Mosquitoes: దోమలు కొందరిని మాత్రమే ఎందుకు కుడతాయి? దీని వెనుక కారణాలు ఇవే

Published : Aug 03, 2026, 06:17 PM IST

Mosquitoes: గుంపులో ఉన్న దోమలు వెతుక్కుని మరి మిమ్మల్నే కరుస్తున్నాయా? ఇలా కొందరిని మాత్రమే దోమలు ఎందుకు ఎక్కువగా కుడతాయో తెలుసా? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

PREV
13
దోమలు కుటేందుకు కారణాలు

ఇంట్లో ఎంతో మంది ఉన్నా కూడా దోమలు కొందరినే కరుస్తున్నాయా? కొందరినే ఇలా దోమలు ఎందుకు కుడతాయో తెలుసా? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దోమలను ఆకర్షించడంలో మీ బ్లడ్ గ్రూప్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. జపాన్ పరిశోధకులు చెబుతున్న ప్రకారం 'O' బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని ఇతర గ్రూపుల వారికంటే దోమలు రెండింతలు ఎక్కువగా కుడతాయి. చర్మం నుంచి వెలువడే రసాయన సంకేతాల ద్వారా దోమలు బ్లడ్ గ్రూప్‌ను గుర్తిస్తాయి.

కార్బన్ డయాక్సైడ్ వల్ల

మీరు శ్వాసలో వదిలే కార్బన్ డయాక్సైడ్ (CO2) వాయువును దోమలు సుమారు 100 అడుగుల దూరం నుంచే పసిగట్టగలవు. ఎవరు ఎక్కువ CO2 విడుదల చేస్తారో, వారి వైపు దోమలు వేగంగా ఆకర్షితులవుతాయి. ముఖ్యంగా  గర్భిణులు, ఎక్కువగా వ్యాయామం చేసేవారు ఇతరుల కంటే ఎక్కువ CO2 విడుదల చేస్తారు. అందుకే దోమలు వారి దగ్గరకు త్వరగా వెళ్తాయి.

23
శరీర చెమట, దాని వాసన

మన చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా, కార్బాక్సిలిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు దోమలకు ఇష్టమైన వాసనను ఇస్తాయి. చర్మంపై ఉండే బ్యాక్టీరియా చెమటతో కలిసినప్పుడు ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది. ఎవరి చర్మంపై ఈ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయో, వారిని దోమలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.

 ముదురు రంగు దుస్తులు

దోమలు వాసనతోనే కాదు, చూపుతో కూడా మిమ్మల్ని గుర్తిస్తాయి. మీరు నలుపు లేదా ముదురు నీలం వంటి డార్క్ కలర్ బట్టలు వేసుకుంటే, దోమలకు సులభంగా కనిపిస్తారు. లేత రంగు బట్టలతో పోలిస్తే, ముదురు రంగు బట్టలు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయి.

33
శరీరం నుంచి వచ్చే వేడి

శరీర వేడి ఎక్కువగా ఉన్నవారిని, ఎక్కువగా చెమట పట్టేవారిని దోమలు త్వరగా గుర్తిస్తాయి. బీర్ లేదా ఆల్కహాల్ తాగేవారిని దోమలు ఎక్కువగా కుడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆల్కహాల్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగడం, చెమట వాసన మారడం దీనికి కారణం కావచ్చు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

పైన చెప్పిన బ్లడ్ గ్రూప్, కార్బన్ డయాక్సైడ్, చెమట, బట్టల రంగు, శరీర వేడితో పాటు, చర్మంపై నివసించే సూక్ష్మజీవుల సమూహం కూడా దోమలను ఆకర్షించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనుషుల చర్మంపై కోట్లాది బ్యాక్టీరియాలు నివసిస్తాయి. కానీ, ప్రతి వ్యక్తి చర్మంపై ఉండే బ్యాక్టీరియా రకాలు, వాటి సంఖ్య భిన్నంగా ఉంటాయి. చర్మంపై రకరకాల బ్యాక్టీరియాలు తక్కువగా ఉండి, కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉన్నవారిని దోమలు చాలా సులభంగా గుర్తించి కుడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories