Health Tips : ఇది పేదవాడి డైట్ ప్లాన్ .. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు పొందే టిప్స్

Published : Oct 09, 2025, 08:39 PM IST

Health Tips : పోషకాహారం  ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్యానికి అవసరం. అలాంటి ఆహారాన్ని అతి తక్కువ ఖర్చులో పొందడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం… ఫాలో అయి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. 

PREV
17
బీదవారు పౌష్టికాహారం ఎలా తీసుకోవాలి?

Health Tips : పేదవారు కడుపు నిండా తినడమే ఒక సమస్య .

అలాంటప్పుడు ... "కార్బ్స్ తగ్గించండి .. ప్రోటీన్స్ ఎక్కువ తినాలి . ఒమేగా మూడు తీసుకోవాలి . గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి . రిఫైన్డ్ ఆయిల్ వద్దు. పామ్ ఆయిల్ వద్దు ..." అంటే ఎలా ?

వేరుశనగ నూనెలు బాగా కాస్ట్లీ

చికెన్ కాస్ట్లీ .

మటన్ .. ఇంకా !

మరి పౌష్టికాహారం ఎలా ?

సమస్య తీవ్రం .

కాదనను .

కానీ మనసుంటే .. సంకల్పముంటే... సమస్యను కూడా అనుకూలతగా మార్చుకోవచ్చు .

27
ఒక్క కోడిని కొనండి

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బీదల గురించి ఈ పోస్ట్ లో ..

1 . ఒక కోడి పెట్టను కొనండి .

అది గుడ్లు పెడుతుంది .

పొదిగించండి.

గ్రామీణ ప్రాంతాల్లో పురుగు పుట్రా తిని ఇది జీవిస్తుంది.

పెద్దగా తిండి అక్కర లేదు.

లేదా కొద్దిగా గింజెలు చాలు.

ఒక నాటు కోడి పెట్ట ... సంవత్సరం లో అయిదారు కోళ్లను తయారు చేస్తుంది.

అటుపై ఇంట్లో ఎప్పుడూ కోడి గుడ్లు .

నాటు కోడి గుడ్లు ఫారం గుడ్లకంటే మంచివి .

రోజుకు ఒకరికి రెండు గుడ్లు . సుమారుగా 20 - 25 గ్రాముల ప్రోటీన్ .. ఇంకా అనేక పోషకాలు.

37
ఫ్రీగా చికెన్

2. కోడి పుంజుల్ని కోసుకొని తినడం .

ఇవి బ్రాయిలర్ కోళ్లకంటే వంద రెట్లు బెటర్ .

15 రోజులకు ఒకసారి చికెన్ భోజనం. మంచి ప్రోటీన్ .

మటన్ వద్దు . అది మంచి ప్రోటీన్ కాదు . గ్రామీణ ప్రాంతాల్లో పొట్టేలు పెంచవచ్చు. కానీ అవసరం లేదు. (టేస్ట్ సంగతి వేరు. నేను కేవలం పోషకాహారం అనే కోణంలో మాట్లాడుతున్నాను)

47
ఒక్క ఎకరం చాలు

3. మీకు ఎకరా పొలముందా ?

సొంతం కావొచ్చు .

కౌలు కావొచ్చు .

మెట్ట పొలం చాలు .

జూన్- జులై నెలల్లో వేరుశనగ మిశ్రమ పంటగా వెయ్యండి. అక్కడక్కడా సాళ్లలో కందులు , మినుములు పెసలు అలసందులు. నాలుగు నెలలలో పంట వస్తుంది .

వేరు శనిగ.. పచ్చిది, ఉడకేసినది, ఎండు.. ఎలా అయినా ఫరవాలేదు . రోజుకు మనిషికి వంద గ్రాములు. సుమారుగా 35 గ్రాముల ప్రోటీన్ . రెండు గుడ్లు.. వంద గ్రాముల వేరుశనిగ.. ఈ రెండు చాలు .. మనిషికి రోజుకు సరిపడా ప్రోటీన్ .

ఇంకా కంది పప్పు మినప పెసర ఉన్నాయి.

వాటిని వంటకాల్లో వాడొచ్చు .

4. వేరుశనగ .. గుడ్ ఫాట్ కూడా .

వేరుశనగను గానుగ ఆడిస్తే మేలయిన నూనె .

57
గ్రామాల్లోనే అన్ని ప్రోటీన్స్

5. గ్రామాల్లో ఆకుకూరలు బాగా దొరుకుతాయి . అరగంట టైం .. అంతే. ఇంటిల్లిపాదికీ ఫైబర్ .యాంటియాక్సిడెంట్స్ .. విటమిన్స్ మినరల్స్ .

6. ఇంకా ఆయా కాలాల్లో రేగు, సీతాఫలం, బలస నేరుడుల్లాంటి పళ్ళు ఉచితంగా దొరుకుతాయి 

7. అలాగే అవిసె కూడా దొరుకుతుంది. ఇది ఒమేగాకు మంచి సోర్స్ .

8. పుట్టగొడుగులు....బెస్ట్ ప్రోటీన్.

9 ఒక ఆవును లేదా గేదెను సాకండి.

కొన్ని నెలలకు నాలుగైదు అవుతాయి .

పాలు.. పెరుగు .. వెన్న , నెయ్యి.. జున్ను ..

పట్టణాల్లో కోట్లు సంపాదించేవారు కూడా స్వచ్చమయిన పాలు పెరుగు తాగలేరు.

కాల్షియమ్... ప్రోటీన్ ఇంకా అనేక పోషకాలు .

67
ఇంటివద్దకే పౌష్టికాహారం

మా అమ్మ నాన్న టీచర్స్ .

అయినా మేము మెట్ట వ్యవసాయం చేసేవారం .

ఇంట్లో ఎప్పుడూ వేరుశనగ, కందులు, పెసలు, మినుములు, అలసందలు ఉండేవి.

ఇంట్లో ఎప్పుడూ రెండు మూడు ఆవులు.

వాటి పేడ పొలానికి .

రసాయన ఎరువులు ఒక్కసారి కూడా కొనలేదు .

మందులు కొట్టలేదు . 

ఇప్పుడు గ్రామాల్లో వ్యవసాయ పరిస్థితి మారిన మాట వాస్తవం .

జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు..

సమస్యలు లేనిదెక్కడ ?

సమస్యల్ని పరిష్కరించుకోవాలి .. ముందుకు సాగాలి .

77
సన్నబియ్యం మోజు వీడండి

అల్పాదాయ వర్గాల విషయంలో ప్రభుత్వాలకు భాద్యత ఉంది అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .

ఇంకో విషయం .. రాగులు .. జొన్నలు సజ్జలు .. వర్షాధార పంటలు . మొండివి .

పడించడం ఈజీ .

సన్న బియ్యం మోజు .. పొలాల్ని .. కుటుంబాలను .. వ్యక్తి ఆరోగ్యాన్ని నాశనం చేసింది.

దీని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది .

Read more Photos on
click me!

Recommended Stories