Motivational Story: మనలో చాలా మందికి భయాలు ఉంటాయి. చేసిన పని విఫలమైందనో మరో కారణంతో జీవితంలో ముందడుగు వేసేందుకు జంకుతుంటాం. అయితే ఈ ఏనుగు కథ చదివితే మన ఆలోచన మారడం ఖాయం.
ఒక వ్యక్తి రోడ్డుపై అటుగా వెళ్తుంటాడు. అదే సమయంలో ఓ భారీ ఏనుగును చిన్న తాడుతో కట్టేస్తారు. ఎక్కడా పెద్ద గొలుసులు లేదా బలమైన పంజరాలు కనిపించవు. దీంతో ఆ వ్యక్తికి ఓ అనుమానం వస్తుంది. అదేంటి అంత చిన్న తాడు అంత పెద్ద ఏనుగును ఎలా ఆపుతోంది. ఆ వ్యక్తి ధైర్యంగా ఎలా ఉంటున్నాడని అనుమానం వస్తుంది.
25
ట్రైనర్‌ను ఇలా ప్రశ్నిస్తాడు.
ఇవన్నీ అనుమానాలతో వెంటనే ట్రైనర్ దగ్గరికి వెళ్లిన ఆ వ్యక్తి ఏనుగు ఎందుకు కదలడం లేదంటూ ప్రశ్నిస్తాడు. అంత పెద్ద జంతువును చిన్న తాడు ఎలా కట్టేసింది. ఏనుగు తాడును తెంచుకొని ఎందుకు వెళ్లడం లేదని అడుగుతాడు. దీనికి ట్రైనర్ ఆసక్తికర సమాధానం ఇస్తాడు.
35
ఆశ్చర్యకరమైన సమాధానం
ట్రైనర్ మాట్లాడుతూ.. “ఈ ఏనుగులను చిన్నప్పుడు ఈ చిన్న తాడుతో కట్టేస్తాం. ఆ సమయంలో వీటికి ఆ తాడు నిజంగా బలంగా ఉంటుంది. చాలా ప్రయత్నించినా తెంచుకోలేవు. ఆ అనుభవం వీటి మదిలో నిలిచి పోతుంది. పెద్దవైన తరువాత ఈ తాడును సులభంగా తెంచుకోగలిగినా, తమకు సాధ్యం కాదనే నమ్మకం వీటిలో బలంగా ఉంటుంది. అందుకే ప్రయత్నం చేయవు.” ఈ మాటలు విన్న మనిషి ఆశ్చర్యపోతాడు. మహా బలశాలి ఏనుగులు కేవలం “తమకు సాధ్యం కాదనే నమ్మకంతో” బంధంలో ఉండిపోతున్నాయా అనుకుంటాడు.
మన జీవితంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. చిన్నప్పుడు లేదా గతంలో ఒకసారి విఫలమైతే, మళ్ళీ ప్రయత్నించాలనే ధైర్యం కోల్పోతాం. “నాకు ఇది సాధ్యం కాదు” అనే నమ్మకం మనలో పెరిగిపోతుంది. కానీ నిజానికి మన సామర్థ్యం చాలా ఎక్కువ. ఆ పాత అనుభవం, భయం లేదా విఫలం మనలోని శక్తిని దాచేస్తుంది.
55
ప్రయత్నమే విజయం
జీవితంలో విఫలాలు సహజం. అవి నేర్చుకునే అవకాశాలు మాత్రమే. ఒకసారి విఫలమైనందుకు మనం శాశ్వతంగా అశక్తులం అవ్వం. కాబట్టి భయాన్ని, గత విఫలాలను దాటేసి, కొత్త ధైర్యంతో ప్రయత్నం చేస్తే మన శక్తి ఏమిటో మనకే తెలుస్తుంది. ఏనుగుల్లా “తీయలేము” అనే భ్రమలో కాకుండా, మనలోని శక్తిని గుర్తించి ముందుకు అడుగులు వేయాలి.
గొప్ప సందేశం
“గతపు విఫలాలు మన శక్తిని నిర్వచించవు. ప్రయత్నమే విజయం. భయాన్ని అధిగమించి ముందుకు సాగితే మనలోని మహా శక్తి బయటపడుతుంది.” అనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తోంది.