ఈ దేశాన్ని అద్దెకు తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు..
ఈ దేశ రాజధాని అయిన 'వాడుజ్' (Vaduz) నగరానికి సంబంధించి ఒక ప్రతీకాత్మక తాళంచెవిని అద్దెదారునికి బహుకరిస్తారు. మీ పేరుతో లేదా మీ ఈవెంట్ కోసం ఒక తాత్కాలిక ప్రైవేట్ నాణేన్ని/కరెన్సీని ముద్రిస్తారు. దాదాపు 150 మంది అతిథులకు విలాసవంతమైన వసతి, ప్రసిద్ధ కోటలు, వైన్ తయారీ కేంద్రాలలో విందులు ఏర్పాటు చేస్తారు. ఆ సమయానికి దేశంలో ఉండే స్థానిక పోలీస్ వ్యవస్థ కూడా అద్దె తీసుకున్న వ్యక్తి చేతిలోనే ఉంటుంది.
ఈ దేశం ఎందుకు అంత స్పెషల్..?
లైచ్టెన్‌స్టెయిన్ కేవలం అద్దె ఆఫర్ వల్లే కాదు, తన ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల వల్ల కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేశంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యధిక తలసరి రాబడి కలిగిన అత్యంత సంపన్న దేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ నిరుద్యోగం అనేది అసలే ఉండదు. అంతేకాదు, ఈ దేశానికి మిలిటరీ లేదా సొంత సైన్యం లేదు. 1868లోనే ఖర్చులను తగ్గించుకోవడానికి తమ సైన్యాన్ని రద్దు చేశారు. మంచు కొండలు, శతాబ్దాల నాటి ప్రాచీన కోటలు, ప్రశాంతమైన వీధులతో ఇది పర్యాటకులకు స్వర్గధామంలా కనిపిస్తుంది. ఈ దేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది.
ఈ దేశాన్ని ఎవరు పాలిస్తారు..?
ఈ దేశంలో ప్రజాస్వామ్యంతో పాటు ఇప్పటికీ రాచరిక వ్యవస్థ అమల్లో ఉంది . ప్రస్తుతం ప్రిన్స్ హన్స్-ఆడమ్ II (Prince Hans-Adam II) ఈ దేశానికి అధిపతిగా ఉన్నారు. ఆయన కుమారుడు ప్రిన్స్ అలోయిస్ (Prince Alois) రోజువారీ పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఐరోపా ఖండంలోనే మిగతా ఏ రాచకుటుంబానికి లేని విధంగా, లైచ్టెన్‌స్టెయిన్ రాజుకే అత్యధిక రాజకీయ అధికారాలు ఉంటాయి. ఇక్కడ ప్రజలు ఎన్నుకునే పార్లమెంట్, ప్రధాని ఉన్నప్పటికీ, రాజు నిర్ణయమే తుది నిర్ణయం కావడం విశేషం.
ఒక్క రోజుకి దేశాన్ని ఎవరైనా అద్దెకు తీసుకుంటారా? అంటే.. సరదా కోసం కోట్లు ఖర్చు చేసే చాలా మంది కోటీశ్వరులు.. ఈ వినూత్న అనుభూతి కోసం అద్దెకు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.