Trivikram: అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ చేసిన సినిమాలు ఇవే.. ఒకే ఫార్ములా, దమ్మున్నవి ఎన్ని ?

Published : Nov 05, 2026, 04:49 PM IST

Trivikram Srinivas: ‘అత్తారింటికి దారేది’ తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమాల్లో కుటుంబ కథలే ప్రధానంగా కనిపించాయి. హిట్లు, ఫ్లాపులతో సాగిన ఆయన ప్రయాణం ఎలా ఉందంటే?

PREV
18
Trivikram Srinivas

'అత్తారింటికి దారేది' (2013) చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన తిరుగులేని విజయం తర్వాత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రాలనే (Family Genre) నమ్ముకుని వరుస సినిమాలు చేశారు. విడిపోయిన కుటుంబాలను కలపడం, తండ్రి విలువలు, ఈగోల మధ్య నలిగే సంబంధాలు అనే ఫార్ములాతోనే ఎక్కువగా సినిమాలు చేశారు. అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ చేసిన సినిమాల లిస్ట్ ఇదే.

28
సన్నాఫ్ సత్యమూర్తి (2015)

'అత్తారింటికి దారేది' హిట్‌తో తండ్రి విలువలను నమ్ముకునే ఒక ఆదర్శవంతమైన కుర్రాడి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్ పాత్ర ద్వారా తండ్రి ఆదర్శాలను కాపాడే కొడుకుగా అల్లు అర్జున్ నటన, కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. సినిమా డివైడ్ టాక్‌తో ప్రారంభమైనప్పటికీ, కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది.

38
అ..ఆ (2016)

నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా అత్త-అల్లుళ్ల ఈగోలు, కుటుంబాల మధ్య ఉండే అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. 'అత్తారింటికి దారేది' ఛాయలు ఇందులో స్పష్టంగా కనిపించినప్పటికీ, త్రివిక్రమ్ తనదైన మార్క్ కామెడీ, మాటలతో మ్యాజిక్ చేశారు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి క్లీన్ హిట్‌గా నిలిచింది.

48
అజ్ఞాతవాసి (2018)

పవన్ కళ్యాణ్‌తో 'అత్తారింటికి దారేది' కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ, పగ-ప్రతీకారాలు, కార్పొరేట్ సామ్రాజ్యం చుట్టూ తిరిగే ఫ్యామిలీ డ్రామాగా దీనిని రూపొందించారు. అయితే కథలో బలం లేకపోవడం, బలవంతపు కామెడీ, మితిమీరిన డ్రామా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. త్రివిక్రమ్ కెరీర్‌లోనే అత్యంత పెద్ద ప్లాప్‌లలో ఒకటిగా నిలిచి, ఆయన ఫ్యామిలీ ఫార్ములాపై విమర్శలు వచ్చేలా చేసింది.

58
అరవింద సమేత వీర రాఘవ (2018) '

అజ్ఞాతవాసి' డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ తన రెగ్యులర్ ఫ్యామిలీ కామెడీకి కాస్త భిన్నంగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో కుటుంబ విలువలు, శాంతి సందేశాన్ని జోడించి ఎన్టీఆర్‌తో ఈ సినిమా చేశారు. ఫ్యాక్షన్ వల్ల జరిగే నష్టాన్ని, కుటుంబాల మధ్య ఉండాల్సిన శాంతిని ఎమోషనల్‌గా చూపించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి త్రివిక్రమ్‌ను మళ్లీ హిట్ ట్రాక్‌ ఎక్కించింది.

68
అల వైకుంఠపురములో (2020)

ఇంటి దొంగలు-సంతానం మార్పిడి అనే పాతకాలపు ఫ్యామిలీ డ్రామా ఫార్ములాతో త్రివిక్రమ్ ఈ చిత్రం తెరకెక్కించారు. అల్లు అర్జున్ క్రేజ్, తమన్ అందించిన చార్ట్‌బస్టర్ సంగీతం, వినోదాత్మకమైన సన్నివేశాలు ఈ సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లాయి. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

78
గుంటూరు కారం (2024)

మహేష్ బాబుతో చాలా కాలం తర్వాత జతకట్టి, విడిపోయిన తల్లి-కొడుకుల బంధం చుట్టూ తిరిగే మరో ఫ్యామిలీ డ్రామాను త్రివిక్రమ్ అందించారు. పాత కథే అయినప్పటికీ, మహేష్ బాబు ఎనర్జిటిక్ మాస్ పెర్ఫార్మెన్స్ సినిమాను ఒంటిచేత్తో నడిపించింది. మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, సంక్రాంతి సీజన్ కావడంతో పర్వాలేదనిపించింది.

88
ఆదర్శ కుటుంబం (2026)

ఈసారి త్రివిక్రమ్ ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్ టచ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతోంది. అయితే ఆడియన్స్ నుంచి ఈ చిత్రాన్ని ఆశించిన స్థాయిలో స్పందన లేదు. విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories