Toilets: ఫారెన్ టాయిలెట్స్‌లో వాటర్ బదులు టిష్యూస్ ఎందుకు వాడతారో తెలుసా? అసలు కారణాలు ఇవే

Published : Jul 11, 2026, 10:32 AM IST

Toilets: ఇండియాలోని టాయిలెట్స్ లో నీటి వాడకం ఎక్కువ.. వాటర్ లేకపోతే జనజీవనం స్థంభించిపోతుంది. కానీ అమెరికా లాంటి ఫారెన్ కంట్రీస్ లో టాయిలెట్స్, వాష్ రూమ్స్ లో వాటర్ బదులుగా టీష్యూస్ ను ఎందుకు వాడతారో తెలుసా? నీటి కొరత లేకపోయినా.. ఎందుకు ఉపయోగించరు?

PREV
15
అమెరికా, యూరప్ దేశాల్లో ఎక్కువగా..

మన భారతదేశంతో పాటు చాలా ఆసియా దేశాలలో టాయిలెట్ వెళ్ళినప్పుడు నీటిని ఉపయోగించడం ఒక ఆనవాయితీ. నీటితో శుభ్రం చేసుకుంటేనే పూర్తిగా శుభ్రంగా ఉన్నాం అనే భావన మనలో ఉంటుంది. కానీ ఫారెన్ కంట్రీస్ ముఖ్యంగా.. అమెరికా, యూరప్ వంటి ప్రాంతాలలో (ఫారెన్ కంట్రీస్) టాయిలెట్ పేపర్ లేదా టిష్యూలను మాత్రమే వాడతారు. కడగకుండా కేవలం తుడుచుకోవడానికి వెనుక కొన్ని బలమైన భౌగోళిక, సాంస్కృతిక, సాంకేతిక కారణాలు ఉన్నాయి. ఇంతకీ ఏంటవి?

25
వాతావరణ పరిస్థితులు..

పాశ్చాత్య దేశాలలో అత్యధిక కాలం తీవ్రమైన చలి ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయి. అటువంటి వాతావరణంలో పైపుల ద్వారా వచ్చే నీరు గడ్డకట్టుకుపోతుంది లేదా అత్యంత చల్లగా ఉంటుంది. ఆ చల్లటి నీటిని టాయిలెట్లలో ఉపయోగించడం అసాధ్యం. ప్రతి టాయిలెట్ కూ హీటర్ కనెక్షన్ ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే వాతావరణానికి అనుకూలంగా వారు డ్రై టిష్యూలను వాడటం అలవాటు చేసుకున్నారు.

35
ప్లంబింగ్ ‌- డ్రైనేజీ వ్యవస్థ

విదేశాలలో డ్రైనేజీ పైపుల నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుంది. వారి టాయిలెట్ పేపర్లు నీటిలో త్వరగా కరిగిపోయేలా (Bio-degradable) ప్రత్యేకంగా తయారవుతాయి. ఫ్లష్ చేయగానే అవి పైపులలో కరిగిపోతాయి. ఒకవేళ అక్కడ నీటిని ఎక్కువగా వాడితే, బాత్రూమ్ అంతా తడితడిగా మారి బ్యాక్టీరియా, బూజు (Mold) చేరే ప్రమాదం ఉంది. బాత్రూమ్‌ను ఎప్పుడూ పొడిగా (Dry) ఉంచడానికే వారు ఇష్టపడతారు.

45
తరాలుగా ఇదే అలవాటు..

మనకు చిన్నప్పటి నుండి నీటిని వాడటం ఎలా అలవాటో, కొన్ని ఫారెన్ కంట్రీస్ లో వారికి చిన్నతనం నుండి టాయిలెట్ పేపర్ వాడటమే నేర్పుతారు. వారి సంస్కృతిలో నీటి కన్నా పేపర్ వాడటమే ఎక్కువ పరిశుభ్రమైనదిగా భావిస్తారు. అలాగే ప్రయాణాల్లో ఉన్నప్పుడు నీటి లభ్యత లేకపోయినా టిష్యూలు సులభంగా అందుబాటులో ఉంటాయి.

55
టాయిలెట్ పేపర్ వల్ల సమస్యలు..

అయితే.. ఇటీవల కాలంలో టాయిలెట్ పేపర్ వల్ల చర్మ సమస్యలు ఎక్కువయ్యాయి. అంతే కాదు పేపర్ తయారీ కోసం లక్షలాది చెట్లను నరకాల్సి రావడం వంటి కారణాల వల్ల ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు. విదేశాలలో కూడా 'బిడెట్' (Bidet- నీటి స్ప్రేయర్) వాడకం నెమ్మదిగా పెరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడిన ఈ అలవాటు నేడు వారి జీవనశైలిలో ఒక భాగమైపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories