బోరు వేయాలని అనుకుంటున్నారా? మీ భూమిలో ఎక్కడ నీరు ఎక్కువున్నాయో స్మార్ట్ పోన్ తోనే తెలుసుకొండి

Published : Nov 24, 2026, 10:33 AM IST

మీ భూమిలో బోర్ వేయించాలని అనుకుంటున్నారా? అయితే మీ చేతిలోని స్మార్ట్‌ఫోన్ ద్వారానే భూగర్భ జలాల స్థాయిని సులభంగా తనిఖీ చేయవచ్చు. బోర్ బావి తవ్వడానికి సరైన స్థలం గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.

PREV
14
బోర్ పాయింట్ చెక్ చేయడం ఇంత ఈజీనా..!

నదులు, చెరువులు, కాలువల ద్వారా సాగునీరు అందుబాటులో లేకుంటే రైతులు భూగర్భజలాలపై ఆధారపడాల్సిందే. ఇలాంటి ప్రాంతాల్లో పూర్వం బావుల ద్వారా వ్యవసాయానికి నీరు అందేది... ఇప్పుడు బోరుబావుల ద్వారా అందుతోంది. అయితే కొత్తగా బోరువేసే రైతులకు ఎక్కడ తవ్విస్తే నీరు వస్తుందనే కన్ఫ్యూజన్ ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు కొబ్బరికాయలు, నీళ్లచెంబులు ద్వారా భూగర్భ జలాలను గుర్తిస్తామని చెబుతూ రైతుల నుండి డబ్బులు లాగుతుంటారు. తీరా వీళ్లుచెప్పే పాయింట్ వద్ద బోరు వేస్తే నీరురాక రైతులు ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలు అనేకం.

అయితే ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై రైతులు తమ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి భూమిలో ఎక్కడ భూగర్భజలాలు అధికంగా ఉన్నాయో గుర్తించవచ్చు... అక్కడ బోర్ తవ్వి సమృద్ధిగా సాగునీటిని పొందవచ్చు. మరి ఫోన్ ద్వారా బోర్ పాయింట్ ఎలా చూడాలో ఇక్కడ తెలుసుకుందాం.

24
స్మార్ట్‌ఫోన్ ద్వారా బోర్ పాయింట్‌ చెక్ చేయడం ఎలా?

ఇంటివద్ద లేదా వ్యవసాయ భూమిలో బోర్ వేసే ముందు నీరు ఎక్కడ పడుతుంది, ఎంత లోతులో పడుతుంది అనేది తెలుసుకోవడం ఇక చాలా సులభం. మీ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి నీరు ఎక్కడ దొరుకుతుంది, ఎంత లోతులో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఇస్రో (ISRO) రూపొందించిన 'భువన్' వెబ్‌సైట్ డేటా ద్వారా ఈ సమాచారాన్ని చాలా సులభంగా పొందవచ్చు.

ఇస్రో 'భువన్' వెబ్‌సైట్‌లోని 'భూగర్భ జలాల అవకాశాలు', 'భూగర్భ జలాల సమాచార వ్యవస్థ'ను ఉపయోగించి బోర్ ఎక్కడ వేయాలి, ఎంత లోతు తవ్వాలి, ఎంత త్వరగా నీరు పడే అవకాశం ఉందో తెలుసుకోవచ్చు.

ఎలా చెక్ చేయాలి? 

వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి : మీ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేయండి. అక్కడ ఇస్రో అధికారిక 'Bhuvan (భువన్)' వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

మ్యాప్‌ను ఎంచుకోండి : వెబ్‌సైట్‌లో కనిపించే 'భూగర్భ జలాల అవకాశాలు' మ్యాప్‌ను ఎంచుకోండి.

మీ ప్రాంతాన్ని వెతకండి : నీటి లభ్యత వివరాలను చెక్ చేయడానికి మీ జిల్లా, మండలం, పట్టణం లేదా గ్రామాన్ని ఎంచుకొండి.

గూగుల్ మ్యాప్ లొకేషన్‌ను వాడండి : మీ పొలంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో నీరు పడుతుందో లేదో తెలుసుకోవడానికి, గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆ లొకేషన్ కోొఆర్డినేట్స్ కాపీ చేసి ఇస్రో భువన్ వెబ్‌సైట్‌లో పేస్ట్ చేయండి.

లెజెండ్ చూడండి : మ్యాప్‌లో చూపించిన రంగులు, డిజైన్ల ఆధారంగా నీటి లభ్యతను అంచనా వేయవచ్చు. మ్యాప్ కింద ఉన్న 'లెజెండ్' (Legend) ఆప్షన్‌ను ఓపెన్ చేస్తే ఆ రంగులు, గీతల అర్థాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు.

34
మ్యాప్‌లోని రంగులతో నీటి లభ్యత వివరాలు తెలుసుకోండి

మ్యాప్‌లో చూపించిన రంగుల ఆధారంగా, ఆ ప్రాంతంలో నిమిషానికి ఎన్ని లీటర్ల నీరు (LPM) వస్తుందో తెలుసుకోవచ్చు.

  • మీరు పిన్ చేసిన ప్రాంతంలో గ్రీన్ కలర్ ఉంటే అక్కడ వాటర్ లెవెల్ బాగున్నట్లు అర్థం. అక్కడ బోర్ వేస్తే నీరు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట.
  • ఎల్లో కలర్ ఉంటే మధ్యస్థంగా నీరు ఉన్నట్లు.. ఇక్కడ బోరు వేసినా నీరు పడే అవకాశాలుంటాయి.
  • ఆరెంజ్ ఉంటే తక్కువ వాటర్ లెవెల్ ఉన్నట్లు అర్ధం. ఇక రెడ్ ఉంటే చాలా తక్కువ వాటర్ ఉన్నట్లు. ఈ ప్రాంతాల్లో బోర్ వేసినా నీరు పడే అవకాశాలు చాలా తక్కువ అన్నమాట.

800 LPM (లీటర్లు/నిమిషం) పైన : అత్యధిక నీరు వచ్చే అవకాశం ఉంది.

400 – 800 LPM : అధిక నీటి ప్రవాహం రావచ్చు.

200 – 400 LPM : మంచి నీటి ప్రవాహం లభిస్తుంది.

100 – 200 LPM : ఓ మోస్తరు నీరు వస్తుంది.

50 – 100 LPM : నీరు తక్కువగా ఉంటుంది.

30 – 50 LPM : నీరు చాలా తక్కువగా ఉండవచ్చు.

20 – 30 లేదా 10 – 20 LPM : నీరు వచ్చే అవకాశం ఇంకా తక్కువ.

44
గీతల డిజైన్ తో నీటి లోతును ఎలా తెలుసుకోవాలి?

మ్యాప్‌లోని గీతల డిజైన్‌ను గమనించడం ద్వారా ఆ ప్రాంతంలో నీరు ఎంత లోతులో పడే అవకాశం ఉందో కూడా తెలుసుకోవచ్చు: మ్యాప్‌లో మీ ప్రాంతంలో 30–80 మీటర్ల వెడల్పు గల పసుపు రంగు గీతల డిజైన్ కనిపిస్తే, ఆ ప్రాంతంలో 30 నుంచి 80 మీటర్ల లోతులో నిమిషానికి సుమారు 50 నుంచి 100 లీటర్ల నీరు పడే అవకాశం ఉందని అర్థం. ఇలా భూగర్భజలాల జాడ తెలుసుకోవడమే కాదు ఎంత లోతువరకు తవ్వితే ఎంత నీరు వస్తాయో కూడా ఇస్రో భువన్ టెక్నాలజీ ద్వారా తెలుసుకోవచ్చు.

గమనిక : ఇస్రో భువన్ మ్యాప్‌లు భూగర్భజలాలకు సంబంధించిన ప్రాథమిక అంచనాలు మాత్రమే ఇస్తాయి. ఇవి మీ పొలంలోని ఒక నిర్దిష్ట అడుగు వద్ద కచ్చితంగా నీరు పడుతుందని హామీ ఇవ్వవు. కాబట్టి బోరు వేసేముందు ఈ టెక్నాలజీని ఉపయోగించడంతో పాటు జియాలజిస్టులను సంప్రదించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories