Indian First Movie Name: మొట్ట మొదటగా రిలీజ్ అయిన ఇండియన్ సినిమా ఏంటో తెలుసా?

Published : Jul 17, 2026, 04:41 PM IST

Indian First Movie Name: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర రంగాల్లో ఒకటి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వంటి ఇండస్ట్రీలు వందల్లో సినిమాలను తీస్తున్నాయి. అయితే ఈ సినీ ప్రయాణానికి నాంది పలికిన తొలి భారతీయ సినిమా ఏంటో తెలుసా?

PREV
15
ఫీచర్ ఫిల్మ్ గా గుర్తింపు పొందిన 'రాజా హరిశ్చంద్ర'

ఈ సినీ ప్రయాణానికి నాంది పలికిన తొలి భారతీయ సినిమా ఏదో చాలా మందికి తెలియదు. భారతదేశంలో తొలి పూర్తి నిడివి గల ఫీచర్ ఫిల్మ్ గా గుర్తింపు పొందిన చిత్రం 'రాజా హరిశ్చంద్ర' ఈ సినిమా 1913 మే3న విడుదలైంది. ప్రముఖ దర్శకుడు దాదాసాహెహ్ ఫాల్కే దీనిని తెరకెక్కించారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన్ని భారతీయ సినిమాకు పితామహుడు అని గౌరవిస్తారు. భారత ప్రభుత్వ అత్యున్నత సినీ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయన పేరుమీదే ప్రదానం చేస్తున్నారు.

25
రికార్డింగ్ టెక్నాలజీ అందుబాటులో లేదు

రాజా హరిశ్చంద్ర ఒక మూకీ సినిమా. అంటే ఇందులో మాటలు ఉండవు. ఆ కాలంలో రికార్డింగ్ టెక్నాలజీ అందుబాటులో లేదు. అందుకే కథను నటుల హావభావాలు, భావోద్వేగాలు మధ్య మధ్యలో వచ్చే టైటిల్ కార్డుల ద్వారా ప్రేక్షకులకు అర్థమయ్యేలా రూపొందించారు. అయినప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

35
రాజా హరిశ్చంద్రుడి జీవిత కథ

ఈ సినిమా పురాణాల్లోని సత్యానికి ప్రతీకగా నిలిచిన రాజా హరిశ్చంద్రుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. సత్యాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యం, సంపద, కుటుంబం అన్నింటినీ త్యాగం చేసిన మహారాజు జీవితాన్ని హృదయాన్ని హత్తుకునేలా చిత్రీకరించారు. అప్పటి ప్రేక్షకులకు ఈ కథ ఎంతో దగ్గరగా ఉండటంతో సినిమా ఘన విజయాన్ని సాధించింది.

45
మహిళా పాత్రలను కూడా పురుషులే పోషించారు

దర్శకుడు దాదాసాహెహ్ ఫాల్కే  తీసిన ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం ఏంటంటే...ఆ రోజుల్లో మహిళలు సినిమాల్లో నటించడానికి ముందుకు రాకపోవడంతో మహిళా పాత్రలను కూడా పురుషులే పోషించారు. తారామతి పాత్రను నటుడు అన్నాసాలుంకే పోషించడం భారతీయ సినీచరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. రాజా హరిశ్చంద్ర విజయంతో భారతదేశంలో సినిమా నిర్మాణానికి కొత్త ఊపు వచ్చింది. అనంతరం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చిత్ర నిర్మాణ సంస్థలు ప్రారంభమయ్యాయి. క్రమంగా మూకీ చిత్రాల నుంచి టాకీ చిత్రాలకు, ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ నుంచి రంగుల సినిమాలకు భారతీయ సినిమా పరిణామం చెందింది.

55
తొలి టాకీ చిత్రంగా ఆలమ్ ఆరా రికార్డు

భారతదేశపు తొలి టాకీ చిత్రంగా ఆలమ్ ఆరా చరిత్ర సృష్టించగా, తొలి తెలుగు టాకీ చిత్రంగా భక్త ప్రహ్లాద ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే తొలి భారతీయ రంగుల చిత్రంగా కిసాన్ కన్య గుర్తింపు పొందింది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ అద్భుతమైన ప్రయాణానికి బలమైన పునాది వేసిన చిత్రం మాత్రం రాజా హరిశ్చంద్ర. అందుకే భారతీయ సినీ చరిత్రను గుర్తు చేసుకున్న ప్రతిసారి ఈ సినిమా దాదా సాహెబ్ ఫాల్కే పేరు చిరస్థాయిగా నిలిచిపోతాయి.v

Read more Photos on
click me!

Recommended Stories