Uma Telugu Traveller: ఎప్పుడో చిన్నప్పుడు కథలో, సినిమాల్లో నరమాంస భక్షకుల గురించి వింటుంటాం.. కానీ అటువంటి మనుషులు భూమిద నిజంగా ఉన్నారని మీకు తెలుసా? వాళ్లు ఎక్కడున్నారు? ఇప్పుడేం చేస్తున్నారు. ట్రావెలర్ ఉమ చేసిన సాహస యాత్ర.
ప్రపంచంలో అనేక వింతైన, విచిత్రమైన సంస్కృతులు, తెగలు ఉన్నాయి. అయితే 'నరమాంస భక్షకులు' (Cannibals) అనగానే ఇప్పటికీ చాలా మందిలో భయంతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది. "ఆధునిక ప్రపంచంలో మనుషుల్ని తినే మానవ జాతి ఇంకా ఉందా?" అనే ప్రశ్నకు సమాధానం ప్రముఖ తెలుగు యూట్యూబర్, సాహస యాత్రికుడు ఉమా (Uma Telugu Traveller) గతంలో చేసిన ఓ వీడియో ద్వారా ఇచ్చాడు. ఇండోనేషియాలోని దట్టమైన అడవుల్లోకి వెళ్లి ఆయన చేసిన సాహస యాత్ర ఒక సరికొత్త సమాచారాన్ని మనకు అందిస్తుంది .
26
కొరవాయి తెగ (Korowai Tribe) - నిజంగా మనుషుల్ని తింటారా?
ఇండోనేషియాలోని వెస్ట్ పపువా (West Papua) ప్రాంతంలోని దట్టమైన వర్షాధార అడవుల్లో నివసించే 'కొరవాయి' (Korowai) అనే తెగను ప్రపంచంలోనే చివరి నరమాంస భక్షకులుగా చెప్తారు. వీరి చారిత్రక నేపథ్యం చూసుకుంటే.. ఈ కొరవాయి తెగ ప్రజలు ఒకప్పుడు తమ శత్రువులను లేదా తమపై దాడి చేసే ఇతర తెగల వారిని వేటాడి, చంపి, కాల్చుకుని తినేవారని చరిత్ర చెబుతోంది. అయితే ప్రస్తుతం వీరు క్రమంగా మారుతున్నారని, మనుషులను తినడం ఆపేశారని ట్రావెలర్ ఉమా తన వీడియోలో స్పష్టం చేశారు.
36
వంద అడుగుల ఎత్తులో ఇల్లు, ఉమా చేసిన సాహస యాత్ర
ఈ తెగ ప్రత్యేకత ఏమిటంటే ట్రీ హౌసెస్ .. వీరు నేల మీద కాకుండా, పెద్ద పెద్ద చెట్ల చివర్లలో దాదాపు 100 అడుగుల ఎత్తులో ట్రీ హౌసెస్ (Tree Houses) నిర్మించుకుని జీవిస్తారు. శత్రువులు, క్రూర జంతువుల నుండి రక్షణ పొందడానికే వీరు ఈ రకమైన ఎత్తైన ఇళ్లను తెలుగు ప్రేక్షకులకు ఈ భయంకరమైన కొరవాయి తెగ జీవితాన్ని చూపించడానికి ఉమా దాదాపు 250 నుండి 300 కిలోమీటర్ల మేర నదీ మార్గంలో బోటులో ప్రయాణించారు . ఆ అడవిలో టెంట్లు వేసుకుని చీమల కాట్లు, చలిని తట్టుకుంటూ రాత్రులు గడిపారు. అంతే కాదు అంత ఎత్తులో ఇంటిని కూదా ఉమా ఎక్కి చూపించారు.
కొరవాయి తెగ ప్రజలకు బట్టలు వేసుకునే అలవాటు లేదు; శరీరాన్ని కేవలం అడవిలో దొరికే ఆకులు, నారతో కప్పుకుంటారు. వీరు చెక్క, వెదురుతో తయారు చేసిన ప్రత్యేకమైన బాణాలు (Bow & Arrows), రాతితో చేసిన గొడ్డళ్లు (Hammers) ఉపయోగిస్తారు . జంతువుల ఎముకలతో చేసిన బాణాలు ఎంత పదునుగా ఉంటాయంటే ఒకసారి నాటుకుంటే బయటకు తీయడం సాధ్యం కాదు. అంతే కాదు వీరు నిప్పు వెలిగించాలంటే అగ్గిపెట్టలు వాడరు. ఇప్పటికీ కర్రలను, తాళ్లను ఉపయోగించి రాపిడి ద్వారా సాంప్రదాయ పద్ధతిలోనే నిప్పును రాజేస్తారు.
56
కొరవాయి తెగ ఆహారపు అలవాట్లు
ప్రస్తుతం వీరు అడవి పందులు, తాబేళ్లు, ముసళ్లు, నదుల్లో దొరికే లాబ్‌స్టర్లు తో పాటు 'సాగు' (Sago) అనే చెట్టు పిండితో తయారు చేసిన పదార్థాలను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా, ఆధునిక కరెన్సీ లేదా దుస్తుల పరిజ్ఞానం కూడా లేకుండా ఇప్పటికీ ఈ తెగ ప్రజలు వేల ఏళ్ల నాటి ప్రాచీన పద్ధతుల్లోనే జీవిస్తున్నారు. ఒకప్పుడు భయంకరమైన నరమాంస భక్షకులుగా పేరుపొందిన కొరవాయి తెగ, ఇప్పుడు ఆధునిక ప్రపంచానికి దూరంగా తమ ప్రత్యేక సంస్కృతిని కాపాడుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారని ఉమా తన సాహస యాత్ర ద్వారా ప్రత్యక్షంగా చూపించారు.
66
100 దేశాలకు పైగా కంప్లీట్ చేసుకున్న ఉమ..
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఉమ ప్రసాద్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ.. యూట్యూబర్ గా మారి రీసెంట్ గా 100 దేశాలు పూర్తిచేసుకున్నాడు ఆఫ్రికాలోని మాలీలొ మొదలైన అతని ట్రావెలర్ కెరీర్.. తిరిగి ఆఫ్రీకా దేశాల్లోన 100 దేశాల మైలురాయిని చేరుకుంది. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బంది పడిన రోజుల నుంచి స్టార్ యూట్యూబర్ , ట్రావెలర్ గా ఎదిగిన ఉమ.. నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు.