విమానయాన సంస్థల ప్రకారం, ఎండిన కొబ్బరి, అంటే కొబ్బరి చిప్పలు (కొబ్బరి) చాలా ప్రమాదకరం. వీటిలో నూనె శాతం ఎక్కువగా ఉండటం వల్ల, వాటంతట అవే మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే విమానం లగేజీలో ఉంచినప్పుడు, అక్కడి వేడికి ఇది అగ్ని ప్రమాదానికి దారితీయొచ్చు.
ఎండిన కొబ్బరిని చెక్-ఇన్ బ్యాగేజీలో తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. హ్యాండ్ బ్యాగ్ లేదా చెక్-ఇన్ బ్యాగ్.. దేనిలోనూ కొబ్బరి చిప్పలను తీసుకెళ్లలేరు. అది పచ్చి కొబ్బరికాయ అయినా, ఎండిన కొబ్బరికాయ అయినా సరే, పూర్తిగా తీసుకెళ్లకూడదు. స్పైస్‌జెట్ వంటి కొన్ని విమానయాన సంస్థలు కొబ్బరికాయను అనుమతిస్తాయి. కానీ, అది కొబ్బరి చిప్పలు అయి ఉండకూడదు. కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సరిగ్గా ప్యాక్ చేసి చెక్-ఇన్ లగేజీలో తీసుకెళ్లవచ్చు. అయితే, సరైన ప్యాకింగ్ చాలా ముఖ్యం. ఆధ్యాత్మికం: అన్ని సమస్యలను దూరం చేసే కొబ్బరికాయ పూజ! డబ్బును ఆకర్షించే పరిహారం ఇదే!