
విదేశాల్లో ఉద్యోగం చాలామంది యువతీయువకుల కల... డాలర్ డ్రీమ్స్ లో తేలియాడుతుంటారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు మనోళ్ళు చదువు, ఉద్యోగాల కోసం ఎక్కువగా వెళుతుంటారు. ఇక్కడ ఐటీ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది... అందుకే ఇంజనీరింగ్ పూర్తిచేసే ప్రతి ఒక్కరు ఏదో సమయంలో అమెరికా కలగంటారు. డాలర్లలో శాలరీ, ఫాష్ లైఫ్ స్టైల్... అమెరికాలోని ఐటీ ఉద్యోగులను చూస్తే ఇదికదా లైఫ్ అనిపిస్తుంది.
అయితే ప్రస్తుతం ఐటీ ఉద్యోగాల కంటే ఎక్కువగా డిమాండ్ ఉన్న కొత్త జాబ్ వచ్చింది... ఇది కేవలం ఇండియన్స్ కు మాత్రమే. పెద్దగా చదువు అవసరం లేదు... పోటీ కూడా ఎక్కువగా ఉండదు. కానీ వీళ్లు ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తారట. ఇలా అమెరికాలో అత్యధికంగా సంపాదించే అవకాశం ఉన్న ఉద్యోగం అర్చకత్వం. అవును... మీరు వింటున్నది నిజమే. ప్రస్తుతం కొందరు అయ్యవార్లు పూజలతో ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారట... వాళ్ల ఆదాయ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా అంటే ఐటీ ఉద్యోగులకు స్వర్గధామం అన్న భావన చాలామందిలో ఉంటుంది. కానీ అదే అమెరికాలో దేవాలయాల్లో పనిచేసేవారు, సొంతంగా అర్చకత్వం చేసుకునే హిందూ పూజారుల ఆదాయం ఐటీ ఉద్యోగులకు మించి ఉంటోందట. లక్షల డాలర్లు సంపాదించే అర్చకులు కూడా అమెరికాలో ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.
అమెరికాలో పెద్దపెద్ద ఆలయాలను నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్లుగా నడుస్తుంటాయి... ఇందులో పనిచేసే అర్చకులకు ఫిక్స్‌డ్ జీతంతో పాటు కొన్ని అదనపు సదుపాయాలు కూడా ఉంటాయి. కొత్తగా అర్చకత్వం చేసేవారికే సంవత్సరానికి సుమారు 30,000 నుండి 45,000 డాలర్ల శాలరీ ఉంటుంది. ఇక అనుభవం ఉన్న ప్రధాన అర్చకులకు సంవత్సరానికి 50,000 నుండి 70,000 డాలర్లు... కొన్ని పెద్ద దేవాలయాల్లో అయితే గరిష్ఠంగా 80,000 నుండి లక్ష డాలర్లు వరకు శాలరీ ఉంటుంది.
దేవాలయాల్లో పూజలు చేసే అర్చకులకు నిర్వహకులే వసతి, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. అంటే శాలరీలోంచి పెద్దగా ఖర్చులు ఉండవు కదా ఇతర మార్గాల్లోనూ ఆదాయం వస్తుంది. పండగలు, పర్వదినాల సమయంలో దేవాలయాలకు వచ్చే భక్తులు అర్చకుల ఆశీర్వాదం తీసుకుని దక్షిణ అందిస్తారు. ఇలా నెలనెలా ఎంతోకొంత ఆదాయం వస్తుంది.
పండుగల సమయంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతుంటాయి. ఇక వివాహాలు, వ్రతాలు వంటి శుభకార్యాలు కూడా ఆలయాల్లో జరుగుతుంటాయి. ఈ సమయంలో కూడా అయ్యవార్లకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇవన్నీ కలిపితే అర్చకుల ఆదాయం భారీగానే ఉంటుందని చెప్పొచ్చు.
ఇక అమెరికాలో స్థిరపడిన భారతీయులు కొత్త ఇళ్లు కొన్నా, వ్యాపారాలు ప్రారంభించినా పూజలు చేస్తుంటారు. అలాగే పండగలు, ప్రత్యేక పర్వదినాల్లో సామూహిక పూజలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి సమయంలో పూజారులకు భారీగా ఆదాయం లభిస్తుంది. ఇలాంటి పెద్దపెద్ద పూజలకు ఏకంగా రూ.20 నుంండి 40 వేల డాలర్ల వరకు తీసుకునే పూజారులు కూడా అమెరికాలో ఉన్నారట.
ఇక ఇళ్లలో చేసుకునే సత్యనారాయణ వ్రతాలు, చిన్నచిన్న పూజలకు 5,000 నుండి 10000 వేల డాలర్లు తీసుకుంటారట అర్చకులు. ఇలా ఆలయాల్లో అర్చకత్వం ద్వారానే కాదు బయట పూజల ద్వారా రెండుచేతులా సంపాదించే పూజారులు అమెరికాలో ఉన్నారు. మంచి ముహూర్తాలు, పర్వదినాలు కలిగిన నెలల్లో రూ.10 నుండి 20 లక్షలు కూడా సంపాదిస్తారు.
ఐటీతో పాటు ఇతర రంగాల్లో హెవీ కాంపిటేషన్... కానీ అర్చకత్వంలో ఉండదు. కాబట్టి దైవభక్తి ఎక్కువగా ఉండి పూజా కార్యక్రమాలపై అవగాహన ఉన్న విద్యార్థులు ఇప్పుడు పార్ట్ టైమ్ పూజారులుగా మారుతున్నారట. ఇలా చదువుకోసం అమెరికాలో ఉంటున్నవారు పార్ట్ టైమ్ పూజారులుగా లేదంటే అర్చకులకు సహాయకులగా వ్యవహరిస్తున్నారు. ఇలా భక్తికి భక్తి, ఆదాయానికి ఆదాయం పొందుతున్నారు.
పోటీ ఎక్కువ ఉండదు కాబట్టి అర్చకులకు వీసాలు చాలా సులభంగా వస్తాయి. అమెరికాలో కొందరు గ్రీన్ కార్డు హోల్డర్ అర్చకులు కూడా ఉన్నారట. ఇలా నిష్టగా, భక్తితో పూజా కార్యక్రమాలు నిర్వర్తించే అయ్యవార్లకు అమెరికాలో మంచి అవకాశాలున్నాయి. కొందరు అర్చకులు ఇంట్లోనే టెంపుల్ కట్టుకుని ఆదాయం పొందుతున్నారు. ఇలా అమెరికాలో అర్చకులు మంచి ఆదాయంతో పాటు గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారు.