Top 5 Dirtiest Railway Stations : భారత దేశంలో చెత్త రైల్వే స్టేషన్లు అధికంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అత్యంత చెత్త రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? టాప్ 5 అపరిశుభ్ర స్టేషన్ల జాబితా ఇక్కడ చూడండి.
Dirtiest Railway Stations : స్వచ్చ భారత్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి... యావత్ దేశాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ప్రధాని మోదీ నడుం బిగించారు. ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు, ప్రజల చొరవతో ఒకప్పుడు మురికి కూపాలుగా ఉన్న ప్రాంతాలుసైతం ప్రస్తుతం పరిశుభ్రంగా మారాయి. ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రతే కాదు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన వచ్చింది. కానీ ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ విభాగాల తీరు మారడంలేదు... కార్యాలయాల చుట్టూ చెత్తాచెదారం, అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంటుంది. ఇలా తీరుమారని విభాగాల్లో ఇండియన్ రైల్వే కూడా ఒకటి.
రైల్వే అనగానే అపరిశుభ్రంగా ఉండే స్టేషన్లు, చెత్తకుప్పగా ఉపయోగించే ట్రాక్స్, ప్రయాణికులు వేసే చెత్తతో నిండిన రైళ్ళు గుర్తుకువస్తాయి. ప్రస్తుతం చాలా రైల్వే స్టేషన్లలో తీరు మారింది... పరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. కానీ కొన్ని స్టేషన్లు ఇప్పటికీ అపరిశుభ్రంగానే ఉంటున్నాయి. ఇలా ప్రయాణికులు ఆ స్టేషన్ల నుండి ప్రయాణమంటేనే భయపడిపోతుంటాయి... ఇలాంటి టాప్ 5 చెత్త రైల్వే స్టేషన్ల గురించి తెలుసుకుందాం.
26
1. పెరుంగళతూర్ రైల్వే స్టేషన్ (తమిళనాడు)
రైల్ స్వచ్చ్ పోర్టల్ ప్రకారం దేశంలోనే అత్యంత చెత్త రైల్వే స్టేషన్ తమిళనాడులో ఉంది. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగించే దక్షిణ రైల్వే పరిధిలోకి వస్తుంది పెరుంగళతూర్ స్టేషన్. దీని పరిసరాలు, ట్రాక్ చెత్తాచెదారంతో నిండివుంటుంది... దీంతో ఈ రైల్వే స్టేషన్ చెత్త స్టేషన్ గా చెడ్డపేరు తెచ్చుకుంది.
36
2. షహనాజ్ గంజ్ రైల్వే స్టేషన్ (ఉత్తర ప్రదేశ్)
ఉత్తర ప్రదేశ్ లోని షహనాజ్ గంజ్ రైల్వే స్టేషన్ అత్యంత చెత్త రైల్వే స్టేషన్ల జాబితాలో రెండో స్ధానంలో నిలిచింది. ఈ రైల్వే స్టేషన్ నుండి నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారు... వీరి వేసే ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తతో రైల్వే స్టేషన్ అపరిశుభ్రంగా మారుతుంది. దీన్ని వెంటనే క్లీన్ చేయకపోవడంతో చెత్త పేరుకుపోతుంది.
దేశాన్ని పాలించే ప్రముఖులంతా నివసించే రాజధాని నగరం డిల్లీ… ఇలాంటి నగరంలో కూడా అత్యంత చెత్త రైల్వే స్టేషన్ ఉంది. సదర్ బజార్ రైల్వే స్టేషన్ అత్యంత మురికి రైల్వే స్టేషన్లలో మూడో స్థానంలో నిలిచింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ రైల్వే స్టేషన్ పరిసరాల్లో చెత్త వేయడం, మురికినీటి ప్రవాహం కోసం ఏర్పాటుచేసిన కాలువలను సరిగ్గా మెయింటేన్ చేయకపోవడంతో చాలా అపరిశుభ్ర వాతావరణం ఉంటుంది. నిత్యం దుర్గందంతో కూడిన ఈ స్టేషన్ నుండి ప్రయాణమంటేనే రాజధాని ప్రజలు జంకిపోయే పరిస్థితి ఉంది.
56
4. ఒట్టపాలెం రైల్వే స్టేషన్ (కేరళ)
దక్షిణ భారతదేశంలోని మరో చెత్త రైల్వే స్టేషన్ కేరళలో ఉంది. పాలక్కాడ్ జిల్లాలోని ఈ రైల్వే స్టేషన్ దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది... నిర్వహణ లోపం కారణంగా ఇది చెడ్డపేరు తెచ్చుకుంది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ రైల్వే స్టేషన్ లో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. అయినా అపరిశుభ్రమైన స్టేషన్ గానే మిగిలిపోయింది.
66
5. గుడువాంచెరి రైల్వే స్టేషన్
దేశంలోని టాప్ 5 అపరిశుభ్ర రైల్వే స్టేషన్ల జాబితాలో తమిళనాడుకు చెందినవే రెండు ఉన్నాయి. గుడువాంచెరి రైల్వే స్టేషన్ చెన్నై సబర్బన్ రైల్వే నెట్ వర్క్ పరిధిలోకి వస్తుంది. ఇది దేశంలో ఐదో అత్యంత చెత్త రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది.