Salary: అమెరికాలో స్కూల్ టీచర్ల జీతం ఎంత ఉంటుంది? గవర్నమెంట్ - ప్రైవేట్ టీచర్ల మధ్య తేడా ఏంటో తెలుసా?

Published : Nov 28, 2026, 08:10 AM IST

Salary: అమెరికాలో స్కూల్ ఫీజులు ఎంత వసూలు చేస్తారు? అక్కడ టీచర్లకు జీతాలు ఎంత ఉంటాయో తెలుసా? ప్రైవేట్ టీచర్లు, ప్రభుత్వ టీచర్ల మధ్య సంపాదనలో ఎంత తేడా ఉంటుంది

PREV
14
అమెరికాలో స్కూల్ టీచర్ల జీతం ఎంత?

అమెరికాలో విద్యావ్యవస్థ అనగానే చాలామందికి అక్కడి స్కూల్ ఫీజులు, టీచర్ల జీతాలు, ప్రభుత్వ- ప్రైవేట్ పాఠశాలల మధ్య ఉండే వ్యత్యాసాలపై ఆసక్తి ఉంటుంది. భారతదేశంతో పోలిస్తే అమెరికాలో విద్యావ్యవస్థ పూర్తిగా భిన్నమైన విధానంలో పనిచేస్తుంది. అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సాధారణంగా ట్యూషన్ ఫీజు ఉండదు. అయితే ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం భారీగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

తాజా గణాంకాల ప్రకారం, అమెరికాలో టీచర్ల జీతాలు వారు బోధించే తరగతి స్థాయిని బట్టి మారుతుంటాయి. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ల సగటు ఏడాది జీతం సుమారు 63,970 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 54 లక్షలు) గా ఉండే అవకాశం ఉంది. మిడిల్ స్కూల్ టీచర్లకు సగటున 64,370 డాలర్లు, హైస్కూల్ టీచర్లకు సగటున 72,040 డాలర్లు (సుమారు రూ. 61 లక్షలు) వార్షిక జీతం అందుతోంది. అయితే రాష్ట్రం, అనుభవం, విద్యార్హతలను బట్టి ఈ వేతనాల్లో మార్పులు ఉంటాయి.

24
ప్రభుత్వ - ప్రైవేట్ టీచర్ల మధ్య తేడా?

ప్రభుత్వ టీచర్ల జీతాలు ఎంత?

అమెరికాలో ప్రభుత్వ స్కూల్ టీచర్ల జీతాలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. అనుభవం, విద్యార్హతలు, బోధించే తరగతులు, పనిచేసే జిల్లాను బట్టి వేతనాలు నిర్ణయిస్తారు. నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (NEA) గణాంకాల ప్రకారం, అమెరికా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సగటు వార్షిక జీతం 74,495 డాలర్లు. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి రాష్ట్రాల్లో సగటు జీతాలు లక్ష డాలర్లకు చేరువలో ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో 55 వేల డాలర్ల స్థాయిలోనే ఉన్నాయి.

ప్రైవేట్ స్కూల్ టీచర్ల జీతాలు

ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రభుత్వ టీచర్లతో పోలిస్తే సాధారణంగా తక్కువ జీతాలు లభిస్తాయి. అయితే ప్రముఖ ప్రైవేట్ స్కూళ్లు, అంతర్జాతీయ పాఠశాలలు, అధిక ఫీజులు వసూలు చేసే విద్యాసంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉండవచ్చు.

అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (BLS) గణాంకాల ప్రకారం, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ల వార్షిక మధ్యస్థ వేతనం ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 65,260 డాలర్లు కాగా, ప్రైవేట్ పాఠశాలల్లో 58,140 డాలర్లుగా ఉంది. హైస్కూల్ టీచర్లకు ప్రభుత్వ పాఠశాలల్లో 74,190 డాలర్లు, ప్రైవేట్ పాఠశాలల్లో 61,810 డాలర్ల మధ్యస్థ వార్షిక వేతనం ఉండే అవకాశం ఉంది.

34
టీచర్ల జీతాల్లో తేడాలు ఎందుకు?

ప్రభుత్వ పాఠశాలలకు పన్నుల రూపంలో స్థిరమైన ఆదాయం వస్తుంది. టీచర్లకు అనుభవాన్ని బట్టి జీతాల పెంపు, ఆరోగ్య బీమా, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి సదుపాయాలు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల ఫీజులు, విరాళాలు, సంస్థల నిధులపై ఆధారపడటంతో వాటి ఆర్థిక పరిస్థితిని బట్టి టీచర్ల జీతాలు నిర్ణయిస్తారు.

అయితే ప్రైవేట్ స్కూల్ టీచర్లందరికీ తక్కువ జీతాలే వస్తాయని చెప్పలేం. కొన్ని ప్రతిష్ఠాత్మక పాఠశాలలు మంచి శాలరీ, అదనపు ప్రయోజనాలు అందిస్తాయి. అదే సమయంలో కొన్ని చిన్న ప్రైవేట్ స్కూళ్లలో శాలరీలు తక్కువగా ఉండవచ్చు.

44
అమెరికాలో స్కూల్ ఫీజులు ఎలా ఉంటాయి?

అమెరికాలో ప్రభుత్వ (పబ్లిక్) పాఠశాలల్లో కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు విద్య పూర్తిగా ఉచితం. స్థానిక ప్రాపర్టీ పన్నుల ద్వారా ప్రభుత్వం ఈ పాఠశాలలను నిర్వహిస్తుంది. కాబట్టి పబ్లిక్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. తాజా గణాంకాల ప్రకారం, అమెరికాలో ప్రైవేట్ స్కూళ్ల సగటు వార్షిక ట్యూషన్ ఫీజు సుమారు 13,000 నుండి 15,000 డాలర్ల (రూ. 11 లక్షల నుండి 13 లక్షలు) వరకు ఉంటుందని సమాచారం.

ఎలిమెంటరీ స్థాయిలో సగటు ఫీజు 13,200 డాలర్లు కాగా, హైస్కూల్ స్థాయిలో 17,000 డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఫ్రీడం డే-స్కూళ్లు (NAIS అనుబంధ పాఠశాలలు) లేదా బోర్డింగ్ స్కూళ్లలో అయితే ఏడాదికి 32,000 నుండి 70,000 డాలర్ల వరకు ఖర్చవుతుందని అంటుంటారు. అయితే ఈ స్కూల్ ఫీజ్ లు, టీచర్ల జీతాలు రాష్ట్రాన్నిబట్టి, అక్కడి పరిస్థితులను బట్టి మారుతుంటాయి. ఇవన్నీ ఒకేలా ఉంటాయని చెప్పలేము.

Read more Photos on
click me!

Recommended Stories