Interesting Facts: ముస్లిం ప్రజలను సాయిబులు అని ఎందుకు పిలుస్తారు? దీని వెనుక కథ ఇదే

Published : Dec 17, 2025, 12:19 PM IST

Interesting Facts: తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చాలా చోట్ల ముస్లిం సోదరులను సాయిబులు అని పిలుస్తూ ఉంటారు. ఇలా ఎందుకు పిలుస్తారో తెలుసా? తెలియకపోతే ఇప్పుడు చదవండి. 

PREV
14
సాయిబు పదం ఎక్కడ్నించి వచ్చింది?

తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ముస్లింలను చాలామంది ఇప్పటికీ సాయిబులు అని పిలుస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పెద్దల మాటల్లో ఈ పదం ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి చరిత్రతో ఉన్న సంబంధం? అనే ప్రశ్నలు చాలామందికి కలుగుతుంటాయి. భాషా నిపుణులు చెబుతున్న ప్రకారం సాయిబులు అనే పదం వెనుక ఒక ప్రత్యేకమైన చారిత్రక భాషాపరమైన నేపథ్యం ఉంది. సాయిబులు అనే పదాన్ని గౌరవ సూచకంగా వాడిన మాట అని వారు చారిత్రక నిపుణులు వివరిస్తున్నారు.

24
ఆ పిలుపు వెనుక గౌరవం

భాషా పరిశోధకులు చెబుతున్న ప్రకారం సాయిబు అనే పదం పర్షియన్, అరబిక్ భాషల్లో వాడే సాహెబ్ అనే పదం నుంచి పుట్టుకొచ్చంది. సాహెబ్ అంటే యజమాని, అధికారి, గౌరవనీయమైన వ్యక్తి అని అర్థం. మొఘల్ పాలన కాలంలో, అలాగే దక్కన్ సుల్తానులు పాలించే సమయంలో ముస్లిం రాజులు, అధికారులు, సైన్యాధిపతులను గౌరవంగా సాహెబ్ అని పిలిచేవారు. ఆ రోజుల్లో ఈ పదం ఒక హోదా, గౌరవాన్ని సూచించే సంబోధనగా వాడుకలో ఉండేది. కాలక్రమేణా ఇది అధికారులకే కాకుండా, ముస్లింలందరికీ వర్తించేలా ఉపయోగంలోకి వచ్చింది.

34
పలకడానికి కష్టంగా ఉండడంతో

తెలుగు భాష స్వభావం ప్రకారం ఇతర భాషల నుంచి వచ్చిన పదాలు వాడుక భాషలోకి వచ్చాక మారిపోతూ ఉంటాయి. సాహెబ్ అనే పదం తెలుగులో పలకడానికి కొంత కష్టం కావడంతో అది సాయిబు అనే రూపంలోకి మారిందని భాషా నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు డాక్టర్ అనే పదం డాటరుగా, స్టేషన్ అనే పదం ‘టేషను’గా మారినట్టే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలు శతాబ్దాలపాటు ముస్లిం పాలనలో ఉండటంతో ఈ పదం స్థానిక ప్రజల మాటల్లో బాగా స్థిరపడింది. భాష అనేది సమాజంతో పాటు మారుతూ ఉంటుంది. ఒకప్పుడు సహజంగా వాడిన పదాలు, కాలం మారిన తర్వాత కొత్త అర్థాలు సంతరించుకోవచ్చు. అందువల్ల భాష వాడేటప్పుడు చరిత్రను గుర్తుంచుకోవడమే కాకుండా, ఎదుటివారి భావాలను గౌరవించడమూ చాలా అవసరం.

44
నేరుగా పిలవడమే మంచిది

అయితే కాలం మారుతున్న కొద్దీ ఈ పదం వాడకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో గౌరవంగా వాడినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఈ పదాన్ని తక్కువ చేసి మాట్లాడే విధంగా ఉపయోగించడం వల్ల కొంతమందికి అసౌకర్యంగా మారింది. అందుకే నేటి సమాజంలో నేరుగా ముస్లింలు లేదా ముస్లిం సోదరులు అని సంబోధించడం మంచిదని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు. ఏ పదమైనా దాని వెనుక ఉన్న చరిత్రను అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే సమయంలో ఎదుటివారి భావాలను గౌరవిస్తూ మాట్లాడటమే నిజమైన సంస్కృతి అని వారు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, సాయిబులు అనే పదం ఒక చారిత్రక నేపథ్యంతో పాటూ ఎంతో గౌరవప్రదమైనది.

Read more Photos on
click me!

Recommended Stories