Farmer Success Story: ఒక ఎకరం పొలంలో రోజుకు 12 వేల ఆదాయం.. ఈ యువరైతు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా?

Published : Sep 11, 2026, 10:34 AM IST

Farmer Success Story: గులాబీ పూలు, జెర్బెరాలతో మహారాష్ట్ర రైతు అద్భుతం చేస్తున్నాడు. అర్జున్ సబలే అనే యువ రైతు పాలీహౌస్ సాగు ద్వారా గులాబీలు, జెర్బెరా పూలను పండిస్తూ రోజుకు ₹12,000 పైన సంపాదిస్తున్నారు. నెలకు ₹2.5 లక్షల వరకు లాభం పొందుతున్నారు.

PREV
15
ఒక్క ఎకరంలో పూల సాగు.. రోజుకు ₹12 వేలు సంపాదిస్తున్న మహారాష్ట్ర రైతు సక్సెస్ స్టోరీ

ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేస్తేనే ఎక్కువ డబ్బులు వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ, ఉన్న తక్కువ ల్యాండ్‌నే సరిగ్గా వాడుకుంటే లక్షల్లో ప్రాఫిట్స్ వస్తాయని నిరూపించారు మహారాష్ట్రకు చెందిన రైతు అర్జున్ సబలే. కేవలం ఒక్క ఎకరం పొలంలో గులాబీలు, జెర్బెరా పూలు సాగు చేస్తూ రోజుకు ఏకంగా ₹12,000 నుంచి ₹13,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ బిజినెస్ మోడల్ ద్వారా ఆయన నెలకు దాదాపు ₹2.5 లక్షల నికర లాభాన్ని అందుకుంటున్నారు.

25
పాత పద్ధతులకు స్వస్తి.. ఆధునిక సాగు వైపు అడుగులు

అర్జున్ సబలే కుటుంబం తరతరాలుగా బంతి, చామంతి పూలను సాగు చేస్తూ, వాటిని అమ్మడానికి ముంబై మార్కెట్‌కు తీసుకెళ్లేవారు. అయితే కాలక్రమేణా మార్కెట్‌లో పోటీ పెరగడం, పూల ధరలు పడిపోవడంతో సాంప్రదాయ వ్యవసాయం నుంచి తగినంత ఆదాయం రావడం కష్టంగా మారింది. దీనికి పరిష్కారం వెతుకుతున్న సమయంలోనే, అర్జున్ B.Sc అగ్రికల్చర్ చదువుతూ విభిన్న పొలాలను సందర్శించారు. ఆ సమయంలోనే ఆయనకు పాలీహౌస్ సాగు లేదా సురక్షిత వ్యవసాయం గురించి అవగాహన వచ్చింది.

35
10 గుంటలతో చిన్నగా ప్రారంభమైన ప్రయోగం

2016లో అర్జున్ కేవలం 10 గుంటల విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా గులాబీల సాగు ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ఒక పెంపకందారుడి నుంచి రూ. 12 చొప్పున ప్లాంటింగ్ మెటీరియల్‌ను కొనుగోలు చేసి, ప్రారంభంలో రూ. 8,000 ఖర్చు చేశారు. ఆరు నెలల తర్వాత, ఆ చిన్న ప్లాట్ నుంచి రోజుకు 500 రోజాలు ఉత్పత్తి కావడం మొదలైంది. వీటిని స్థానికంగా ఒక్కో పువ్వును ₹5 చొప్పున అమ్మడం ద్వారా రోజుకు ₹2,500 వరకు రాబడి వచ్చింది. ఈ ఫలితం ఆయనకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

45
లక్షల్లో టర్నోవర్.. నెలకు రూ. 2.5 లక్షల నికర లాభం

తొలి ప్రయత్నంలో వచ్చిన లాభాల ప్రోత్సహింతో అర్జున్, తన సాగును ఒక ఎకరానికి విస్తరించి జెర్బెరా పూలను కూడా జత చేశారు. ప్రస్తుతం ఆయన ఎకరంలో గులాబీలు, జెర్బెరా పంటలను చెరో 16,000 మొక్కల చొప్పున పండిస్తున్నారు. రోజాల్లో డచ్ హైబ్రిడ్ టీ రోజ్ రకానికి చెందిన 'టాప్ సీక్రెట్' (తాజ్ మహల్) రకాన్ని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పొలం నుంచి రోజూ 1,000 రోజాలు, 2,000 జెర్బెరా పూలు దిగుబడి వస్తున్నాయి. మార్కెట్‌లో రోజా పువ్వుకు ₹5, జెర్బెరా స్టిక్‌కు ₹4 చొప్పున ధర లభిస్తోంది. దీనిద్వారా రోజుకు రోజాల ద్వారా ₹5,000, జెర్బెరాల ద్వారా ₹8,000 చొప్పున మొత్తం ₹12,000 నుంచి ₹13,000 వరకు రాబడి వస్తోంది. దీంతో ఆయన నెలవారీ టర్నోవర్ ₹3.5 లక్షలు దాటగా, ఖర్చులు పోను దాదాపు ₹2.5 లక్షల నికర లాభం మిగులుతోంది.

55
న్యాచురల్ వెంటిలేషన్ పాలీహౌస్ వ్యవసాయం

ఈ పూలను అర్జున్ న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్‌లో సాగు చేస్తున్నారు. ఇందులో విద్యుత్ కూలింగ్ ఫ్యాన్లకు బదులుగా గాలి ప్రసరణ కోసం రూఫ్ వెంట్లు, సైడ్ కర్టెన్లను ఉపయోగిస్తారు. 2015-16లో ఆయన మొదటి 10,000 చదరపు అడుగుల నిర్మాణానికి రూ. 3 లక్షలు ఖర్చు చేశారు. ఈ మొక్కలు 5 నుంచి 7 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తాయి, కాబట్టి ప్రారంభ పెట్టుబడి కొన్ని సంవత్సరాల పాటు పంపిణీ అవుతుంది. ఆయన డ్రిప్ ఇరిగేషన్, మైక్రో స్ప్రింక్లర్లను ఉపయోగిస్తూ, క్రిమిసంహారక నియంత్రణకు వారానికోసారి పిచికారీ చేస్తారు. ఈ పూలను నేరుగా స్థానిక స్టాళ్లు, హోల్‌సేల్ మార్కెట్లకు విక్రయిస్తారు. డిమాండ్‌ను బట్టి జెర్బెరా పూలను బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు సరఫరా చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories