Salting the Earth: పూర్వం రాజులు శత్రురాజ్యాలను నాశనం చేసేందుకు ఎన్నో పన్నాగాలు పన్నేవారు. అందులో ఒకటి ఉప్పు చల్లడం. రాజ్యమంతా ఉప్పు చల్లడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా? ఇది మిగతా రాజ్యాలకు వార్నింగ్ కూడా ఇచ్చినట్టేనట.
పూర్వకాలంలో యుద్ధాలు జరిగిన తరువాత రాజులు చాలా దారుణంగా ప్రవర్తించేవారట. ఓడిపోయిన రాజ్యం తిరిగి కోలుకోకుండా ఉండేందుకు తమకు తెలిసిన వినాశక ప్లానింగ్ లు వేసేవారు. ఓడిపోయిన రాజ్యం పూర్తిగా బలహీనపడాలి, మళ్లీ శక్తిని తిరిగి సంపాదించకుండా చూడాలి అన్న ఉద్దేశంతో గెలిచిన రాజులు అరాచక రాజకీయాలు చేసేవారు. అలాంటి వాటిల్లో ఒకటి ఉప్పు చల్లడం ఒకటి. శత్రువుల నగరం లేదా వారి వ్యవసాయ భూములపై ఉప్పును పూర్తిగా చల్లేస్తారు. ఇది అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో ఇది ఎంతో ప్రతీకార చర్యగా భావించేవారు. చరిత్రలో దీనిని Salting the Earth అని పిలుస్తారు.
25
శత్రు రాజ్యాన్ని బలహీనపరపడమే ఉద్దేశం
పురాతన కాలంలో ఒక రాజ్యం బలం కేవలం సైన్యంలోనే కాకుండా, ఆహార ఉత్పత్తి, వ్యవసాయం, భూసారం మీద ఆధారపడి ఉండేది. భూమి సారాన్ని నాశనం చేస్తే ఆ రాజ్యం త్వరగా కోలుకోలేదు. అందువల్ల యుద్ధం గెలిచిన వెంటనే శత్రువుల వ్యవసాయ భూములపై బస్తాల కొద్దీ ఉప్పును చల్లేవారు. భూమిలో ఉప్పుదనం పెరిగితే మొక్కలు పెరగవు, నీరు నిలవదు, నేలలోని ఖనిజాలు నాశనం అవుతాయి. ఒకసారి ఈ నష్టం జరిగితే పంటలు పండడానికి ఏళ్ళు పట్టేది. ఈ విధంగా శత్రువుల ఆర్థిక శక్తిని పూర్తిగా దెబ్బతీయడం ద్వారా వారిని మళ్లీ ఎదగకుండా చేయడమే అసలు ఉద్దేశం.
35
శాశ్వత నాశనమే లక్ష్యం
ఉప్పు చల్లడం కేవలం వ్యవసాయాన్ని చెడగొట్టడం మాత్రమే కాదు. అదొక శాశ్వత నాశనం చేసే సంకేతం కూడా. ఈ నగరం ఇక మళ్లీ తిరిగి ఎదగకూడదు, ఇక్కడ కొత్త రాజ్యం ఆవిర్భవించకూడదు అనే గట్టి సందేశాన్ని అందించడానికి ఇలాంటి పనులు చేసేవారు. అనేక సంస్కృతుల్లో ఉప్పు శాపానికి, నిషేధానికి ప్రతీకగా భావించేవారు.ఆ రాజ్యం ప్రజలలో భయం, నిస్సహాయతను కలిగించడం ద్వారా గెలిచిన రాజు శక్తిని చాటడానికి ఇలాంటి పనులు చేసేవారు.
కొన్ని చారిత్రక పుస్తకాల్లో ఉప్పు చల్లడం తర్వాత ఆ నగరాన్ని పునర్నిర్మించడానికి ప్రజలకు ధైర్యం ఉండదని, దాన్ని శాప భూమిగా భావిస్తారనే వాదనలు ఉన్నాయి. అందువల్ల ఈ చర్య రాజకీయంగా, మానసికంగా కూడా శత్రువులను దెబ్బతీయడంలో ఎంతో ప్రభావవంతం. ఈ ఆచారం ఎక్కువగా పురాతన రోమన్ సామ్రాజ్యం లాంటి ప్రాంతాల్లో కనిపించింది. కార్తేజ్ నగరాన్ని రోమన్లు పూర్తిగా నాశనం చేసినప్పుడు భూమిపై ఉప్పు చల్లినట్టు కథనాలు ఉన్నాయి. అయితే ఇది పూర్తిగా చారిత్రకంగా రుజువైందా అనే విషయంలో చరిత్రకారుల మధ్య కొన్ని వాదనలు ఉన్నాయి.
55
మనదేశంలో కూడా ఇలా చేసేవారా?
అయితే మనదేశంలో మాత్రం ఇలాంటి ఉప్పు చల్లే ఆచారం ఉన్నట్టు చెప్పే పెద్ద ఆధారాలు లేవు. కానీ శత్రు రాజ్యాన్ని ఆర్థికంగా, వ్యవసాయపరంగా బలహీనపరచే వ్యూహాలు మాత్రం భారత్‌లో కూడా అనేక రాజ్యాలు పాటించేవి. యుద్ధం అంటే కేవలం ఆయుధాలు, సైన్యాల పోరాటం మాత్రమే కాదు. ప్రజల మానసిక ధైర్యం, నమ్మకం, భవిష్యత్తుపై ఆశ కూడా. శత్రు రాజ్యం మీద ఉప్పు చల్లడం వలన ఆ ప్రజల్లో.. మన భూమి నాశనం అయిపోయింది, ఇక పంటలు పండకపోవచ్చు అనే భయం పెరిగేది. ఈ భయం ద్వారా ప్రజలు తిరుగుబాట్లు చేయకుండా, ప్రతిఘటన చేయకుండా, గెలిచిన రాజు పాలనను అంగీకరించేవారు.