Viral Video: ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ కామన్‌గా మారింది. అయితే ఇప్పుడీ వీడియోలు కొత్త పుంత తొక్కుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే, ఈ ట్రెండ్ ఇప్పుడు కొత్త దిశలోకి వెళ్లినట్టు కనిపిస్తోంది.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ జంట నీళ్లలో పడుకుని, కళ్లుమూసుకుని ప్రశాంతంగా పోజ్ ఇస్తోంది. చుట్టూ కెమెరామెన్లు ఉండి, ఆ సీన్‌ను “పర్ఫెక్ట్ షాట్”గా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సాధారణంగా రొమాంటిక్‌గా కాకుండా కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది.
24
నెటిజన్ల రియాక్షన్స్.. జోకుల వరద
ఈ వీడియో ఇలా వచ్చిందో లేదో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. “ఇది పెళ్లి షూటా.. లేక క్రైమ్ సీన్ ట్రైలరా?” అంటూ కొందరు సరదాగా కామెంట్ చేస్తే.. మరికొందరు “ఇంతకీ పెళ్లి చేస్తున్నారా.. లేక సినిమా తీస్తున్నారా?” అని ప్రశ్నించారు. మొత్తానికి ఈ వీడియో హ్యూమర్‌గా ఉందని కొందరు స్పందిస్తుంటే మరికొందరు మాత్రం ఇదేం పిచ్చి అంటున్నారు.
34
‘సినిమాటిక్’ ట్రెండ్.. హద్దులు దాటుతున్నాయా?
ఇప్పటి ప్రీ వెడ్డింగ్ షూట్‌లు కేవలం ఫోటోలకే పరిమితం కావడం లేదు. నీళ్లలో షూట్లు, యాక్షన్ సీన్లు, డ్రోన్ షాట్లు, స్టంట్‌లాంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఇలా కొత్తగా కనిపించాలి అనే ప్రయత్నంలో కొందరు హద్దులు దాటుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు “ఇది నిజంగా జంట కోసం చేస్తున్నారా? లేక సోషల్ మీడియాలో వైరల్ కావడానికా?” ఇంకొందరు అయితే ఇలాంటి షూట్‌లలో ఆరోగ్య సమస్యలు, అసౌకర్యం కూడా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద క్రియేటివీ పేరుతో కొందరు చేస్తున్న చర్యలు సమాజంలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.