Budget Trip : విమానాలు, బస్సుల్లో కాదు.. రైలులో తక్కువ బడ్జెట్లోనే వెళ్లగలిగే హిల్ స్టేషన్స్ ఇవే

Published : Nov 26, 2026, 04:52 PM IST

ఈ చలికాలంలో బడ్జెట్‌లో మంచి నేచర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే రైలులోనే చుట్టివచ్చే టాప్ 6 హిల్ స్టేషన్స్ ఇండియాలో అనేకం ఉన్నాయి… వాటిలో టాప్ 6 గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
వింటర్ హాలిడేస్ కోసం స్పెషల్ టూర్ ప్లాన్

భారతదేశంలో చలికాలంలో హిల్ స్టేషన్లు చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మీ భాగస్వామితో కలిసి వెళ్లడానికి ఇది సరైన సమయం. మరి తక్కువ బడ్జెట్ లో రైలులోనే ఈ టాప్ 6 ప్రదేశాలకు ఎలా వెళ్లాలో ఇక్కడ తెలుసుకుందాం.

25
సిమ్లా, హిమాచల్ ప్రదేశ్

మెయిన్‌లైన్ రైలులో హర్యానాలోని కల్కాకు చేరుకున్న తర్వాత, యునెస్కో గుర్తింపు పొందిన కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ ఎక్కండి. ఈ చలికాలంలో ఈ అందమైన ప్రదేశం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

35
డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్

రాత్రిపూట రైలులో న్యూ జల్పైగురి (NJP) చేరుకుని, అక్కడి నుంచి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో ప్రయాణించండి. ఈ ప్రాంతంలో వేడి వేడి మోమోస్, హోమ్ స్టేస్, చలికి తగ్గ వాతావరణం దొరుకుతాయి.

45
ఊటీ, తమిళనాడు

కోయంబత్తూర్ లేదా మెట్టుపాళయం చేరుకుని, అక్కడి నుంచి పొగమంచు కప్పిన తేయాకు తోటల గుండా నీలగిరి మౌంటైన్ రైల్వేలో ప్రయాణించండి. ఇండియాలో బడ్జెట్‌లో వెళ్లగలిగే బెస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ అందమైన కొండలు, మంచి భోజనం ఆస్వాదించవచ్చు.

మాథెరాన్, మహారాష్ట్ర

సబర్బన్ లేదా ఎక్స్‌ప్రెస్ రైలులో నేరల్ జంక్షన్‌కు వెళ్లండి (ముంబై, పూణే నుంచి ఇక్కడికి వెళ్లడం చాలా ఈజీ). మహారాష్ట్రలోని ఈ హిల్ స్టేషన్ పచ్చదనం, అద్భుతమైన వ్యూస్, మంచి వాతావరణానికి ఫేమస్.

55
మెక్లీయోడ్‌గంజ్ (ధర్మశాల), హిమాచల్ ప్రదేశ్

ఢిల్లీ నుంచి పఠాన్‌కోట్‌కు రైలులో వెళ్లి, అక్కడి నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కాంగ్రా వ్యాలీ రైల్వేలో లేదా లోకల్ బస్సులో ప్రయాణించండి. ఇక్కడ తక్కువ ఖర్చుతో ఉండే హాస్టల్స్, స్ట్రీట్ ఫుడ్, గిఫ్ట్ షాప్స్ ఉంటాయి.

ముస్సోరి, ఉత్తరాఖండ్

డెహ్రాడూన్ రైల్వే స్టేషన్‌కు డైరెక్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కండి. అక్కడి నుంచి 35 కి.మీల ఘాట్ రోడ్‌లో షేర్డ్ టాక్సీ లేదా లోకల్ బస్సులో వెళ్లవచ్చు. ఇక్కడ ప్రయాణ ఖర్చులు చాలా తక్కువ. లైబ్రరీ చౌక్ దగ్గర బడ్జెట్ గెస్ట్‌హౌస్‌లలో తక్కువ రేటుకే బస చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories