Top 5 Costliest Cities 2026: ప్రపంచంలో లగ్జరీ లైఫ్‌స్టైల్ ను అందించే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అయితే, లగ్జరీ లైఫ్‌స్టైల్ ఇండెక్స్‌లో మాత్రం సింగపూర్ టాప్‌లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 5 నగరాల పూర్తి వివరాలు మీకోసం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిటీగా సింగపూర్.. టాప్ 5 లగ్జరీ నగరాలు ఇవే
లగ్జరీ లైఫ్ గడపాలంటే ఆస్తులుండాలి.. అంతకుమించి ఆ నగరాల్లో నివసించే సత్తా ఉండాలి. జూలియస్ బేర్ తాజాగా రిలీజ్ చేసిన 2026 లైఫ్‌స్టైల్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితా బయటకు వచ్చింది. ఇందులో వరుసగా నాలుగో ఏడాది కూడా సింగపూర్ తన టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకుంది. పెరిగిపోతున్న ప్రాపర్టీ రేట్లు, కార్ల ధరలు, బలమైన సింగపూర్ డాలర్ వాల్యూ వల్ల ఈ సిటీ రిచ్ పీపుల్‌కు అడ్డాగా మారింది. గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్‌గా ఉన్న ఈ సిటీతో పాటు ప్రపంచంలోని టాప్ 5 అత్యంత ఖరీదైన నగరాల వివరాలు గమనిస్తే..
26
లండన్‌కు ఐదో స్థానం
బ్రిటన్ రాజధాని లండన్ ఈసారి ఒక స్థానం కిందకు పడిపోయి ఐదో ప్లేస్‌కు చేరుకుంది. స్థానం తగ్గినప్పటికీ, లగ్జరీ ఖర్చుల విషయంలో లండన్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక్కడి ప్రీమియం ప్రాపర్టీ మార్కెట్, ఎలైట్ ఎడ్యుకేషన్, ఫైన్ డైనింగ్, లగ్జరీ రిటైల్ షాపింగ్ వల్ల ఇది ఇప్పటికీ అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటీశ్వరులు తమ బిజినెస్, లైఫ్‌స్టైల్ కోసం ఇప్పటికీ లండన్ వైపే మొగ్గు చూపుతున్నారు.
36
నాలుగో ప్లేస్‌లో హాంగ్‌కాంగ్
2026 లైఫ్‌స్టైల్ ఇండెక్స్‌లో హాంగ్‌కాంగ్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఆసియాలోనే అత్యంత కాస్ట్‌లీ నగరాల్లో ఒకటిగా హాంగ్‌కాంగ్ తన ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తోంది. ఇక్కడి భారీ ప్రాపర్టీ ధరలు, ప్రీమియం రిటైల్ మార్కెట్, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సెక్టార్ కారణంగా లగ్జరీ ఖర్చులు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నప్పటికీ, ఇంటర్నేషనల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, ధనిక కుటుంబాలకు హాంగ్‌కాంగ్ మెయిన్ డెస్టినేషన్‌గా మారింది.
లైఫ్‌స్టైల్ ఇండెక్స్‌ను 2020లో స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తే, మొనాకో టాప్ 3లోకి రావడం ఇదే మొదటిసారి. అల్ట్రా లగ్జరీ రియల్ ఎస్టేట్, టాక్స్ ఫ్రెండ్లీ పాలసీలు, ఎక్స్‌క్లూజివ్ లైఫ్‌స్టైల్‌కు మొనాకో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. హై నెట్ వర్త్ ఉన్న వ్యక్తులకు ఇది ఎప్పుడూ ఫేవరెట్ స్పాట్. ప్రీమియం హౌసింగ్, లగ్జరీ సర్వీసులకు ఇక్కడ డిమాండ్ భారీగా పెరగడం వల్లే మొనాకో ఈ ఏడాది మూడో స్థానానికి దూసుకొచ్చింది.
56
మూడు స్థానాలు ఎగబాకిన జూరిచ్
స్విట్జర్లాండ్ నగరం జూరిచ్ ఈసారి ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. లండన్‌ను వెనక్కి నెట్టి మరీ జూరిచ్ ఈ రేంజ్‌కు రావడం వెనుక స్విస్ ఫ్రాంక్ కరెన్సీ బలం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ పరంగా ఏం జరుగుతున్నా, స్విస్ ఫ్రాంక్ సేఫ్ హెవెన్ కరెన్సీగా నిలుస్తోంది. స్విట్జర్లాండ్‌లో ఉన్న పొలిటికల్, ఎకనామిక్ స్టెబిలిటీ వల్ల అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు, ధనవంతులకు జూరిచ్ మోస్ట్ అట్రాక్టివ్ సిటీగా మారింది.
66
నంబర్ 1 ప్లేస్‌లో సింగపూర్
లగ్జరీ లివింగ్‌లో సింగపూర్‌ను కొట్టే మొనగాడు లేడని మరోసారి నిరూపితమైంది. వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ సిటీ స్టేట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా రికార్డు సృష్టించింది. ఇక్కడ నివాస గృహాల ధరలు విపరీతంగా పెరగడం, కార్ ఓనర్‌షిప్ ఖరీదైనది కావడం, సింగపూర్ డాలర్ బలంగా మారడం దీనికి ప్రధాన కారణాలు. పొలిటికల్ స్టెబిలిటీతో పాటు సేఫ్, హై ఎండ్ లైఫ్‌స్టైల్ కావాలనుకునే గ్లోబల్ రిచ్ పీపుల్‌కు సింగపూర్ మొదటి ఛాయిస్‌గా నిలుస్తోంది.