Interesting Facts: కారు, బస్సు నడిపితే డ్రైవర్, ట్రైన్ నడిపితే లోకో పైలట్ అని ఎందుకు అంటారు?

Published : Oct 27, 2026, 12:57 PM IST

Interesting Facts: సాధారణంగా బస్సు, లారీ నడిపేవారిని డ్రైవర్ అని పిలుస్తాం. రైలు నడిపేవారిని మాత్రం లోకో పైలట్ అంటాం. అసలు ఒకరికి డ్రైవర్ అని పేరు పెట్టి, ఇంకొకరికి లోకో పైలట్ అనే హోదా ఎందుకు ఇచ్చారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం.

PREV
14
డ్రైవర్ అనే పదానికి అర్థమేంటి?

ఇంగ్లీష్‌లోని ‘Drive’ అనే పదానికి వాహనాన్ని నడపడం లేదా ముందుకు తీసుకెళ్లడం అనే అర్థాలు ఉన్నాయి. ఈ పదం నుంచి ‘Driver’ అనే పదం వచ్చింది. అంటే వాహనాన్ని నియంత్రిస్తూ నడిపే వ్యక్తిని డ్రైవర్ అని పిలుస్తారు. కారు, బస్సు, లారీ, టాక్సీ వంటి వాహనాలను నడిపేవారికి ఈ పేరు సాధారణంగా ఉపయోగిస్తారు. వీరు రోడ్లపై వాహనాలను నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి. రహదారిపై ఉన్న ఇతర వాహనాలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గమనిస్తూ సురక్షితంగా ప్రయాణాన్ని కొనసాగించాలి. వాహనం వేగాన్ని నియంత్రించడం, అవసరమైనప్పుడు బ్రేకులు వేయడం, మలుపులు తీసుకోవడం వంటి పనులు డ్రైవర్ బాధ్యతల్లో భాగం.

24
రైలు నడిపేవారిని లోకో పైలట్ అని ఎందుకు అంటారు?

రైలును నడిపే వ్యక్తిని భారతీయ రైల్వేలో అధికారికంగా ‘లోకో పైలట్’ అని పిలుస్తారు. ఈ పేరులోని ‘లోకో’ అనే పదం లోకోమోటివ్‌ (Locomotive) నుంచి వచ్చింది. లోకోమోటివ్ అంటే రైలును లాగడానికి లేదా నడిపించడానికి ఉపయోగించే ఇంజిన్. ఇక ‘పైలట్’ అనే పదాన్ని సాధారణంగా విమానాన్ని నడిపే వ్యక్తికి ఉపయోగిస్తారు. అయితే ఈ పదానికి చాలా అర్థం ఉంది. ఒక వాహనం లేదా యంత్రాన్ని నిర్దిష్ట మార్గంలో నడిపిస్తూ, దాని కదలికను నియంత్రించే వ్యక్తిని కూడా కొన్ని సందర్భాల్లో పైలట్‌గా పేర్కొంటారు. ఈ రెండు పదాలు కలిపి ‘లోకో పైలట్’ అనే పేరు ఏర్పడింది.

34
లోకో పైలట్ పని కేవలం రైలు నడపడమేనా?

చాలామంది రైలు నడిపే వ్యక్తి తన ముందు ఉన్న లివర్లు, నియంత్రణ వ్యవస్థలను ఉపయోగిస్తూ రైలును ముందుకు తీసుకెళ్తారని మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి లోకో పైలట్ బాధ్యతలు అంతకంటే ఎక్కువగా ఉంటాయి. ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఇంజిన్ పరిస్థితిని పరిశీలించడం, భద్రతకు సంబంధించిన సూచనలను తెలుసుకోవడం, సిగ్నల్స్‌ను గమనించడం, వేగ పరిమితులను పాటించడం, రైలు ప్రయాణించే మార్గంలో ఉన్న పరిస్థితులపై అప్రమత్తంగా ఉండడం వంటి పనులు వారి విధుల్లో భాగం. ప్రయాణ సమయంలో సిగ్నల్స్‌లో కనిపించే సూచనలను సరిగ్గా అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా రైలును నడపాలి. వాతావరణ పరిస్థితులు, పట్టాలపై కనిపించే అసాధారణ పరిస్థితులు, ఇతర రైల్వే సూచనలపైనా నిరంతరం దృష్టి పెట్టాలి.

44
డ్రైవర్, లోకో పైలట్ మధ్య తేడా ఇదే!

బస్సు, కారు వంటి వాహనాలను నడిపే వ్యక్తి తనకు నచ్చిన దిశలో వాహనాన్ని ముందుకు తీసుకెళ్తాడు. వాహనం ఎటు వెళ్లాలో స్వయంగా నింయత్రిస్తాడు. అందుకే వారిని డ్రైవర్ అంటారు. కానీ రైలుకు స్టీరింగ్ ఉండదు. అది కేవలం పట్టాలపైనే వెళ్తుంది. దాన్ని నడిపే వ్యక్తి సిగ్నల్స్, ట్రాక్ మార్పులు, వేగం వంటి సాంకేతిక విషయాలను గమనిస్తూ రైలును గమ్యస్థానానికి చేర్చాలి కాబట్టి.. వారిని లోకో పైలట్ అని పిలుస్తారు. రైలును నడపడానికి ప్రత్యేకమైన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, సిగ్నలింగ్ వ్యవస్థపై అవగాహన అవసరం. అందుకే రైల్వేలో వారి బాధ్యతలకు ప్రత్యేకమైన హోదా, విధివిధానాలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories