Hyderabad : రైల్వే గేట్ లాగే విమానాల గేట్.. ఎయిర్ పోర్ట్ రన్ వే మీదుగా రోడ్డా..! అదీ మన హైదరాబాద్ లోనేనా!!

Published : Jun 29, 2026, 06:34 PM IST

సాధారణంగా రైల్వే లైన్ మీదుగా రోడ్డు ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా రైల్వే గేట్ ఏర్పాటుచేస్తారు. ఇలాగే విమానాశ్రయం రన్ వే మీదుగా కూడా రోడ్డు ఉండేదా? విమానం ల్యాండింగ్, టేకాప్ సమయంలో ప్రత్యేక గేట్ వేసి ఆపేవారా? అదీ మన హైదరాబాద్ లో ఉండేదా..!

PREV
14
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ సమాచారం..

Plane Gate : ఇండియాలో రైల్వే గేట్స్ సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. ఇప్పుడంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB), రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) లు వచ్చేశాయిగానీ గతంలో రైలు పట్టాల పైనుండే రోడ్లు ఉండేవి. రైలు వచ్చే సమయంలో రైల్వే గేటు పడేది... రైలు వెళ్లిపోయాక ట్రాక్ పైనుండే వాహనాల రాకపోకలు సాగేవి. ఇప్పటికీ కొన్నిప్రాంతాల్లో ఇలాంటి రైల్వే గేట్లు కనిపిస్తుంటాయి. కానీ మీరు ఎప్పుడైన విమానం గేట్ (రన్ వే క్రాసింగ్) గురించి విన్నారా..? అంటే విమానాశ్రయం మీదుగా సాగే రోడ్డు అన్నమాట. విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు వాహనాలను గేట్ వేసి ఆపేస్తారన్నమాట. ఆరంభంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ ఇలాగే ఉండేదట.

24
బేగంపేట విమానాశ్రయంలో ప్లేన్ గేట్స్ ఉండేవా?

హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ముందంతా జాతీయ, అంతర్జాతీయ విమానాలన్నీ బేగంపేట విమానాశ్రయం మీదుగానే సాగేవి. స్వాతంత్య్రానికి పూర్వమే 1930 లో హైదరాబాద్ ను పాలించిన నిజాంలు బేగంపేటలో విమానాశ్రయాన్ని ఏర్పాటుచేశారు. నిజాంల సొంత విమానయాన సంస్థ దక్కన్ ఎయిర్ వేస్ లిమిటెడ్ కు చెందిన విమానాల రాకపోకల కోసం చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని నిర్మించారు.

అయితే ఆరంభంలో బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేకంగా రన్ వే ఉండేది కాదు... వాహనాలు రాకపోకలు సాగించే మార్గంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరిగేది. ఇలా సికింద్రాబాద్, బోయిన్ పల్లికి రాకపోకలు సాగించే వాహనాలు ఈ విమానాశ్రయం రన్ వే క్రాస్ చేయాల్సి వచ్చేది. విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో వాహనాలను ఆపేవారు... ఇందుకోసం రైల్వే గేట్ల మాదిరిగానే విమానం గేట్లు ఉండేవి. విమానాల రాకపోకలు లేని సమయంలో రన్ వే పై వాహనాలు తిరిగేవన్నమాట.

అయితే స్వాతంత్య్రం తర్వాత భారత విమానయాన రంగంలో భారీ మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం జాతీయ, అంతర్జాతీయ ప్రయాణానికి చాలా కీలకంగా మారింది. ఇలా ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ గా మారి ప్రపంచస్థాయి గుర్తింపుపొందిన బేగంపేట రన్ వే పై ఒకప్పుడు వాహనాలు తిరిగేవంటే ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.

34
ఇప్పటికీ విమాన గేట్లు కనిపించే ఎయిర్ పోర్ట్ ఏది?

ప్రపంచం ఇంత డెవలప్ అయినా ఇప్పటికీ కొన్ని విమానాశ్రయాల్లో విమాన గేట్లు (రన్ వే క్రాసింగ్) కనిపిస్తుంది. ఇలాంటిదే 'జిబ్రాల్టర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్'. ఈ విమానాశ్రయం జీబ్రాల్టర్, స్పానిష్ సరిహద్దుల్లో ఉంటుంది... ఈ రెండు దేశాలను కలిపే 'విన్స్టన్ చర్చిల్ అవెన్యూ' రహదారి దీనిమీదుగా వెళుతుంది. అందుకే విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో ఈ రహదారిని ప్రత్యేక గేట్లు వేసి మూసివేస్తారు.

ఇక గోవాలోని 'డబోలిమ్ ఎయిర్ పోర్ట్' కూడా ఇలాగే ఉండేది... రన్ వే పై వాహనాల రాకపోకలు ఉండేవి. అయితే గోవాలో కొత్త విమానాశ్రయం నిర్మించడంతో దీన్ని మిలిటరీ అవసరాల కోసం వాడుతున్నారు. ఇదే 'రన్ వే క్రాసింగ్' కలిగిన చివరి విమానాశ్రయం... ఇప్పుడు దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్ చాలా ఆధునికంగా మారాయి.

44
బేగంపేట విమానాశ్రయం కింద రోడ్ల నిర్మాణం...

గతంలో బేగంపేట విమానాశ్రయం రన్ వే పైనుండి వాహనాల రాకపోకలు జరిగితే... ఇప్పుడు రన్ వే కిందనుండి వాహనాలు వెళ్లేలా రోడ్లు వేసేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద మల్టీ లేన్ అండర్‌పాస్ నిర్మించేందుకు కేంద్ర సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అనుమతులు ఇచ్చింది. సుచిత్ర జంక్షన్ నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్‌లో భాగంగా బేగంపేట విమానాశ్రయ రన్‌వే కింద అండర్‌పాస్ నిర్మించనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వినియోగంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద అండర్‌పాస్ నిర్మించడం దేశంలో ఇదే మొదటిసారి. ఇలా మరోసారి బేగంపేట విమానాశ్రయం ప్రత్యేకంగా నిలవబోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories