Top 5 Oldest Cities In The World: యునెస్కో తో పాటు పలు పురావస్తు సర్వేల ప్రకారం ప్రపంచంలోని అత్యంత పురాతన 5 నగరాల జాబితాల లిస్టులో భారత్ కు చెందిన ఒక నగరం కూడా చోటు సంపాదించింది. 11 వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నగరాల ఏవి? వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
11 వేల ఏళ్ల క్రితమే వెలిసిన నగరం ఏదో తెలుసా? టాప్ 5 ఓల్డెస్ట్ సిటీస్ లిస్ట్ ఇదే
ప్రపంచంలో అన్నింటికంటే అత్యంత పురాతనమైన నగరం ఏదంటే కచ్చితంగా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే దీనికి సంబంధించి ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే, యునెస్కో సహా పలు పురావస్తు శాఖ సర్వేల ఆధారంగా ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఐదు నగరాల జాబితాను రూపొందించారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ ఐదు నగరాలు ఏవో, వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
26
డమాస్కస్, సిరియా
సిరియా దేశ రాజధాని అయిన డమాస్కస్ నగరానికి ఏకంగా 11,000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాల జాబితాలో ఇది ముందు వరుసలో నిలుస్తుంది. మధ్య యుగంలో ఈ నగరం చేతివృత్తుల పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా విలసిల్లింది. ముఖ్యంగా కత్తులు, లేస్ తయారీలో డమాస్కస్ నగరం ప్రత్యేక గుర్తింపు పొందింది. వేల ఏళ్లు గడిచినా ఈ నగరం తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది.
36
ఏథెన్స్, గ్రీస్
యూరప్ ఖండంలోని అత్యంత పురాతన నగరాలలో గ్రీస్ దేశ రాజధాని ఏథెన్స్ ఒకటి. ఈ నగర చరిత్ర దాదాపు 3,400 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. యూరప్ నాగరికతకు, హిస్టరీకి ఏథెన్స్ ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది. వేల ఏళ్ల క్రితమే ఇక్కడ మానవ నివాసాలు, నాగరికత అభివృద్ధి చెందాయని పురావస్తు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వారణాసి నగరం కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. దీనిని బెనారస్ లేదా కాశీ అని కూడా పిలుస్తారు. వారణాసి నగర చరిత్ర 3,000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. వేల ఏళ్ల క్రితం నుంచే ఇక్కడ జనజీవనం కొనసాగుతోంది. భారతదేశ చరిత్రలో అత్యంత పురాతన నగరంగా వారణాసికి ప్రత్యేక స్థానం ఉంది.
56
బైబ్లోస్, లెబనాన్
లెబనాన్ దేశంలోని బైబ్లోస్ నగరం కూడా అత్యంత పురాతనమైనది. పురావస్తు తవ్వకాలు, నివాస ఆధారాలను బట్టి చూస్తే ఈ నగరం క్రీస్తు పూర్వం (BCE) 5,000 సంవత్సరాల నాటిదని తెలుస్తోంది. అంటే దాదాపు ఏడు వేల ఏళ్ల క్రితమే ఇక్కడ మనుషులు నివసించినట్లు ఆధారాలు లభించాయి. పురాతన నాగరికతకు ఈ నగరం ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తోంది.
66
సుసా, ఇరాన్
ఇరాన్ దేశంలోని సుసా నగరం కూడా వేల ఏళ్ల చరిత్ర కలిగిన అతి పురాతన ప్రాంతం. ప్రోటో-ఎలమైట్ నాగరికతకు చెందిన పురాతన నగరాలలో సుసా ఒకటి. దీని చరిత్ర దాదాపు 6,300 సంవత్సరాల నాటిది. పురాతన కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందిన నగరంగా సుసాకు పేరుంది. వేల ఏళ్ల నాటి మానవ చరిత్రను ఈ నగరం తనలో దాచుకుంది.