America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?

Published : Aug 24, 2026, 10:56 AM IST

America: భారత్ నుంచి ఎంతో మంది అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా లక్షల మంది జీవిస్తున్నారు. వారికి ఎంత జీతం వస్తుంది? ఆ జీతంలో ఎంత ఖర్చవుతుంది? నెలకు ఎంత సేవ్ అవుతుంది? ఈ వివరాలు తెలుసుకోండి.

PREV
13
అమెరికాలో భారతీయుల జీతాలు

భారతదేశం నుండి ఎంతోమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అమెరికాలో జాబ్స్ చేస్తుంటారు. ఎంతోమంది H-1B లేదా L-1 వీసాలపై అమెరికాకు వెళుతుంటారు. అలా వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వేతనాలు ఏడాదికి సాధారణంగా 80,000 డాలర్ల నుండి 120,000 డాలర్ల వరకు ఉంటుంది. అంటే మన రూపాయల్లో సుమారు 70 లక్షల రూపాయల నుంచి ఒక కోటి రూపాయల వరకు ఉంటుంది. అలాగే వారి అనుభవం, హోదాను, కంపెనీని బట్టి ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పన్నులు సుమారు 20 శాతం నుండి 30 శాతం వరకు కట్ అవుతాయి. ఫలితంగా అన్ని కటింగ్స్ పోనూ నెలకు దాదాపు 5,500 డాలర్ల నుండి 6,500 డాలర్ల వరకు చేతికి అందుతుంది. అంటే నెలకు 5 లక్షల రూపాయలకు పైగా 5 లక్షల వరకు వస్తుంది.

23
నెలకు అయ్యే ఖర్చులు

అమెరికాలో జీవన వ్యయం ఉద్యోగి నివసించే సిటీపై ఆధారపడి ఉంటుంది. సియాటెల్, కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి ఖరీదైన నగరాల్లో అద్దెలు నెలకు 2,200 డాలర్ల నుండి 3,200 డాలర్ల వరకు ఉంటాయి. ఇక డల్లాస్, నార్త్ కరోలినా, అట్లాంటా వంటి ప్రాంతాల్లో 1,400 డాలర్ల నుండి 2,000 డాలర్ల వరకు ఉంటాయి. ఇంటి అద్దెతో పాటు కరెంటు, ఇంటర్నెట్, గ్యాస్ వంటి యుటిలిటీలకు 250 డాలర్ల నుండి 400 డాలర్లు, కిరాణా సరుకులు కోసం 500 డాలర్ల నుండి 800 డాలర్లు, కారు ఈఎంఐ, ఇన్సూరెన్స్, పెట్రోల్ కోసం 500 డాలర్లు నుండి 750 డాలర్ల వరకు ఖర్చవుతాయి. ఒంటరిగా ఉండే వ్యక్తికి లేదా భార్యాభర్తలకు నెలకు సగటున 3,000 డాలర్ల నుండి 4,000 డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే పిల్లలు ఉండి డేకేర్ లేదా స్కూల్ ఫీజులు చెల్లించాల్సి వస్తే మరో 1,200 డాలర్లు నుండి 1,800 డాలర్లు అదనంగా ఖర్చవుతాయి.

33
ఆ జీతం సరిపోతుందా?

భారత్ నుంచి వెళ్లే ఆన్‌సైట్ ఉద్యోగుల జీతాలు అక్కడి జీవన ప్రమాణాలకు పూర్తిగా సరిపోతాయి. సగటు ఖర్చులు పోను, ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నెలకు సుమారు 1,500 డాలర్ల నుండి 3,000 డాలర్ల వరకు మిగులుతుంది. అంటే మన కరెన్సీలో దాదాపు లక్షా ముప్పై వేల నుంచి రెండున్నర లక్షల వరకు సులభంగా పొదుపు చేయవచ్చు. బ్యాచిలర్స్ లేదా ఖర్చులు నియంత్రించుకునే కుటుంబాలు సంవత్సరానికి దాదాపు సుమారు ₹18 లక్షల నుండి ₹30 లక్షల పైనే ఆదా చేయగలుగుతున్నారు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తూ సంపాదిస్తే లేదా ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీలకు మారితే ఈ పొదుపు రెట్టింపు అవుతుంది. క్లయింట్ ప్రదేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు ఆర్థికంగా స్థిరపడటానికి ఆన్‌సైట్ అవకాశాలు నేటికీ భారతీయ టెక్కీలకు అత్యంత లాభదాయకంగా నిలుస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories