Gunji Gunji Song : ఈ బూతు పాట ఆలోచన ఈ జెన్ జెడ్ హీరో గాడిదా..? తండ్రిదా..?

Published : Feb 06, 2026, 05:29 PM IST

Gunji Gunji Song : అసలు ఈ సమాజం ఎటుపోతోంది… మానవ విలువలు ఏమయ్యాయి. హనీమూన్ మర్డర్ వ్యవహారం మర్చిపోకముందే హనీమూన్ మర్డర్  2.0.. ఇప్పుడు యువ జీరో బూతు పాట హల్ చల్. 

PREV
14
హనీమూన్ మర్డర్ 2.0

నేరం చేసేవారికి

1 . తమపై శక్తియుక్తులపై అతివిశ్వాసం ఉంటుంది.

2. అవతలి వారి { అంటే పోలీస్ లు .. సమాజం } శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తారు.

సింపుల్ గా చెప్పాలి అంటే అతితెలివి

కొన్ని నెలల క్రితం హనీ మూన్ మర్డర్ జరిగింది .

భర్తను చంపించిన భార్య.. చివరకు చిప్పకూడు పాలయ్యింది .

ఇప్పుడు రాజస్థాన్ లో హనీ మూన్ మర్డర్ 2.0

పెళ్లి కాకముందే .. ప్రేమ .. ప్రియుడు .

అక్కడిదాకా ఓకే .

హాయిగా ప్రియుడితోనే లివ్ ఇన్ లేదా పెళ్ళో చేసుకోవచ్చుగా ?

వేరే వ్యక్తితో పెళ్లి .

పెళ్లయిన కొన్ని రోజులకే ప్రియుడి సాయం తో భర్త హత్య .

ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి అయ్యింది .

ఫోన్ కాల్స్ , వాట్సాప్ చాట్ లు గూగుల్ లొకేషన్ లాంటి వాటి ఆధారంగా సులభంగా నేరం చేసినవారిని పెట్టుకోవచ్చు . వాట్సాప్ లో చాట్ డెలీట్ చేసినా దాన్ని రిట్రీవ్ చెయ్యొచ్చు .

ఏదో ఆవేశం లో నేరం జరిగి పొతే అదొక లెక్క .

పక్కాగా ప్లాన్ చేసి మర్డర్ చేసి .. చివరకు దొరికి ఏళ్ళ తరబడి దోమ కాట్లు చిప్ప కూడు బతుకు బతకడమెందుకు ?

ఎందుకంటే తాము మహా స్మార్ట్ .. ఎవడికీ దొరకము .. క్రైమ్ చేసేసి హ్యాపీ గా బతికేయొచ్చు అనే అతితెలివి ఆలోచన .

24
బూతు పాట ఐడియా తండ్రిదా... కొడుకుదా..?

ఇప్పుడు బూతు పాట యువ జీరో వివాదానికి వద్దాము .

ఇదేదో యాదృచ్చికంగా జరిగింది కాదు .

తండ్రి టీవీ రంగంలో అపార అనుభవం ఉన్నవాడే .

"మామూలుగా అయితే జనాలు పెద్దగా పట్టించుకోరు .. ఎంత వివాదం అయితే అంత పబ్లిసిటీ" అని ప్లాన్ చేసి చేప్పట్టిన చర్య .

ఇప్పుడు హింస ... బూతు సినిమాల యుగం నడుస్తోంది .

మార్కోస్ , అనిమల్ , కెజిఫ్ - 2 .

పెద్ద హీరో నే కుర్చీ ని మడతపెట్టాడు .

సోషల్ మీడియా మొత్తం బూతులే .

రాజకీయనాయకులు కూడా .

ఇలాంటి స్థితిలో ఇంకో మెట్టు ఎక్కి సంచలనం సృష్టించాలి అనే ఆలోచన.

బహుశా తండ్రిదే కావొచ్చు .

లేదా కొడుక్కి కూడా ఇలాంటి ఐడియా పుట్టి ఉండొచ్చు .

పెద్ద తరం వారైతే బాధపడుతున్నారు కానీ .. మొబైల్ ఫోన్ లో మునిగి తేలుతున్న బుర్ర తక్కువ తరం జెన్ జెడ్ కు ఇది మామూలే .

34
జెన్ జెడ్ లో 95 శాతం మంది మొబైల్ ఫోన్ బానిసలే

జెన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వారు.

అంటే 14 - 29 వయసున్న వారు .

యూత్ అమ్మా యూత్ ..

వీరిలో 100 కి 95 మంది మొబైల్ ఫోన్ బానిసలు .

ఇదేదో అభిప్రాయం కాదు .

సైంటిఫిక్ గా ఋజువయ్యింది .

వారి మెదడు లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఆంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ న్యూక్లియస్ అకంబెన్స్ లాంటి మెదడు భాగాల్లో మొబైల్ అతి వినియోగం మార్పు తెచ్చింది .

సినిమాటిక్ గా చెప్పాలి అంటే చిన్న మెదడు చితికింది.

ఇంగిత జ్ఞానం చచ్చింది .

భావోద్వేగాలు అదుపు చేసుకోలేరు .

అతికి మించిన సూపర్ అతి కావాలి . నిముషం నిముషం సంచలనం కావాలి .

సినిమాలు చూసేది ఎక్కువగా ఈ తరమే .

వీరిదొ లోకం .

వీరిని చూసి బాధ పడి.. మార్పు కోసం ప్రయత్నించే వారు కొందరు .

సంఘ సేవ మనకెందుకు ?

అవకాశాన్ని సొమ్ము చేసుకొందాము అనుకొనే వారు ఎందరో !

అందుకే బూతు వీడియోలు .. సంచలన వీడియో లు.. హింసా సినిమాలు.. బూతు కామెంట్స్ { మీరు గమనించండి .. పచ్చి బూతులతో కొంత మంది కామెంట్స్ కాలమ్ లో పోస్ట్ చేస్తారు . దాన్ని ఆ యూట్యూబ్ ఛానల్ వాడు .. వీడియో / పోస్ట్ పెట్టిన వాడు డిలీట్ చెయ్యడు . ఎందుకంటే ఎంత వివాదం అయితే అంత పబ్లిసిటీ }

మన అదృష్టం ఏమిటంటే ఇంకా మంచి బతికే ఉంది .

2017 లో ఒక సినిమా వచ్చింది .

దాన్ని చూసి చాలామంది వాంతి చేసుకొన్నారు .

సినిమా హిట్ అయ్యింది .

కరోనా ముందే అంత వికారాన్ని నెత్తిన వేసుకొన్న సమాజం మనది . మరి కరోనా తరువాత ?

ఆ సినిమా హీరో మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి . మంచి పర్సనాలిటీ కూడా .

ఆ సినిమా హిట్ అయినా దానితో సొంతం చేసుకున్న ఆ నెగటివ్ ఇమేజ్ వదిలించుకోలేక పోయాడు .

అటు తరువాత హిట్ సినిమాలు లేకపోవడానికి ఇదొక కారణం .

44
కొడుక్కి జ్ఞానం లేదు...తండ్రికైనా ఉండొద్దా?

అన్ని వర్గాలను సొంతం చేసుకొన్నవాడే హీరో గా ఎదుగుతాడు . అన్ని వర్గాలను ఆకట్టుకున్న సినిమా నే హిట్ అవుతుంది . అప్పుడప్పుడూ మినహాయింపులు ఉంటాయి .

ఇప్పుడు రోత హీరో గా సంచలనం సృష్టించాలి అనుకొన్న జెన్ జెడ్ జీరో గాడికి అంత ఇంగిత జ్ఞానం ఉండకపోచ్చు .

సగం గడ్డం నెరిసిన తండ్రికైనా ఉండొద్దా ?

Read more Photos on
click me!

Recommended Stories