Krishnas 99 children: శ్రీకృష్ణుడి భార్యల గురించి ఎంతో మందికి తెలుసు. కానీ అతడి పిల్లల గురించి మాత్రం ఎంత మందికి తెలుసు? కేవలం సాంబుడు, ప్రద్యుమ్నుడే కాదు ఇంకా ఎంతో మంది పిల్లలు ఉన్నారు.
శ్రీకృష్ణుడు పేరు చెబితేనే ఎంతోమంది భక్తులు పరవశించి పోతారు. అతని చిన్ననాటి లీలలు, వెన్న దొంగతనం, గోపికల ప్రేమ, గీతా బోధ గుర్తుకు వస్తాయి. అలాగే మహాభారత యుద్ధంలో అర్జునుడికి అండగా నిలిచిన దేవుడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు ఒక గురువుగా, ఒక దేవుడిగా, ఒక భర్తగా ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఒక తండ్రిగా అతని గురించి చాలామందికి పెద్దగా తెలియదు. పురాణాల ప్రకారం కృష్ణుడికి అనేక మంది సంతానం ఉన్నట్లు గ్రంథాల్లో ఉంది. ఆయనకు దాదాపు 99 మంది పిల్లలు ఉన్నట్టు సమాచారం. భాగవతం, హరివంశం వంటి పురాణ గ్రంథాల ఆధారంగా ఈ పిల్లల సంఖ్యను అంచనా వేసి పండితులు చెబుతున్నారు.
25
శ్రీకృష్ణుడి కుటుంబం
పురాణాల ప్రకారం కృష్ణుడు ద్వారకలో రాజుగా ఎంతో కాలం జీవితం సాగించాడు. ఆయనకు అనేక మంది భార్యలు కూడా ఉన్నట్లు అందరికీ తెలుసు. ఆయన ద్వారకలో నివసించిన కాలంలో కృష్ణుడికి చాలామంది కొడుకులు పుట్టినట్టు పురాణాలు చెబుతున్నాయి. కొన్ని పురాణాల్లో ఆయన సంతాన సంఖ్య వేర్వేరుగా కనిపిస్తుంది. అయితే ఎక్కువగా వినిపించే సంఖ్య 99 మంది. వీరంతా యాదవ వంశానికి చెందిన వారిగా చెబుతారు. ఈ పిల్లలు తండ్రిలాగే ధైర్యవంతులు, తెలివైనవారు అని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడు వారిని రాజకీయం, యుద్ధ విద్య, ధర్మ మార్గం వంటి విషయాల్లో శిక్షణ ఇచ్చాడని కూడా చెబుతారు.
35
శ్రీకృష్ణుడి కొడుకులు
కృష్ణుడి సంతానంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ప్రద్యుమ్నుడు. ఇతను కృష్ణుడు, రుక్మిణి దంపతులకు జన్మించిన కుమారుడు. చిన్నప్పుడే అపహరణకు గురైన ప్రద్యుమ్నుడు తరువాత ధైర్యవంతుడైన యువకుడిగా ఎదిగాడు. ప్రేమ దేవుడైన కామదేవుడి అవతారంగా కూడా ఇతనిని వర్ణిస్తారు. ఇక మరో కుమారుడు సాంబ. ఇతని కథ మాత్రం విషాదకరంగా ఉంటుంది. అతని అహంకార స్వభావం కారణంగా శాపం పడిందని పురాణాలు చెబుతాయి. ఆ శాపం వల్ల యాదవ వంశానికి పెద్ద నష్టం కలిగింది. అలాగే చారుదేశన, భాను, గద వంటి కుమారులు కూడా ధైర్యవంతులుగా ప్రసిద్ధి పొందారు.
కృష్ణుడికి కూతుళ్లు కూడా ఉన్నారు. పురాణాల్లో వారి పేర్లు అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి సుశీల అనే అమ్మాయి పుట్టింది. ఆమెకు ఖండవ యువరాజుకు ఇచ్చి వివాహం చేసుకుంది. ఇక సత్యభామతో చారుమతి కూతురు జన్మించింది. ఈమె యదవంశ యువరాజును పెళ్లి చేసుకుంది. ఇక భద్ర అనే కూతురు జాంబవతికి పుట్టింది. ఈమె దుర్యోధనుడి పెళ్లి చేసుకుంది. సత్యభామతో బానూ, భిమారిక, జలాంధమ అనే కూతుళ్లు కూడా ఉంటారు. కూతుళ్లందరికీ రాజ కుటుంబాలతో వివాహ బంధాలు ఏర్పరచుకున్నట్టు చరిత్ర చెబుతోంది. దీని వల్ల ద్వారక రాజ్యానికి ఇతర రాజ్యాలతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయని భావిస్తారు. కుమార్తెలు రాజకీయంగా, సామాజికంగా కీలక పాత్ర పోషించారని కొంతమంది పురాణ పండితులు చెబుతారు.
55
భర్తగా, తండ్రిగా, గురువుగా శ్రీకృష్ణుడు
మొత్తానికి కృష్ణుడికి 99 మంది సంతానం కథ భక్తులకు ఎంతో ఆసక్తికరమైనది. దీన్ని పూర్తిగా చరిత్ర ఆధారంగా మాత్రం నిరూపితమవ్వలేదు. ఈ కథల ద్వారా కృష్ణుడి జీవితం ఎంత విశాలమైనదో అర్థం చేసుకోవచ్చు. ఆయన దేవుడిగా మాత్రమే కాదు, రాజుగా, తండ్రిగా, మార్గదర్శిగా కూడా తన పాత్రను సంపూర్ణంగా పోషించాడు. కృష్ణుడి సంతానం కథలు ధైర్యం, ధర్మం, బాధ్యత అనే విలువలను గుర్తు చేస్తాయి. అందుకే ఈ కథలు నేటికీ భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం కచ్చితంగా ఉంటుంది.