Boys vs Girls Height : మహిళల కంటే మగవాళ్లే ఎక్కువ పొడవు పెరుగుతారు? కారణమేంటో తెలుసా?

Published : Aug 27, 2026, 04:07 PM IST

మనుషుల్లో పురుషాధిక్యత ఉండటానికి ప్రధాన కారణం శరీర నిర్మాణం. అమ్మాయిలు కాస్త బలహీనంగా, ఎత్తు తక్కువగా ఉంటారు… అదే అబ్బాయిలు బలంగా, మంచి హైట్ తో ఉంటారు. ఇలా ఎత్తులో తేడా ఉండటానికి కారణమేంటో తెలుసా?

PREV
13
అమ్మాయిల కంటే అబ్బాయిల హైట్ ఎక్కువ... ఎందుకు?

చాలా జంతువుల్లో మగవాటి కంటే ఆడవే ఆధిపత్యాన్ని కలిగివుంటాయి. హైనాల్లో మగవాటి కంటే ఆడవే శారీరకంగా చాలా దృఢంగాను, దూకుడుగాను ఉంటాయి. ఇక ఏనుగులు, సింహాలు వంటి అడవి జంతువుల్లోనూ ఆడవాటి ఆధిపత్యం కనిపిస్తుంది. చివరికి తేనెటీగలు, నీటిలో ఉండే కొన్నిరకాల తిమింగాల్లోనూ మెయిల్ డామినెన్స్ (Male Dominance, పురుషాధిక్యత) కంటే ఫీమెయిల్ డామినెన్స్ (Female Dominance, మహిళాధిక్యత) కనిపిస్తుంది. కానీ మనుషుల్లో మాత్రం అన్ని విషయాల్లోనూ ఆడవారికంటే మగవారి ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది.

ప్రాచీన కాలంనుండి ఇప్పటివరకు మానవ సమాజంలో పురుషాధిక్యతే ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణం అమ్మాయిల కంటే అబ్బాయిలు శారీరకంగా ఎత్తుగా, దృఢంగా ఉండటం. ఈ క్రమంలో మనుషులంతా ఒకేలా పుడతారుకదా? మరి అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ ఎత్తు ఎలా పెరుగుతారు? అనే డౌట్ వస్తుంది. దీని గురించి సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుందాం.

23
అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ ఎత్తు ఉండటానికి కారణమిదే..

మహిళ కడుపులో జీవం పోసుకునేది అమ్మాయా లేక అబ్బాయా అనేది క్రోమోజోములు నిర్ణయిస్తాయి. xx క్రోమోజోమ్స్ ఉంటే అమ్మాయి, xy క్రోమోజోమ్స్ ఉంటే అబ్బాయి. ఈ క్రోమోజోమ్సే అబ్బాయిలు, అమ్మాయిల ఎత్తులో తేడాకు కారణమని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్టడీ తేల్చింది.

అమ్మాయి, అబ్బాయిల ఎత్తులో తేడా ఎందుకుంటుంది అనేదానిపై నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధన చేపట్టింది. ఇందులో ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి. మహిళలోని xx క్రోమోజోమ్స్, పురుషుల్లోని xy క్రోమోజోమ్ లో మనిషి ఎదుగుదలను కారణమయ్యే జీన్స్ ఉంటాయట. అయితే x క్రోమోజోమ్స్ లో కంటే y క్రోమోజోమ్స్ లో షాక్స్ అనే జీన్ చాలా యాక్టిగా ఉంటుందట. దీనివల్లే అబ్బాయిలు ఎక్కువ ఎత్తు పెరుగుతారని ఈ పరిశోదనలో తేలింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే పురుషుల్లోనూ కొందరు పొట్టిగా ఉంటారు. దీనికి కూడా y క్రోమోజోమ్ లోని షాక్ జీన్స్ కారణమట. ఈ జీన్స్ తక్కువగా ఉన్నా లేకుండా యాక్టివ్ గా లేకున్నా మగవాళ్లు కూడా పొట్టిగానే ఉండిపోతారట. ఇలా మగవాళ్లు మంచి హైట్ కలిగివుండటానికి, మహిళలు కాస్త పొట్టిగా ఉండటానికి y క్రోమోజోమ్ లోని షాక్ జీన్ కారణమని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చెబుతోంది.

33
అమ్మాయిలు, అబ్బాయిల హైట్ తేడాకు మరిన్ని కారణాలు...

ప్రపంచవ్యాప్తంగా పురుషులు స్త్రీల కంటే సగటున 12 నుండి 15 సెంటీమీటర్లు (సుమారు 4-5 అంగుళాలు) ఎక్కువ ఎత్తు ఉంటారు. ఇలా పురుషులు సగటున మహిళల కంటే ఎత్తుగా ఉండటానికి హార్మోన్ల వ్యత్యాసాలు, యుక్తవయసులో తేడా కూడా కారణమే అని సైన్స్ చెబుతోంది.

యుక్తవయసు తేడా...

అమ్మాయిలకు సాధారణంగా 10-12 సంవత్సరాల వయసులోనే యుక్తవయస్సు ప్రారంభమవుతుంది. అబ్బాయిలకు 12-14 సంవత్సరాల వయసులో మొదలవుతుంది. ఇలా అబ్బాయిలకు తీవ్రమైన ఎదుగుదల దశ (Growth Spurt) ప్రారంభమయ్యే ముందే అదనంగా 2 సంవత్సరాల సమయం లభిస్తుంది. ఈ అదనపు సమయం వల్లే అమ్మాయిల కంటే అబ్బాయిలు చిన్నప్పటి నుంచే శరీర ఎత్తును ఎక్కువగా పొందుతారు.

హార్మోన్ల ప్రభావం

ఈస్ట్రోజెన్ (Estrogen) : మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎముకల చివర ఉండే గ్రోత్ ప్లేట్లను (Epiphyseal Plates) త్వరగా మూసివేస్తుంది. దీనివల్ల కొద్ది సంవత్సరాల్లోనే (సుమారు 15-16 ఏళ్లకు) అమ్మాయిల ఎత్తు పెరగడం ఆగిపోతుంది.

టెస్టోస్టెరాన్ (Testosterone) : అబ్బాయిలలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు పొడవుగా ఎదగడమే కాకుండా, కండరాల సాంద్రత పెరుగుతుంది. ఎముకల్లోని గ్రోత్ ప్లేట్స్ 18-20 సంవత్సరాల వయసు వరకు పనిచేస్తాయి.. అందువల్లే ఎక్కువ ఎత్తు పెరుగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories