మీరు తప్పుడు వ్యక్తులకు డబ్బులు పంపినా, పంపాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు పంపినా ఏం చేయాలి? యూపీఐ లావాదేవీలను పర్యవేక్షించే సంస్థ NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) రూల్స్ ఏం చెబుతున్నాయి?
ముందుగా బ్యాంకులో అధికారికంగా ఫిర్యాదు చేయవచ్చు.
NPCI గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. NPCI డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం ద్వారా 1800-120-1740 టోల్-ఫ్రీ నంబర్‌కు కూడా ఫిర్యాదు చేయొచ్చు.
ట్రాన్సాక్షన్ ఆధారాలను సమర్పించాలి.
విచారణ తర్వాత డబ్బు పొరపాటున వెళ్లిందని తేలితే, దాన్ని రికవర్ చేసే ప్రాసెస్ మొదలవుతుంది.
NPCI నిబంధనల ప్రకారం నెలలో 10 సార్లు మాత్రమే తప్పుగా పంపిన డబ్బును తిరిగి పొందడానికి ప్రయత్నించవచ్చు. అదే ఒకే వ్యక్తికి 5 కంటే ఎక్కువసార్లు తప్పుగా పంపితే డబ్బు తిరిగి రాదు.
RBI అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చా?
బ్యాంకు లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేసినా పరిష్కారం దొరకకపోతే RBI ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం ముందుగా బ్యాంకులో ఫిర్యాదు చేసి ఉండాలి. 30 రోజుల్లోగా పరిష్కారం రాకపోతేనే RBIని సంప్రదించాలి.
డబ్బు తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది?
ఫిర్యాదు, విచారణను బట్టి కొన్ని రోజుల్లో పరిష్కారం దొరకొచ్చు. కొన్ని క్లిష్టమైన కేసుల్లో కొన్ని వారాలు పట్టొచ్చు. ట్రాన్సాక్షన్ వివరాలు కరెక్ట్‌గా ఇస్తే, ప్రాసెస్ వేగంగా జరుగుతుంది.