నీటిలో ఎక్కువసేపు ఉంటే.. వేళ్లు ఎందుకిలా ముడుచుకుపోతాయి? దీనికి కార‌ణం ఏంటంటే..

Published : Jan 16, 2026, 11:39 AM IST

Interesting Facts: నీటిలో ఎక్కువ సేపు ఉంటే చేతి వేళ్లు, కాలి వేళ్లపై ముడతలు పడినట్టు కనిపిస్తాయి. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంద‌న్న దానిపై చాలా మందికి క్లారిటీ ఉండ‌దు. ఇది మన దేహంలోని మెదడు, నరాల వ్యవస్థ కలిసి చేసే ఒక తెలివైన ప్రక్రియని మీకు తెలుసా.? 

PREV
15
నీటిలోకి వెళ్లగానే వేళ్లలో ఏం జరుగుతుంది?

వేళ్లు ఎక్కువసేపు నీటిలో ఉన్నప్పుడు చేతులు, కాళ్ల వేళ్ల చర్మం క్రమంగా ముడుచుకుంటుంది. ఇది నీరు చర్మంలోకి చేరడం వల్ల కాదు. పరిశోధనల ప్రకారం ఇది పూర్తిగా నరాల వ్యవస్థ నియంత్రణలో జరిగే మార్పు. మనకు తెలియకుండానే మెదడు దీనికి ఆదేశాలు ఇస్తుంది.

25
మెదడు ఎలా సిగ్నల్ ఇస్తుంది?

వేళ్లు నీటిలో ఉండగానే అక్కడ ఉన్న నరాలు యాక్టివ్ అవుతాయి. అవి మెదడుకు సమాచారం పంపుతాయి. వెంటనే మెదడు రక్తనాళాలకు సిగ్నల్ ఇస్తుంది. దాంతో వేళ్లలో ఉన్న రక్తనాళాలు కొంచెం కుదించుకుంటాయి. రక్త ప్రవాహం తగ్గడంతో చర్మం లోపలికి లాగబడుతుంది. అందుకే వేళ్లపై ముడతలు ఏర్పడతాయి.

35
ఇది ఏదైనా వ్యాధి లక్షణమా?

ఇది ఎలాంటి వ్యాధి ల‌క్ష‌ణం కాదు. ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియ. అసలు ఇది మన నరాలు బాగా పనిచేస్తున్నాయనే సంకేతం కూడా. నరాలకు తీవ్రమైన నష్టం ఉన్న కొందరిలో నీటిలో ఉన్నా వేళ్లు ముడుచుకోవు. కాబట్టి వేళ్లు ముడుచుకోవడం అంటే శరీరం సరిగ్గా స్పందిస్తోందన్న మాట.

45
వేళ్లు ముడుచుకోవడం వల్ల మనకు లాభం ఏంటి?

ఈ మార్పు వెనుక ఒక ఉపయోగం ఉంది. ముడుచుకున్న వేళ్లతో తడి వస్తువులను గట్టిగా పట్టుకోవడం సులభమవుతుంది. ముడతల వల్ల చర్మంపై చిన్న గాట్లు ఏర్పడతాయి. అవి నీటిని పక్కకు తొలగించి గ్రిప్ పెంచుతాయి. వర్షంలో రోడ్డుపై టైర్లు ఎలా గ్రిప్ ఇస్తాయో అలాగే అన్న‌మాట‌.

55
ఎప్పుడు జాగ్రత్తపడాలి?

సాధారణంగా నీటిలో కొంతసేపు ఉన్న తర్వాత వేళ్లు ముడుచుకోవాలి. అలా కాకుండా చాలా సేపు నీటిలో ఉన్నా వేళ్లలో ఎలాంటి మార్పు రాకపోతే డాక్టర్ సలహా తీసుకోవచ్చు. ఇది నరాలకు సంబంధించిన సమస్యకు సంకేతం కావొచ్చు. అయితే ఎక్కువ సందర్భాల్లో ఇది సహజమే. భయపడాల్సిన అవసరం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories