వినాయ‌కుడి చెవులు పెద్ద‌గా, కండ్లు చిన్న‌గా ఎందుకుంటాయి? ఒక్కో అవ‌యం వెనుక ఇంత అర్థ‌ముందా?

Published : Sep 12, 2026, 07:54 PM IST

Vinayaka Chavithi: వినాయకుడి రూపం మనిషి జీవితానికి అవసరమైన ఎన్నో మంచి లక్షణాలను గుర్తుచేస్తుంది. అసలు వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? ఆయన చెవులు, కళ్లు, తొండం, దంతాలు, పొట్ట, చేతులు, ఎలుక వాహనం ఏం సూచిస్తాయి? తెలుసుకుందాం.

PREV
15
గణపతికి ఏనుగు తల ఎలా వచ్చింది?

వినాయకుడి జన్మకు సంబంధించి పురాణాల్లో ప్రసిద్ధమైన కథ ఉంది. ఒకసారి పార్వతీదేవి స్నానానికి వెళ్లే సమయంలో తన శరీరానికి రాసుకున్న నలుగు పిండితో ఒక బాలుడి రూపాన్ని తయారు చేసి, దానికి ప్రాణం పోసిందని చెబుతారు. ఆ బాలుడిని తన కుమారుడిగా భావించిన పార్వతీదేవి.. తాను స్నానం చేసి వచ్చే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దని ఆదేశిస్తుంది.

అదే సమయంలో శివుడు అక్కడికి చేరుకుంటాడు. అయితే పార్వతీదేవి ఆజ్ఞ ప్రకారం బాలుడు శివుడిని కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు బాలుడి తలను తన త్రిశూలంతో వేరు చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి తీవ్ర ఆవేదనకు గురై.. తన కుమారుడిని తిరిగి బతికించాలని శివుడిని కోరుతుంది.

పార్వతీదేవి బాధను అర్థం చేసుకున్న శివుడు.. మొదట కనిపించిన జీవి తలను తీసుకురావాలని చెబుతాడు. అలా ఏనుగు తలను తీసుకొచ్చి బాలుడి శరీరానికి అమర్చి అతడికి తిరిగి ప్రాణం పోస్తాడని పురాణ కథనం. అప్పటి నుంచి ఆ బాలుడు గజాననుడు, గణపతిగా ప్రసిద్ధి చెందాడు. ఈ కథలోని ప్రతీకాత్మక అర్థాలు కూడా గణపతి రూపానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

25
పెద్ద తల.. జ్ఞానం పెంచుకోవాలనే సందేశం

గణపతి తల సాధారణ మనిషి తలతో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. దీనిని విశాలమైన ఆలోచన, జ్ఞానం, వివేకానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో ఏ విషయాన్నైనా తొందరపడి నిర్ణయించకుండా.. విస్తృతంగా ఆలోచించి సరైన మార్గాన్ని ఎంచుకోవాలని ఈ రూపం సూచిస్తుందని ఆధ్యాత్మిక భావన.

ఏనుగు కూడా తన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ ముందుకు సాగుతుంది. అదే విధంగా మనిషి కూడా అనుభవాల నుంచి నేర్చుకుని, విషయాలను లోతుగా అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని గణపతి పెద్ద తల గుర్తుచేస్తుందని చెబుతారు.

35
పెద్ద చెవులు ఎందుకు.?

వినాయకుడి చెవులు ఆయన రూపంలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. పెద్ద చెవులు శ్రద్ధగా వినే గుణానికి ప్రతీకగా భావిస్తారు. ఇతరులు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి అనే సందేశాన్ని ఇవి అందిస్తాయి. చాలా సమస్యలు సరైన సంభాషణ లేకపోవడం వల్లే వస్తుంటాయి. ఎదుటివారు చెప్పేది మధ్యలో ఆపకుండా వింటే.. వారి ఆలోచన, బాధ, అవసరం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అందుకే గణపతి చెవులు మనిషికి ఒక ముఖ్యమైన జీవన సూత్రాన్ని చెబుతున్నాయని భావిస్తారు. ఎక్కువగా వినాలి.. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి.

45
చిన్న కళ్లు.. లక్ష్యంపై ఏకాగ్రతకు గుర్తు

గణపతి కళ్లను గమనిస్తే అవి చిన్నగా కనిపిస్తాయి. వీటిని ఏకాగ్రత, పరిశీలన, దృష్టికి ప్రతీకగా చెబుతారు. ఒక పని చేపట్టినప్పుడు చుట్టూ ఉన్న విషయాలతో దృష్టి మరల్చుకోకుండా.. లక్ష్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టాలి అనే భావన ఇందులో ఉంది. పెద్ద విషయాలను మాత్రమే చూడటం కాకుండా.. చిన్న అంశాల్లో దాగి ఉన్న విషయాలను కూడా గమనించడం అవసరం. ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనాలంటే దానిని లోతుగా పరిశీలించాలి. గణపతి చిన్న కళ్లు ఈ విషయాన్ని గుర్తుచేస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

55
తొండం.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండే శక్తి

వినాయకుడి రూపంలో అందరి దృష్టిని ఆకర్షించే మరో అంశం తొండం. గణపతి తొండాన్ని వశ్యత, సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారగలగడం వంటి లక్షణాలకు ప్రతీకగా వివరిస్తారు. ఏనుగు తన తొండంతో చిన్న వస్తువును కూడా పట్టుకోగలదు.. పెద్ద బరువును కూడా కదిలించగలదు. అంటే అవసరాన్ని బట్టి తన శక్తిని ఉపయోగించుకునే సామర్థ్యం దానికి ఉంది.

అలాగే వినాయకుడి తొండం ఓంకార రూపాన్ని పోలి ఉంటుందని కూడా ఆధ్యాత్మిక సంప్రదాయంలో చెబుతారు. తొండం ఎడమవైపు తిరిగి ఉన్న విగ్రహాలను సాధారణంగా వామముఖ గణపతిగా, కుడివైపు తిరిగి ఉన్న వాటిని దక్షిణాభిముఖ గణపతిగా పిలుస్తారు. వీటికి సంబంధించిన పూజా విధానాలు, నియమాలు సంప్రదాయం ప్రకారం మారుతూ ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories