాడటానికి ఈ రూల్ తీసుకొచ్చారు. దీనిని ఉల్లంఘిస్తే 750 యూరోల వరకు అంటే మన కరెన్సీలో సుమారు ₹70,000 కంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇటలీ (రోమ్, వెనిస్, నేపుల్స్): ఇటలీలోని చారిత్రక నగరాలు , పర్యాటక ప్రాంతాల్లో బిల్డింగ్ బయట లేదా రోడ్లకు అడ్డంగా తాళ్లు కట్టి బట్టలు ఆరేయడంపై నిషేధం ఉంది. అక్కడ నగర ప్రశాంతతను, పర్యాటక ఆకర్షణను దెబ్బతీసే చర్యగా దీనిని భావిస్తారు. భారీ జరిమానా విధిస్తూ ఉంటారు.
అమెరికా USA - HOA నిబంధనలు: అమెరికాలోని కొన్ని నివాస సముదాయాల్లో (Homeowners Associations - HOA) కాలనీ అందం దెబ్బతింటుందని, ఆస్తుల రీసేల్ విలువ తగ్గుతుందనే కారణంతో బయట బట్టలు ఆరేయనివ్వరు. కచ్చితంగా డ్రైయర్లు మాత్రమే వాడాలనే నిబంధన ఉంటుంది.