Almond Capital: డ్రై ఫ్రూట్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది బాదంపప్పు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ బాదంపప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. మరి ఈ పప్పు మన దేశంలో ఎక్కడ ఎక్కువగా పండుతుందో మీకు తెలుసా? మరి లేటేందుకు తెలుసుకుందాం పదండి.
డ్రై ఫ్రూట్స్‌లో బాదంపప్పుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులు తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణలు కూడా చెబుతుంటారు. అయితే మనం ఇష్టంగా తినే ఈ బాదం పప్పు మన దేశంలో ఎక్కడ ఎక్కువగా పండుతుందో మీకు తెలుసా? మన దేశంలో బాదం పప్పు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏదో ఇక్కడ తెలుసుకుందాం.
26
జమ్మూ కాశ్మీర్
మన దేశంలో బాదం పప్పును అత్యధికంగా పండించే ప్రాంతం జమ్మూ కాశ్మీర్. ముఖ్యంగా కాశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో బాదం సాగు జరుగుతుంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు, అనుకూలమైన నేలలు బాదం చెట్ల పెరుగుదలకు సహాయపడతాయి. దానివల్లే మన దేశంలో బాదం ఉత్పత్తిలో జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానంలో నిలుస్తోంది.
36
జమ్మూ కాశ్మీర్‌లో బాదం సాగు ఎందుకు ఎక్కువ?
బాదం చెట్లు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా పెరగవు. వీటి పెరుగుదలకు ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు అవసరం. ముఖ్యంగా చల్లని వాతావరణం, తగినంత సూర్యరశ్మి, నీరు నిల్వ ఉండని నేలలు బాదం సాగుకు అనుకూలంగా ఉంటాయి. జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి.
మన దేశంలో బాదం సాగు ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ వంటి ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే ఉత్పత్తి పరంగా జమ్మూ కాశ్మీర్ మిగతా ప్రాంతాల కంటే ముందంజలో ఉంది. కొన్ని గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే బాదంపప్పులో 83 శాతానికి పైగా వాటా జమ్మూ కాశ్మీర్‌దే.
56
అదనపు ఆదాయం
జమ్మూ కాశ్మీర్‌లో వ్యవసాయం అనేక కుటుంబాలకు జీవనాధారంగా ఉంది. ఆపిల్, వాల్‌నట్, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ ఇక్కడి ఉద్యానవన రంగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా బాదం పంట రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే పంటగా నిలుస్తోంది.
66
బాదంపప్పులో ఉండే పోషకాలు
బాదంపప్పులో అనేక పోషకాలు దాగి ఉన్నాయి. ఇందులో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి సమతుల్య ఆహారంలో భాగంగా శరీరానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. బాదం పప్పులోని ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది. అయితే వీటిని మితంగా తీసుకోవడం మంచిది.