Viral: ప్రపంచవ్యాప్తంగా ఆల్కాహాల్ ప్రియులు ఉన్నారనే విషయం తెలిసిందే. బ్రాండ్ ఆధారంగా మందు బాటిల్స్ ధర ఉంటుంది. మరి ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆల్కహాల్ ఏదో ఎప్పుడైనా ఆలోచించారా.?
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ఆల్కాహాల్ లభ్యమవుతుంది. కానీ కొన్ని ఆల్కహాల్ బాటిళ్ల ధర వింటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వాటిలో అగ్రస్థానంలో ఉన్నది ది బిలియనీర్ వోడ్కా. ఇది సాధారణంగా తాగేందుకు మాత్రమే కాదు, విలాసానికి గుర్తుగా కూడా పరిగణిస్తారు.
25
‘ది బిలియనీర్ వోడ్కా’ ధర ఎంత?
ఈ వోడ్కాను Leon Verres కంపెనీ తయారు చేస్తోంది. ప్రపంచంలో కొద్దిచోట్ల మాత్రమే ఇది లభ్యమవుతుంది. ఒక్క బాటిల్ ధర సుమారు 3.7 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది.
35
అంత ఖరీదు ఎంత.?
ఈ వోడ్కా తయారీ విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి ఉపయోగించే నీరు ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన నీటిగా భావిస్తారు. ఆ నీటిని ప్రత్యేక ఫిల్టరేషన్ ప్రక్రియలో శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో విలువైన వజ్రాల వినియోగం జరుగుతుందని చెబుతారు. వోడ్కా తయారీ రహస్యాన్ని కంపెనీ పూర్తిగా గోప్యంగా ఉంచుతుంది. అందుకే దీని రుచి సాధారణ వోడ్కాలకంటే భిన్నంగా ఉంటుంది.
ఈ వోడ్కా ఖరీదు పెరగడానికి బాటిల్ డిజైన్ కూడా ప్రధాన కారణం. వజ్రాలు పొదిగిన బాటిల్‌లో ఈ వోడ్కాను ప్యాక్ చేస్తారు. చూడటానికి ఇది మందు బాటిల్‌లా కాకుండా ఒక రాజవంశపు ఆభరణంలా కనిపిస్తుంది. బాటిల్ తయారీకే కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని సమాచారం. ఈ కారణంగా కూడా దీని ధర ఆకాశాన్ని తాకుతుంది.
55
తాగడానికి కాదు.. స్టేటస్ సింబల్‌గా
ది బిలియనీర్ వోడ్కాను చాలామంది తాగేందుకు కాకుండా ఒక స్టేటస్ సింబల్గా చూస్తారు. కొందరు బిలియనీర్లు పార్టీల్లో ఈ వోడ్కాను ఆర్డర్ చేస్తే ఒక్క రాత్రిలోనే కోట్ల రూపాయలు ఖర్చవుతాయని చెబుతారు. ఇలాంటి పార్టీల సంఖ్య తక్కువే అయినా, కొనుగోలుదారుల కొరత మాత్రం లేదు. అందుకే ఈ వోడ్కా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆల్కహాల్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.