ఉదయమా లేదా రాత్రా..? చల్లని బీర్ తాగడానికి మంచి సమయం ఏది?

Published : Dec 16, 2025, 10:07 PM IST

భోజనానికి ముందా లేదా తర్వాతా? ఉదయమా లేదా రాత్రా..? చల్లచల్లని బీర్ తాగడానికి మంచి సమయం ఏది? ఈ ప్రశ్న మీకు కూడా ఉందా..? నిపుణులు ఇచ్చిన సమాధానం ఇక్కడ చూడండి.

PREV
15
బీర్ తాగడానికి సరైన సమయమేది?

ఈ రోజుల్లో చాలామంది పని ఒత్తిడి లేదా అలసట నుండి ఉపశమనం పొందడానికి బీర్ తాగుతారు. చల్లని బీర్ నిమిషాల్లో అలసటను పోగొట్టి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. కానీ బీర్ తాగడానికి సరైన సమయం ఏది… ఉదయమా లేదా రాత్రా? అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా చర్చించబడుతుంది.

25
ఏది మంచి ఎంపిక?

ఆరోగ్య పరంగా చూస్తే బీర్ ప్రభావం తాగే సమయాన్ని బట్టి మారుతుంది. కాబట్టి ఉదయం లేదా రాత్రి బీర్ తాగడం మంచిదా? ఏది మీ శరీరానికి తక్కువ హానికరం అని తెలుసుకోవడం ముఖ్యం. ఎప్పుడు బీర్ తాగాలో తెలిసుకుంటే ఆరోగ్యానికి హాని జరగకుండా జాగ్రత్త పడవచ్చు… అలాగే కిక్కును కూడా ఎంజాయ్ చేయవచ్చు. 

35
ఉదయం బీర్ తాగడం సరైనదేనా?

ఉదయం బీర్ తాగడం సాధారణంగా మంచిది కాదు. ఉదయం శరీరం డిటాక్స్ మోడ్‌లో ఉంటుంది. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ వేగంగా గ్రహించబడి, ఎక్కువ కిక్‌కు దారితీస్తుంది. రక్తంలో చక్కెర తగ్గవచ్చు. రోజంతా నీరసం, తలతిరగడం లేదా అలసటగా అనిపించవచ్చు. ఈ అలవాటు వ్యసనంగా మారొచ్చు.

45
రాత్రి బీర్ తాగడం మంచిదేనా?

ఉదయం కంటే రాత్రి బీర్ తాగడం మంచిది. సాయంత్రానికి జీర్ణవ్యవస్థ సాధారణ స్థితికి వస్తుంది. కానీ నిద్రపోయే ముందు తాగితే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. తరచుగా మూత్రవిసర్జన, మరుసటి రోజు హ్యాంగోవర్‌కు దారితీయవచ్చు. రాత్రిపూట తక్కువ మోతాదులో, తేలికపాటి ఆహారంతో తాగడం మంచిది.

55
మంచి సమయం ఏది?

ఆరోగ్య నిపుణుల ప్రకారం… ఏ రకమైన ఆల్కహాల్ అయినా ఉదయం తాగడం మంచిది కాదు. బీర్ తాగాలనుకుంటే వారాంతంలో అదీ పరిమిత పరిమాణంలో మాత్రమే తాగాలి. రాత్రిపూట తాగడం సురక్షితం. ఇది నిద్రపై తక్కువ ప్రభావం చూపుతుంది. శరీరం సులభంగా జీర్ణం చేసుకుంటుంది. లిక్కర్  మితంగానే తీసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories