T Shirt: టీ షర్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు T అంటే ఏమిటి?

Published : Jul 16, 2026, 05:52 PM IST

T Shirt: ఇప్పుడు టీ షర్టులు లేని ప్రపంచాన్ని ఊహించలేం. చిన్న పిల్లల నుంచి పెద్ద వారు వరకు అందరూ టీ షర్టును తెగవాడతారు. కానీ అసలు టీ షర్టులో టీ అంటే ఏమిటి? దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది?

PREV
13
టీ షర్ట్ పుట్టుక ఇలా

ఇప్పుడంటే టీ షర్టులు వేసుకుని రోడ్ల మీద తిరిగేస్తున్నాం. కానీ ఒకప్పుడు మాత్రం ఇవి లో దుస్తులు. చొక్కల కింద ఒక టీ షర్టులాంటివి వేసుకునేవారు. 19వ శతాబ్దం చివర్లో అమెరికాలోరి మగవారు ఒంటికి ఒకే పీస్ ఉన్న లోదుస్తులు వేసుకునేవారు. వీటిని కాటన్ లేదా ఉన్నితో తయారు చేసేవాళ్లు. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచేవి. అలాగే చెమటను కూడా పీల్చుకునేవి.  వేసవిలో వేడిని తట్టుకోవడానికి కార్మికులు కేవలం చొక్క లేకుండా టీషర్టుతనే వేసుకోవడం మొదలుపెట్టారు. ఇదే టీ-షర్ట్ ఆలోచనకు పునాది వేసింది.

23
అమెరికన్ నేవీలో టీ షర్ట్ ఎంట్రీ

1913లో అమెరికా నౌకాదళం టీ షర్ట్‌ను తొలిసారి అధికారికంగా స్వీకరించింది. సైనికులు తమ యూనిఫాం కింద లోదుస్తువుగా దీన్ని వాడడం మొదలుపెట్టారు. కాటన్ తో చేసిన ఇది చెమటను పీల్చుకుని, శరీరాన్ని చల్లగా ఉంచేది. దీన్ని ఉతకడం కూడా చాలా సులువు. వేసవిలో నేవీ సైనికులు దీన్ని ఒక్కటే వేసుకుని కూడా తిరగడం ప్రారంభించారు. దీని సింపుల్ డిజైన్, సౌకర్యం సైన్యానికి బాగా నచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా సైనికులు ఐరోపాలో దీన్ని ధరించినప్పుడు.. అది చూసిన యూరోపియన్ సైనికులకు ఇది బాగా నచ్చేసింది. తరువాతి కాలంలో టీ-షర్ట్ కార్మికులు, రైతు కూలీల మధ్య బాగా పాపులర్ అయింది.

33
టీ షర్ట్ పేరు ఎలా వచ్చింది?

టీ షర్టులో అసలు టీ అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారు. ఈ డ్రెస్ పేరు దాని ఆకారం నుంచే వచ్చింది. టీషర్టును మీ రెండు చేతులతో టీషర్టు చేతలు పట్టుకుని  చూడండి ఇంగ్లీష్ అక్షరం 'T' ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీనికి  టీ షర్ట్ అని సింపుల్ గా పేరు పెట్టేశారు. కాలర్ లేకుండా, పొట్టి చేతులతో, గుండ్రని లేదా 'V' ఆకారపు మెడతో కూడా తయారుచేశారు. సాధారణంగా కాటన్ నూలుతో నేసిన ఈ షర్ట్ సాగే గుణం కలిగి ఉంటుంది. అందుకే దీన్ని ధరించడం చాలా సులువుగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories