
భూమి నిర్మాణం ఒక కాంక్రీట్ భవనంలా లేదా పెద్ద ఉల్లిపాయలా పొరలుగా ఉంటుంది . మనం ఉండే పైభాగాన్ని ఎర్త్ క్రస్ట్ అని, దాని కింద మాంటిల్, ఆ కింద కోర్ ఉంటాయి. సముద్రాలన్నీ ఎర్త్ క్రస్ట్ పైనే ఉన్నాయి . సముద్రాల అడుగున ఉండే పొరను ఓషియానిక్ క్రస్ట్ అంటారు. ఇది వేలాది సంవత్సరాలుగా ఏర్పడిన చాలా దట్టమైన, గట్టి బసాల్ట్ రాతి పొర. నీరు కిందకి వెళ్ళడానికి రంధ్రాలు అవసరం కానీ, ఈ దట్టమైన పొరలో అలాంటి రంధ్రాలు ఉండకపోవడం వల్ల నీరు చొచ్చుకెళ్లడం దాదాపు అసాధ్యం.
సముద్రం అడుగున ఉన్న ఓషియానిక్ క్రస్ట్ సగటున 5 నుంచి 10 కిలోమీటర్ల మందం ఉంటుంది. దీనిపై వేల మీటర్ల లోతులోని సముద్రపు నీటి ఒత్తిడి పడుతుంది. ఈ తీవ్రమైన ఒత్తిడి వల్ల చిన్న చిన్న రంధ్రాలు, మైక్రో గ్యాప్‌లు కూడా పూర్తిగా మూసుకుపోయి నీరు దిగడానికి దారి లేకుండా పోతుంది . శాస్త్రంలోని హైడ్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం ప్రకారం, పైనుంచి నీరు నొక్కే బరువు కంటే కింద ఉన్న రాతి పొరల శక్తి ఎక్కువగా ఉండి సమతుల్యతను కాపాడుతుంది, దాంతో నీరు స్థిరంగా ఉంటుంది.
అంతేకాకుండా, సముద్రం అడుగుభాగంలో వేలాది సంవత్సరాలుగా పేరుకుపోయిన క్లే (జిగట మట్టి), ఆర్గానిక్ డెబ్రీస్ మరియు ఫైన్ సెడిమెంట్స్ ఒక సహజ వాటర్‌ప్రూఫ్ సీలెంట్లా పనిచేసి అడుగుభాగాన్ని సీల్ చేస్తాయి. బిగించిన మూత ఉన్న ప్లాస్టిక్ బాటిల్‌పై నీళ్లు పోసినా లోపలికి వెళ్లలేనట్లే, ఈ బసాల్ట్ జిగట మట్టి పొరలు ఒక పటిష్టమైన క్యాప్‌లా పనిచేస్తాయి. పైగా లక్షలాది సంవత్సరాల నీటి బరువుతో అక్కడి రాళ్లు ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ లేకుండా అత్యంత కాంపాక్ట్‌గా మారతాయి.
భూమి లోపల వేడి, సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్
ఏదైనా కొద్దిపాటి నీరు రాళ్ల సందుల నుంచి కిందకి వెళ్లినా, లోపలికి వెళ్లే కొద్దీ పెరిగే వేడి (మాంటిల్ ప్రాంతంలో వేల డిగ్రీల సెల్సియస్) వల్ల వెంటనే ఆవిరిగా మారుతుంది . అధిక ఒత్తిడి, అధిక వేడి ఉన్న లోపలి భాగంలో నీరు సాధారణ ద్రవ రూపంలో కాకుండా గ్యాస్, లిక్విడ్ రెండింటి లక్షణాలతో సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ స్థితికి చేరుకుంటుంది. ఈ స్థితిలో నీరు కిందకి ఇంకే బదులు ఒత్తిడి వల్ల తిరిగి పైకి నెట్టబడుతుంది.సముద్రపు అడుగున అగ్ని పర్వత ప్రాంతాల్లోని చిన్న చిమ్నీల వంటి హైడ్రోథర్మల్ వెండ్స్ ద్వారా వేడెక్కిన నీరు రసాయనాలతో కలిసి తిరిగి సముద్రంలోకే పంప్ అవుతుంది; తద్వారా వెళ్లిన నీరు మళ్లీ పైకి వస్తుంది.
భూమి ఉపరితలంలోని టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు ఒక ప్లేట్ మరొకదాని కిందకి వెళ్లే సబ్డక్షన్ ప్రక్రియలో కొద్దిగా సముద్రపు నీరు మాంటిల్ పొరల్లోకి లాగబడుతుంది . మాంటిల్ ట్రాన్సిషన్ జోన్లో సముద్రాల కంటే ఎక్కువ నీరు ఉన్నప్పటికీ, అది నీటి కొలనుల్లా కాకుండా రింగ్వుడ్డైట్ అనే ఖనిజ నిర్మాణంలో రసాయనికంగా బంధించబడి ఉంటుంది. అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు లావాతో పాటు విడుదలయ్యే నీటి ఆవిరి మేఘాలుగా మారి వర్షం రూపంలో తిరిగి సముద్రాలకు చేరే ప్రక్రియనే గ్లోబల్ వాటర్ సైకిల్ అంటారు.
మంచి నీటితో పోలిస్తే ఉప్పు, ఖనిజాల వల్ల సముద్రపు నీటి సాంద్రత (డెన్సిటీ) ఎక్కువగా ఉంటుంది . గురుత్వాకర్షణ నీటిని కిందకి లాగుతున్నా, భూమి లోపలి వాయువులు, మాగ్మా సృష్టించే అంతర్గత ఒత్తిడి దాన్ని బలంగా ప్రతిఘటిస్తుంది. ఈ బయటి, లోపలి ఒత్తిళ్ల మధ్య సమతుల్యత వల్ల సముద్రపు నీటి మట్టం క్రమబద్ధంగా ఉంటుంది.
సముద్రపు నీరంతా ఒక్కసారిగా భూమి లోపలికి ఇంకిపోతే మహాసముద్రాలు ఎండిపోయి గ్లోబల్ క్లైమేట్ సిస్టం కుప్పకూలుతుంది . ఆవిరి, మేఘాలు, వర్షాలు లేక భూగోళం ఎడారిగా మారి జీవరాశి నశిస్తుంది. అలాగే టన్నుల కొద్దీ నీరు మాంటిల్లోకి వెళ్తే అక్కడి వేడికి భయంకరమైన ఆవిరిగా మారి అణుబాంబు కంటే వేల రెట్లు అధిక ఒత్తిడిని సృష్టించి, భూమి పేలిపోవడం లేదా తీవ్ర భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటనాల ముప్పు తలెత్తుతుంది.
ఓషియానిక్ క్రస్ట్ నీటిని ఆపడం, వెళ్లిన కొద్దిపాటి నీటిని అగ్ని పర్వతాలు, హైడ్రోథర్మల్ వెండ్స్ ద్వారా ఆవిరిగా తిరిగి పంపడం ఒక నిరంతర చక్రంగా సాగుతుంది . ఆధునిక శాస్త్రవేత్తలు శాటిలైట్ డేటా, సీస్మిక్ వేవ్స్ ద్వారా ఈ భూగర్భ నీటి వ్యవస్థపై పరిశోధనలు చేస్తూ భూమి పుట్టుక, వాతావరణ మార్పులను అంచనా వేస్తున్నారు . బసాల్ట్ రాళ్లు, ఒత్తిడితో సీల్ చేసే క్లే పొరలు, లోపలి వేడి కలసి పనిచేయడం వల్లే భూమి జీవజాలానికి నిలయంగా నిలిచింది.