Mysterious Villages in India : భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఓ గ్రామంలో ఇళ్లకు తలుపులుండవు, మరో గ్రామంలో పాములతో కలిసి ప్రజలు జీవిస్తారు. ఇలాంటి వింత గ్రామాలు దేశంలో ఎన్నో ఉన్నాయి.
Mysterious Villages : భారతదేశంలో వింతలు విడ్డూరాలకు కొదవలేదు. నలుగురు నడిచిన దారిలో నడిస్తే కిక్కేముంటుంది... తమకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలనుకునేవారు కొత్త మార్గాన్ని ఎంచుకుంటారు. ఇలా కొందరు పూర్వీకులు ఇలాంటి ఆలోచన చేయడంతో కొన్ని గ్రామాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి… ఇప్పటికీ ఆ ప్రత్యేకతను ఆయా గ్రామస్థులు కొనసాగిస్తున్నారు. ఇక మరికొన్ని ప్రాంతాలు వివిధ కారణాలతో వాటంతట అవే ప్రత్యేకంగా మారాయి. ఇలా ఇండియాలోని టాప్ 5 ఆసక్తికర ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
26
1. శని శిగ్నపూర్, మహారాష్ట్ర
శనిదేవుడి ఆలయంగల గ్రామం.. మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయం షిర్డికి సమీపంలో ఉంటుంది. ఈ గ్రామంలో ఏ ఇంటికి కూడా డోర్స్, లాక్స్ ఉండవు... అయినా ఎలాంటి భయం లేకుండా ప్రజలు జీవిస్తుంటారు. ఆ శని దేవుడే తమ ఇళ్లకు భద్రత కల్పిస్తారని ఈ గ్రామ ప్రజలు బలంగా నమ్ముతుంటారు... అందుకే ఇంటికి డోర్స్ పెట్టుకోరు.
36
2. భిలార్, మహారాష్ట్ర
ఈ గ్రామాన్ని 'విలేజ్ ఆఫ్ బుక్స్' గా పిలుస్తుంటారు. ఈ గ్రామంలోని 25 ఇళ్ళు, దేవాలయాలు, స్కూల్స్ మినీ లైబ్రరీలుగా మారాయి. ఇక్కడ ఏకంగా 15 వేలకు పైగా పుస్తకాలు ఉంటాయి. భిలార్ ప్రజలకు చదువంటే ఎంత మక్కువో అక్కడి లైబ్రరీలే చెబుతాయి.
భారతదేశంలో టిబెట్ దేశీయులు నివాసముంటున్న అతిపెద్ద వలస స్థావరం బైలకుప్పె. కర్ణాటకలోని ఈ ప్రాంతంలో సుమారు 20 గ్రామాలుంటాయి... ఇందులో అత్యధికంగా బౌద్దులు, సన్యాసులు నివాసముంటున్నారు. అనేక ఆరామాలు, విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మిని టిబెట్ అంటారు.
56
4. శేట్ ఫాల్ (Shetphal), మహారాష్ట్ర
షోలాపూర్ జిల్లా మొహోల్ తాలూకాలో ఈ శేట్ ఫాల్ గ్రామం ఉంది. ఈ గ్రామస్థులు పాములతో కలిసి జీవిస్తుంటారు.. అందుకే ఈ గ్రామంలో పాములు స్వేచ్చగా తిరుగుతుంటాయి. గ్రామస్థులు పాములను తమ కుటుంబసభ్యులుగా భావిస్తుంటారు.. వాటికి ఎలాంటి హాని తలపెట్టరు. అయితే ఇతర ప్రాంతాలనుండి ఈ గ్రామానికి వెళ్లేవారు పాములను చూసి భయపడిపోతుంటారు.
66
5. సెంటినెలీస్, అండమాన్ నికోబర్
ప్రపంచంలో ఇప్పటికీ అడవుల్లో జీవిస్తున్న అనేక అరుదైన జాతులు ఉన్నాయి... ఇందులో భారతదేశానికి చెందిన సెంటిలెనీస్ కూడా ఉన్నారు. వీరు అండమాన్ నికోబార్ లోని ఓ ద్వీపంలో నివాసముంటారు... ఇతర మనుషులతో కలిసేందుకు ఇష్టపడరు. అందుకే ఈ ద్వీపానికి పర్యాటకులనే కాదు ఎవ్వరినీ అనుమతించకుండా నిషేధం విధించింది ప్రభుత్వం. ఎప్పుడూ బాణాలు ధరించి ఉండే ఈ ఆటవిక తెగ ఇతర మనుషులు కనిపిస్తే దాడులకు దిగుతారు... ప్రాణహాని తలపెడుతుంటారు.